10 వ తరం హోండా సివిక్ కొత్త 1.0 లీటర్ టర్బో విటెక్ ఇంజిన్ ని పొందబోతుంది
హోండా సివిక్ కోసం raunak ద్వారా అక్టోబర్ 28, 2015 12:52 pm ప్రచురించబడింది
- 15 Views
- 6 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
దేశంలో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు పెరుగుతున్న ధోరణి లో హోండా భారతదేశం లో ఈ కొత్త 1.0 లీటర్ టర్బో-చార్జ్డ్ ఇంజన్ ప్రవేశపెట్టబోతుంద
హోండా తదుపరి తరం అంటే 10 వ తరం మోడల్ సివిక్,రెండు కొత్త టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు 1.5 లీటర్ మరియు ఒక చిన్న 1.0-లీటర్ టర్బో VTEC పెట్రోల్ మోటార్ తో అమర్చబడి ఉంటుందని ప్రకటించింది. 10 వ తరం కాన్సెప్ట్ (హ్యాచ్‌బ్యాక్ అవతార్) అమెరికా లో ఈ సంవత్సరం మొదటి సారి బహిర్గతమైనది, అయితే 10 వ తరం సివిక్ సెడాన్ ఉత్పత్తి (ఫాస్ట్‌బ్యాక్ డిజైన్) కూడా యుఎస్ లో మాత్రమే గత నెల బహిర్గతమైనది. సివిక్ యొక్క హ్యాచ్ మరియు సెడాన్ వెర్షన్లు రెండూ కూడా కొత్త 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టర్బో VTEC మోటార్స్ తో 2017 లో యూరోపియన్ మార్కెట్ ని అదరగొడతాయి. భారతదేశం గురుంచి మాట్లాడుకుంటే, హోండా దేశంలో కొత్త వాహనాన్ని తిరిగి పరిచయం చేసే అవకాశం ఉంది, కానీ అదే చేయాలని ఎటువంటి తక్షణ ప్రణాళిక లేనట్టు కనిపిస్తుంది. ఈ వాహనం కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం నుండి నిలిపివేయబడింది, కానీ ఇది దేశంలో అనేక మంది అభిమానులని కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది వాడిన కార్ల మార్కెట్ లో బాగా రాణిస్తోంది.
కంపెనీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, హోండా 2015 9 వ సివిక్ టైప్- ఆర్ తో ఈ సంవత్సరం టర్బోచార్జెడ్ ఉత్పత్తి పెట్రోల్ ఇంజన్ ని ప్రవేశపెట్టారు. అది 2.0-లీటర్ టర్బో VTEC ఇంజిన్ 310ps శక్తిని అందిస్తుంది. అంతేకాక, హోండా 2017 లో యూరోపియన్ మార్కెట్ ని అదరగొట్టే 10 వ తరం సివిక్ యొక్క ఇంజిన్ల నిర్దేశాలు విడుదల చేయలేదు. కానీ 2015 9 వ తరం సివిక్ టైప్-ఆర్ లో తక్కువ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టర్బో చార్జర్స్ మరియు డైరెక్ట్ ఇంజక్షన్ టెక్నాలజీ తో పాటూ ఇంజిన్లు యొక్క కొత్త నిర్మాణం చూడవచ్చు.