• English
  • Login / Register

2015 ఫోర్డ్ ఫీగో సెప్టెంబర్ 23న విడుదల కానుంది

ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 15, 2015 04:46 pm సవరించబడింది

  • 15 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆస్పైర్ యొక్క మంచి ప్రారంభం తరువాత, ఫోర్డ్ ఇండియా వారు ఫీగో యొక్క భర్తీ ని వచ్చే వారం తీసుకు రాబోతున్నారు!

జైపూర్:

ఫోర్డ్ ఇండియా వారు రెండవ తరం ఫీగో ని ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఈ హ్యాచ్ బ్యాక్ యొక్క బాహ్య రూపం మరియూ వేదిక కూడా ఈ మధ్యనే విడుదల అయిన ఆస్పైర్ లాగే ఉంటుంది. ఈ వాహనం మారుతీ సుజుకీ స్విఫ్ట్, హ్యుండై గ్రాండ్ ఐ10 మరియూ టాటా బోల్ట్ తో తలపడనుంది. పైగా, ఫోర్డ్ ఇప్పటికే ఫీగో ని నిలిపి వేసింది. ఈ వాహనం దానిని భర్తీ చేస్తుంది.

ఆస్పైర్ లాగా, కొత్త ఫీగో కి ప్రామాణిక డ్యుయల్ ముందు వైపు ఎయిర్ బ్యాగ్స్ మరియూ ఇంజిను కూడా ఆస్పైర్ కి అందించినదే ఉంటుంది. ఈ హ్యాచ్ ని మేము కొద్ది నెలల క్రితం ఒక డీలర్షిప్ దగ్గర చూశాము ఇప్పటికే. టైటానియం ప్లస్ కి మొట్టమొదటి సారిగా 6 ఎయిర్ బ్యాగ్స్, ఫోర్డ్ యొక్క సింక్ ఆడియో సిస్టం, ఆటో ఏసీ ని నల్ల డ్యాష్ బోర్డ్ పై అమర్చి అందించారు.

సాంకేతికంగా, దీనికి కొత్త 1.2-లీటర్ టీ-వీసీటీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఉంటుంది. ఇది 88ps ని 6300rpm వద్ద మరియూ 112Nm టార్క్ ని 4000rpm వద్ద విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటుంది.

డీజిల్ కి 1.5-లీటర్ టీడీసీఐ మోటార్ ఉంటుంది. ఇది 3750rpm వద్ద 100ps ని మరియూ 215Nm టార్క్ ని 1750 - 3000rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ద్వారా పంపిణీ చేయబడి ఊహించిన దాని కంటే లీటర్ కి ఎక్కువ మైలేజీ ని అందిస్తుంది ఈ ఫీగో లో. ఆస్పైర్ యొక్క 1.5-లీటర్ టీ-వీసీటీ పెట్రోల్ తో 6-స్పీడ్ డీసీటీ (డ్యువల్-క్లచ్ ఏటీ) ఈ 2015 ఫీగో కి అందిస్తారో లేదో ఇంకా తెలియ రాలేదు. చూస్తూనే ఉండండి!

was this article helpful ?

Write your Comment on Ford Fi గో 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience