2015TokyoMotorShowLive: సుజుకి ఇగ్నీస్ ప్రపంచ ప్రదర్శన చేసింది!

మారుతి డిజైర్ 2017-2020 కోసం raunak ద్వారా అక్టోబర్ 28, 2015 06:07 pm ప్రచురించబడింది

జైపూర్: 

Maruti Suzuki IGNIS

తయారీదారులు వారు రాబోయే ఐదేళ్లలో 20 కొత్త ఉత్పత్తులు ప్రారంభించబోతున్నారు. బాలెనో మరియు ఎస్-క్రాస్ కూడా ఆ ప్రణాళికలో భాగంగా ప్రారంభించారు. అదేవిధంగా మారుతి సుజికి దేశంలో ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ని ప్రారంభించబోతున్నారు.  

కొనసాగుతున్న 2015 టోక్యో మోటార్ షోలో సుజుకి ఇగ్నీస్ తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేసింది. ఈ వాహనం ఐఎం4 కాన్సెప్ట్ యొక్క ఉత్పత్తి వెర్షన్. సుజికి ఈ వాహనాన్ని ముందుగా 2015 జెనీవా మోటార్ షో లో ప్రదర్శించింది. జపనీస్ వాహన తయారీసంస్థ కొలతలు మరియు ఇంజన్ ఎంపికలు వంటివి కాకుండా ఉత్పత్తి గురించి ఇంకా ఎటువంటి వివరాలను అందించలేదు. భారతీయ అరంగేట్రం గురించి మాట్లాడుకుంటే, నిజానికి ఏ సందేహం లేదు,  రాబోయే నెలల్లో మహీంద్రా వారి ఎస్101 ప్రారంభించే సమయంలో ఈ వాహనాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఆ రెండు వాహనాలు కూడా ఒకే తరహా ఉత్పత్తులు. 

కొలతలు:

  • పొడవు: 3700mm
  • వెడల్పు: 1660mm
  • ఎత్తు: 1595mm

Maruti Suzuki IGNIS

Maruti Suzuki IGNIS

ఈ వాహనం కొలతల పరంగా చిన్నగా, అధిక వైఖరి, ప్రముఖ వీల్ ఆర్చులు మరియు ఎటువంటి ఓవర్‌హ్యాంగ్ లు లేకుండా చూడడానికి సాధారణ కాంపాక్ట్ ఎస్యువి వలే ఉంది. దీని ముందరి ప్రొఫైల్ పెద్ద గ్రిల్ తో ఉండి పూర్తిగా హెడ్ల్యాంప్స్ ని కప్పబడే విధంగా ఉంది. ఇంకా దీనిలో ఏ మరియు బి పిల్లర్స్ నలుపు రంగులో ఉన్నాయి.   

ఈ వాహనం యొక్క వెనుక ప్రొఫైల్ జపాన్ యొక్క సుజికి ఆల్టో ని గుర్తుచేస్తుంది. అంతర్భాగాల గురించి మాట్లాడుకుంటే, దీని లోపలి భాగాలు అన్నీ కూడా కొత్తవి. బాలెనో వలే ఏ ఒక్కటి కూడా ప్రస్తుతం ఉన్న సుజికీ నుండి తీసుకోబడలేదు.  ఈ వాహనం యొక్క క్యాబిన్ అంత బిగుతుగా లేదు కానీ సమాచార వ్యవస్థ మాత్రం పొడుచుకు వచ్చినట్టు ఉంది.  

యాంత్రికంగా, వాహనం సుజికి యొక్క  1.2 లీటర్ ద్వంద్వ-జెట్ మోటార్ తో అమర్చబడి ఉంది. ఈ మోటార్ సుజికి తేలికపాటి హైబ్రిడ్ ఎస్విహెచ్ఎస్ టెక్ తో అమర్చబడి ఉంది. దీనిలో శక్తి ఒక 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఒక సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా గాని ద్వారా నిర్వహించబడుతుంది. ఈ వాహనం 2 వీల్ డ్రైవ్ టెక్నాలజీ తో ప్రామాణికంగా అందించబడుతుంది. అయితే, 4 వీల్ డ్రైవ్ మాత్రం ఆప్షనల్ గా ఉంటుంది.

Maruti Suzuki IGNIS

Maruti Suzuki IGNIS

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Dzire 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience