• English
  • Login / Register

ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న బహిర్గతం కాబోతున్న 2016 బిఎండబ్ల్యూ 7-సిరీస్

బిఎండబ్ల్యూ 7 సిరీస్ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా జూన్ 08, 2015 05:28 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారుడైన బిఎండబ్ల్యూ సంస్థ, 2016, 7 సిరీస్ యొక్క నవీకరించబడిన కారును, జూన్ 10న అధికారికంగా బహిర్గతం చేయబోతున్నారు. దీనికి ముందు, తయారీదారుడు అనుకోకుండా బిఎండబ్ల్యూ ఆస్ట్రియా అనే ఆన్లైన్ వెబ్సైట్ లో విడుదల చేశారు, కాని ఇప్పుడు తొలగించబడ్డాయి. ఈ ఆస్ట్రియా వెబ్సైట్ లో ఈ 2016, 7 సిరీస్ కారు యొక్క అంతర్గత చిత్రాలు మరియు బాహ్య చిత్రాలు మరియు వాటి లక్షణాలను ప్రతిదీ చూపించబడ్డాయి. భారతదేశం లో, బిఎండబ్ల్యూ 2016, 7 సిరీస్ కారును ఈ సంవత్సరం చివరిలో లేదా 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రవేశపెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

ఆస్ట్రియన్ వెబ్సైట్ గురించి మాట్లాడటానికి వస్తే, కార్ల పట్ల ఆసక్తి కలిగిన ప్రజలు అనుకోకుండా విడుదల అయిన ఈ కారు యొక్క సమాచారాన్ని,  స్నాప్షాట్లు రూపంలో తీసుకోగలిగారు. అంతేకాకుండా, ఈ కారు గురించి చాలా సమాచారాన్ని ఆస్ట్రియన్ వెబ్సైట్ ద్వారా పొందగలిగారు. ఈ సమాచారం లో కొత్త 7-సిరీస్ తో అందజేసిన అన్ని లక్షణాలను శాఖలు బహిర్గతం అయ్యాయి. ఈ రాబోయే 7-సిరీస్ లో  పూర్తిగా డిజిటైజ్ డ్రైవర్ ఇంఫర్మేషన్ క్లస్టర్, డాష్ బోర్డ్ పై ఫ్రీస్టాండింగ్ సమాచార స్క్రీన్, వెనుక సీటు మధ్య ఒక శీతలీకరణ బాక్స్, అనేక రంగుల ఎంపికలతో అపోలిస్ట్రీ, బ్రాండ్ యొక్క బెంచ్మార్క్ కు తగ్గట్టుగా క్రొత్తగా డిజైన్ చేయబడిన డాష్బోర్డ్, ఉత్సాహికుల కోసం ఇవన్ని ఇవ్వబడ్డాయి.     

రాబోతున్న మోడల్, ముందు మోడల్ తో పోలిస్తే, బాహ్య బాగాలు చూడటానికి మరినత ఆకర్షణీయంగా మరియు అనేక రంగు ఎంపికలతో రాబోతుంది. అవి వరుసగా, కార్బన్ బ్లాక్, సోఫిస్టో గ్రే, ఇంపీరియల్ బ్లూ, సింగపూర్ గ్రే, మినరల్ వైట్, ఆర్టిక్ గ్రే బ్రిలియంట్, జతోబా మరియు మాగెల్లాన్ గ్రే, బ్లాక్ నీలమణి, ఆల్పైన్ తెలుపు మరియు కష్మెరె సిల్వర్. ఆస్ట్రియా లో ఈ అన్ని రంగులతో అందుబాటులో ఉంది, కానీ భారతదేశంలో వీటిలో కూన్ని ఎంపికలతో రావచ్చు, లేదా అన్ని రంగులతో కూడా రావచ్చు. ఈ రాబోయే కార్ల యొక్క వీల్ పరిమాణ పరిది 17-20 అంగుళాల మద్యలో ఉంటుంది. దీనిలో నుండి ఒక పరిధిని ఎంచుకోవచ్చు మరియు ం ప్యాకేజీ అదనంగా పొందవచ్చు. దీనితో పాటు స్ప్లిట్ విస్తృత సన్రూఫ్ ను కూడా పొందవచ్చు.  

రాబోయే 7-సిరీస్, 730డి వేరియంట్ యొక్క ఇంజెన్ అత్యధికంగా 261.4 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు ఈ వేరియంట్ భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉండబోతుంది. 740ఐ వేరియంట్ యొక్క ఇంజెన్ గరిష్ట్టంగా 321.6 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికంటే ఎక్కువగా 750ఐ వేరియంట్ అత్యధిక పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 750ఐ వేరియంట్ అత్యధికంగా 444bhp పవర్ ను విడుదల చేస్తుంది. 

ధర పరంగా చెప్పాలంటే, 7-సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ కూడా 1.2 కోట్లకు పైగా ధరను కలిగి ఉంటుంది.  

was this article helpful ?

Write your Comment on BMW 7 సిరీస్ 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience