2016 ఫోర్డ్ ఎండీవర్: నిర్దేశాలు మరియు లక్షణాలు

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం konark ద్వారా జనవరి 21, 2016 02:26 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్ సంస్థ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎస్యువి అయిన ఎండీవర్, మార్కెట్ లో రూ 24.75 లక్షల పోటీ ధర ట్యాగ్ ఎక్స్-షోరూమ్ ముంబై వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ వాహనం, ఏ ఏ ఆఫర్ లను కలిగి ఉంది? ఒకసారి చూద్దాం రండి.

 

ఇంజిన్ ఎంపికలు
ఈ ఎండీవర్, రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి వరుసగా, 2.2 లీటర్ 4 సిలండర్ డీజిల్ ఇంజన్ మరియు 3.2 లీటర్ 5 సిలండర్ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు, 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. మరోవైపు 2.2 లీటర్ ఇంజన్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇంజను అవుట్పుట్
ముందుగా 3.2 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 200 పి ఎస్ పవర్ ను అదే విధంగా 470 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 160 పి ఎస్ పవర్ ను అదే విధంగా 385 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

లక్షణాలు

  • ఈ వాహనం రెండు వేరియంట్ స్థాయిలలో వస్తుంది- ట్రెండ్ మరియు టైటానియం మరియు మొత్తం ఆరు వేరియంట్లు. 
  • ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టైటానియం వేరియంట్ భద్రతా అంశాల విషయానికి వస్తే, ఏడు ఎయిర్ బాగ్లు (డ్రైవర్, ప్రయాణికుడి, సైడ్ మరియు కర్టైన్ ఎయిర్బాగ్లు, మోకాలి ఎయిర్బాగ్)
  • ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, డ్యూయల్ ఎయిర్బాగ్లు అందించబడతాయి (డ్రైవర్ మరియు ప్రయాణికుడి వైపు ఎయిర్బాగ్) 
  • ఇతర లక్షణాల విషయానికి వస్తే, టెర్రైన్ మేనేజ్మెంట్ వ్యవస్థ, సెమి ఆటోమేటిక్ పేర్లల్ పార్క్ అసిస్ట్, సింక్2 సమాచార వ్యవస్థ తో 8- అంగుళాల డిస్ప్లే స్క్రీన్, బ్లూటూత్, యూఎస్బి, ఆక్స్ ఇన్, 8 విదాలుగా సర్ధుబాటయ్యే ముందు సీట్లు, 9- స్పీకర్ల ఆడియో వ్యవస్థ, యాంబియంట్ లైటింగ్ మరియు విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే మూడవ వరుస సీట్లు వంటి అదనపు అంశాలు ఈ వాహనానికి అందించబడతాయి. టెర్రైన్ మేనేజ్మెంట్ వ్యవస్థ, స్నో, మడ్, గ్రాస్ మరియు రాక్ వంటి నాలుగు విదాల సర్ధుబాటు సెట్టింగ్ లతో వస్తుంది. 

కొలతలు

  • పొడవు 4893 మిల్లీ మీటర్లు
  •  వెడల్పు - 1862 మిల్లీ మీటర్లు
  • ఎత్తు- 1837 మిల్లీ మీటర్లు
  •  వీల్బేస్- 2850 మిల్లీ మీటర్లు
  •  గ్రౌండ్ క్లియరెన్స్- 225 మిల్లీ మీటర్లు
  • నీటి వేడింగ్ సామర్ధ్యం- 800 మిల్లీ మీటర్లు

వేరియంట్ నిర్దిష్ట ధర

వేరియంట్

ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీ)

3.2 టైటానియం ఏ టి 4X4 (డీజిల్)

28, 15,000

3.2 ట్రెండ్ ఏటి 4X4 (డీజిల్)

26, 54,000

2.2 టైటానియం ఏటి 4X2 (డీజిల్)

26, 14,000

2.2 ట్రెండ్ ఎం టి 4X4 (డీజిల్)

25, 49,000

2.2 ట్రెండ్ ఏటి 4X2 (డీజిల్)

24, 39,000

2.2 ట్రెండ్ ఎం టి 4X2 (డీజిల్)

23, 63,000

ఫోర్డ్ ఎండీవర్ ప్రారంభం వీడియో ను వీక్షించండి

మా మొదటి డ్రైవ్ రివ్యూ చూడండి

ఇది కూడా చదవండి:పోలిక: కొత్త ఫోర్డ్ ఎండీవర్ VS ప్రత్యర్ధులు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience