• English
  • Login / Register

నిర్దేశాలను ధృవీకరించిన 2016 ఫోర్డ్ ఫోకస్: 350PS మరియు 470Nm (వీడియో)

ఫోర్డ్ ఫోకస్ కోసం raunak ద్వారా జూన్ 26, 2015 05:47 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మా దగ్గర అనేక సూపర్ మోడల్ కార్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 300 పి ఎస్ శక్తిని ఉత్పత్తి చేసే కార్లు ఉండగా కొత్తగా 350 పి ఎస్ శక్తిని ఉత్పత్తి చేసే కారు ఈ జాబితా లో చేరనుంది.

జైపూర్: ఫోర్డ్ మోటార్ కంపెనీ ఫిబ్రవరిలో కొన్ని నెలల క్రితం రాబోయే ఫోర్డ్ ఫోకస్ కారు వివారాలను వెల్లడించడం ద్వారా ఔత్సాహికులని ఆకట్టుకుంది. ఫోర్డ్ ఫోకస్ యొక్క మూడవ తరం కారైన ఈ ఆర్ ఎస్, గరిష్టంగా 350 పి ఎస్ మరియు 470 ఎన్ ఎం టార్క్ ని 2.3 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ ఎకోబూస్ట్ ఇంజిన్ నుండి అందిస్తుంది. దీని నాలుగు వీల్స్ కి, శక్తి 6-మాన్యువల్ ట్రాన్స్మిషన్ ద్వారా అందించబడుతుంది. ఫోర్డ్ వాహనం అయిన మస్టాంగ్ లో ఉండే ఇంజిన్ తో ఫోర్డ్ ఫోకస్ రూపొందించబడినప్పటికీ మస్టాంగ్ 310 పి ఎస్ శక్తిని మాత్రమే అందించగా ఈ కారు దాని కంటే అధనంగా 40 పి ఎస్ శక్తిని అందించడం విశేషం.

దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఫొర్డ్ ఫోకస్ ఆర్ ఎస్ అనేది మూడవ తరానికి చెందిన కారు. ఈ కారు యొక్క ఇంజన్, మస్టాంగ్ లో ఉన్న అదే 2.3-లీటర్ 4-సిలిండర్ ఈకోబూస్ట్ ఇంజన్ తో రాబోతుంది. కానీ, ఈ వాహనం యొక్క నిర్దేశాలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. ఈ ఫోర్డ్ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం, యూరప్ కు చెందిన కొలోన్ లో ఉంది.

ఈ ఈకోబూస్ట్ ఇంజన్ ముందు దాని కంటే 40 PS ఎక్కువ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు రాబోయే ఈ ఫోకస్ ఆర్ ఎస్ 350 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, అత్యధికంగా 470 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ వాహనం సాధారణంగా, 2000 rpm నుండి 4500 rpm వద్ద 440 Nm గల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  

ఫోర్డ్ ఇంకా దాని యొక్క పనితీరు గణాంకాలను బహిర్గతం చేయలేదు. అంతేకాక, ఇది ఏడబ్ల్యూడి (ఆల్-వీల్-డ్రైవ్) సెటప్ తో వచ్చే మొట్టమొదటి ఫోకస్ వాహనం. అంతేకాకుండా, ఈ వాహనం లో ఇది కూడా డైనమిక్ టార్క్ వెక్టరింగ్, లాంచ్ నియంత్రణ మరియు ఇతర డ్రైవింగ్ రీతులు మధ్య 'డ్రిఫ్ట్ మోడ్' లను అందిస్తుంది. ఈ డ్రిఫ్ట్ మోడ్ లను ఇప్పటివరకు ఏ కారులోనూ చూడలేదు. ఈ ఫోకస్ ఆర్ ఎస్ కోసం మరిని వార్తలు చూస్తూ ఉండండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford ఫోకస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience