టాటా టియాగో JTP మరియు టిగోర్ JTP సమీక్ష: ఫస్ట్ డ్రైవ్

Published On మే 14, 2019 By arun for టాటా టియాగో 2015-2019

సబ్ 10 లక్షల స్పోర్ట్స్ కారు వాస్తవంగా మారింది, దీనికి గానూ మనం JTP టిగోర్ మరియు టియాగోలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కానీ, ఈ స్పోర్టి మెషీన్స్ అంత సులువుగా ఉంటూ మనల్ని అంతే ఉత్తేజపరుస్తాయా?  

Tata Tigor and Tiago JTP

టాటా మొట్టమొదటి సారిగా టిగోర్ యొక్క JTP వెర్షన్లు అయిన టియాగో మరియు టిగోర్ ని ఫిబ్రవరి 2018 లో ఆటో ఎక్స్పో లో ప్రదర్శించినప్పుడు కార్దేఖో లో ఉన్న మేము అందరం ఆశ్చర్యానికి లోనయ్యాము. ఎందుకంటే మేము ఏదైతే చూశామో ప్రతీ ఔత్సాహికులు కూడా దేనిని అయితే కోరుకుంటున్నారో అదే మేము చూడడం జరిగింది. చాలా రోజులు నుండి రోజూ మన మధ్య ఇచ్చే కారు కి  స్టెరాయిడ్లు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మరియు టియాగో హాచ్ అనేది రెండూ కలిసి మనం కొనుక్కొనేలా ఉండేటట్టు చేయడానికి ఒక మంచి ఆధారం అయ్యాయి. ముఖం మీద చెప్పాలంటే టాటా ఖచ్చితంగా విజయం సాధించిందనే చెప్పాలి, దాని యొక్క మంచి పవర్ మరియు దాని యొక్క సస్పెన్షన్ ఇంకా దానిని బలపరిచాయి. కాసేపు మన ఆలోచనలకు తాళం వేసి ఒక దాని తరువాత ఒకటి దీనిలో ఏమున్నాయో చూద్దాము.  

బాహ్యభాగాలు

Tata Tigor JTP

విజువల్ నవీకరణలు కాంపాక్ట్ సెడాన్ లో ఉన్నట్టుగానే హ్యాచ్బ్యాక్ ఒకేలా ఉంటాయి. కానీ దీనివలన ఇది స్పోర్టీ కారు లుక్ లా వస్తుందని అన్న ఉద్దేశంతో చేయలేదు. దీని వైపు తలలు తిప్పడం మాత్రమే ఒక ప్రయోజనంగా ఈ మార్పులకు పెద్ద ప్రయోజనం ఉంది.

Tata Tiago JTP

కారు ముందు భాగం చూస్తే గనుక గ్లోస్ బ్లాక్ తో ఫినిషింగ్ చేసిన కొత్త గ్రిల్ కనిపిస్తుంది. ఎయిర్‌డ్యాం అనేది సాధారణ వెర్షన్ ల కంటే పెద్దదిగా ఉంటుంది, దీనివలన మీరు వెనుక కూర్చున్న ఇంటర్క్యూలర్ ని కూడా మనం స్పష్టంగా చుడవచ్చు. ఈ రెండిటి వలన ఇంజన్ ని చల్లగా ఉంచవచ్చు.

Tata Tiago JTP Tata Tigor JTP

హుడ్ మీద మరియు ఫెండర్స్ మీద మీరు వెంట్స్ ని చూడవచ్చు. మళ్ళీ, ఇవి ఒక షీట్ మెటల్ మీద ప్లాస్టిక్ ట్రిమ్ ముక్కలు పెట్టినట్టుగా ఉండవు. ఇవి పని చేస్తాయి, అంటే ఇంజన్ లో ఏదైనా వేడి ఉంటే అవి త్వరగా బయటకి వెళిపోయేలా చేస్తాయి.  

Tiago JTP Tiago JTP

ఈ JTP కవలలు కూడా స్పోర్టి రెండు-టోన్ థీమ్ ని కలిగి ఉంటాయి. శరీరం రంగుతో  సంబంధం లేకుండా, మీరు ఒక నల్లబడిన రూఫ్ ని పొందుతారు. మీరు ఎర్ర కారుని ఎంచుకుంటే, మీరు ORVM పైన ఒక గ్లాస్ బ్లాక్ ముగింపుని పొందుతారు మరియు మీరు తెల్లని రంగు ఎంచుకుంటే, మీకు కళ్ళు చెదిరే ఎరుపు రంగు వస్తుంది. దీని ప్రక్క భాగానికి వస్తే సైడ్ స్కర్ట్స్ రూపంలో ఇంకా విసువల్ డ్రామా వస్తుంది మరియు   15-ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి. ప్రక్క భాగం నుండి చూసినట్లయితే టియాగో మరియు టిగోర్ JTP 4mm క్రింద కూర్చుంటాయని చెప్పవచ్చు. పెద్ద అలాయ్ వీల్స్ మరియు లావుగా ఉన్న రబ్బర్ తో ఈ రెండు కార్లు సాలిడ్ వైఖరిని కలిగి ఉంటాయి.

Tiago JTP

వెనుక భాగం నుండి చూస్తే డ్యుయల్ ఎగ్సాస్ట్ టిప్స్ అనేవి మీ దృష్టిని ఆకర్షిస్తాయి. స్థిరత్వం కోసం ఏరోడైనమిక్స్ ని మెరుగుపర్చడంలో సహాయపడే ఒక డిఫ్యూజర్ కూడా ఉంది. టిగోర్ తో, మీరు XZ + వేరియంట్ నుండి కొత్త టెయిల్‌ల్యాంప్స్ ని గుర్తించవచ్చు.

Tata Tigor JTP

కాబట్టి డిజైన్ 'నేను వేగంగా ఉన్నాను' అని అరుస్తూ ఏమి లేదు, కేవలం అది మీకు ఒక భరోసాని ఇస్తుంది, నిస్సందేహంగా,ఈ కార్లు రెండూ కూడా ఉత్తేజాన్నిస్తాయి అని చెప్పవచ్చు.

Tata Tiago JTP

లోపల భాగాలు

Tata Tiago JTP

ఒకసారి లోపల చూస్తే మీరు నల్ల సముద్రం ద్వారా మీరు స్వాగతం పలకబడతారు. నలుపు డాష్బోర్డ్, సీట్లు మీద నల్లని అపోలిస్ట్రీ మరియు బ్లాక్ హెడ్‌లైనర్ ని కూడా పొందుతారు. ఈ ప్లేస్ రెడ్ కలర్ డాట్స్, సీట్స్ పైన అల్లికలు మరియు లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ అలాగే A.C వెంట్ల చుట్టూ ఉన్న సూక్ష్మ ఉపరితలంతో ఉంటుంది.

Tata Tiago JTP Tata Tiago JTP

మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది ఏమిటంటే మీ టచ్ మరియు ఫీల్ పాయింట్ల వద్ద మీ దృష్టి వెళుతూ ఉంటుంది. ఉదాహరణకు, స్టీరింగ్ అనేది మన్నికైనది, మరియు గేర్ లివర్ కూడా విభిన్న ఆకృతిని పొందుతుంది. సీటు ఎత్తుగా ఉండడం వలన మంచి డ్రైవింగ్ స్థానమును గుర్తించడం అంత సులభం కాదు, కానీ ఒకసారి మీరు ఓపికగా చూసుకున్నట్లయితే చక్కగా స్థిరపడతారు, ఇంటి వద్దనే ఉన్నట్టు మీరు భావిస్తారు.

Tata Tiago JTP

పరికరాల పరంగా, రెండు కార్లు XZ వేరియంట్ పై ఆధారపడి ఉంటాయి.  స్టెల్లార్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్, ఒక డీటైలెడ్ MID, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు అలాగే టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉన్నాయి. టియాగో JTP కు జోడింపులు 5.0-అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్ రూపంలో వస్తాయి మరియు స్మోకెడ్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వస్తాయి. మరోవైపు, టిగోర్ JTP, టియాగో JTP కలిగి ఉన్న ప్రతిదీ, మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సెంట్రల్ ఆర్ర్రెస్ట్, రివర్స్ కెమెరా వంటివి పొందుతాయి. ఇది ఇటీవలే ప్రారంభించిన టైగర్ XZ + నుండి స్పష్టమైన-లెన్స్ టెయిల్ ల్యాంప్స్ ను కూడా తెస్తుంది.    

Tata Tigor JTP

ప్రాక్టికాలిటీకి సంబంధించినంతవరకు ఎటువంటి తేడా లేదు అని ప్రస్తావించాల్సిన అవసరం లేదు, మీరు ముందు వరుసలో మరియు వెనుక సీట్లలో అదే మొత్తం గదిని పొందుతారు, అదే క్యూబీ హోల్స్ ని కూడా కలిగి ఉంటారు. బూట్ స్థలం విషయంలో అస్సలు రాజీపడదు మరియు టిగోర్ JTP కోసం 419 లీటర్స్ మరియు టియాగో JTP కోసం 265 లీటర్లు కలిగి ఉంటారు.

Tata Tiago JTP

ఇంజిన్ మరియు ప్రదర్శన

Tata Tigor JTP

JTP కవలలకు నెక్సన్ కాంపాక్ట్ SUV నుండి 1.2 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని అందిస్తుంది.  కానీ, అది కొంచెం ముంచెత్తింది. ఇది అధిక శక్తిని పెంచుతుంది, తక్కువగా తీసుకుంటుంది, దాని వలన గాలి ఫోర్స్ గా వస్తుంది, ఇంటర్క్యులర్ పెద్దది మరియు ఎగ్జాస్ట్ తక్కువ ఒత్తిడిని కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర పెట్టినప్పటికీ మీరు 114Ps యొక్క అధిక శక్తి సంఖ్యను పొందుతారు మరియు 150Nm కి పరిమితం చేయబడిన అధిక టార్క్ ని పొందుతారు. ఈ రెండు కార్లు 10 సెకన్లలో స్టాండ్స్టిల్ నుండి 100 కిలోమీటర్ల పరుగులు చేస్తాయని టాటా పేర్కొంది. ఒక స్టాప్వాచ్ తీసుకొని చూసినట్లయితే 11-సెకెన్లలో కవర్ చేస్తుంది. కాబట్టి, ఆదర్శ పరిస్థితుల్లో, పేర్కొన్న సమయాల్లో పూర్తిగా వాస్తవికత అనేది కనిపిస్తుంది.

మా ముఖాన నవ్వు ఏదైనా తెప్పించింది అంటే ఆ రెండు కార్లు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం అని చెప్పవచ్చు. మీరు స్పీడ్ గా వెళుతున్నప్పుడు ఒక ఆహ్లాధకరమైన శబ్ధం 4000Rpm దాటాక వస్తుంది. దీనికి తోడుగా ఒక త్రోటీ ఎగ్సాస్ట్ నోట్ తో వచ్చి అది అస్తామానూ అది శబ్ధం చేస్తుంది. ఇంకా ఆహ్లాదకరమైన విషయం ఏమిటంటే ఆ 'పిస్’ శబ్ధం, మీ గేర్ గనుక మీరు అప్ షిఫ్ట్ చేస్తున్నపుడు  బ్లో ఆఫ్ వాల్వ్ అదనపు బూస్ట్ తగ్గిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే ఈ కారుకి మిగిలిన కార్ల లా కాకుండా ఒక స్వభావం ఉంది మరియు బయట తిరిగే ఏ కారుకి ఎలాంటి స్వభావం ఉండదని మేము భావిస్తున్నాము.

Tata Tigor JTP

ఇది ఎంత వేగంతో వెళుతుంది, 0 -100Kmph  టైమింగ్స్ అవన్నీ అస్తమానూ మనం చూడలేము, అంతే కదా? కాబట్టి, మీరు JTP కవలలు ఎంచుకుంటే, వారు సులభంగా డ్రైవ్ చేయడం ద్వారా మీరు అనుకూలంగా ఉంటారు. 20Kmph లో మూడవ గేర్ లో ఇంజన కదలిక, శబ్ధం లేకుండా సిటీ అంతా తిరిగెస్తారు. ఇంకా చెప్పాలంటే ఇది అదే గేర్ లో 100kmph పై చిలుకు కూడా వెళిపోతుంది. కాబట్టి, రహదారిపై అధిగమించడం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆక్సిలరేటర్ మీద కాలు వేయండి మరియు హుడ్ కింద 114 హార్స్ పవర్ గురించి మాట్లాడుకోండి.

ఇటువంటి కార్ల నుండి మేము ఇంతకంటే ఏమీ కోరుకోవడం లేదు. ఈ రెండూ కూడా సిటీ లో ఉన్నప్పుడు చక్కగా ఒత్తిడి లేని ప్రయాణాన్ని అందిస్తుంది మరియు హైవే మీద వెళ్ళినప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న భావన ని కలిగిస్తుంది. ఈ కవలలు సాధారణమైన కన్నా మరింత సౌకర్యవంతమైనవి, టర్న్స్ అప్పుడు కూడా చక్కగా పనితీరుని చూపిస్తాయి. దీని గురించి మనం తరువాత మాట్లాడుకుందాము.

రైడ్ మరియు హ్యాండ్లింగ్

మేము  JTP లో సస్పెన్షన్ అనేది ఏమిటి విభిన్నమైనది చెప్పమని ప్రేరేపించినప్పుడు, వారు 'నల్ల కళ'గా పేర్కొన్నారు. అది ఏమిటో తెలుసుకోడానికి మేము ఈ రెండు కార్లలో తిరిగి చూశాము. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది అని భావించాము, ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్పోర్ట్స్ కారు కాబట్టి రైడ్ నాణ్యతలో చాలా బాగుంటుంది మేము భావిస్తున్నాము. వాస్తావానికి చెప్పాలంటే దానిలో ఏమీ లేదు.  

Tata Tiago and Tigor JTP

స్ప్రింగ్ ని ముట్టుకోలేదు, JTP ఇక్కడ డ్యాంపింగ్ మీద పని చేస్తుంది. రెండు కార్లు కూడా విరిగిన రోడ్స్ మీద సునాయాసంగా వెళిపోతాయి, క్యాబిన్ లో కూడా ఇబ్బంది పెట్టకుండా వెళిపోతాయి. ఇతర పనితీరు ఆధారిత కార్లల్లో, మీరు సాధారణంగా రోడ్డుపై వెళ్ళినట్టు అయితే క్యాబిన్ లోపల కుదుపులు అనేవి చూస్తారు. ఇక్కడ అలా ఉండదు, ఏవైనా గతకలు ఉంటే మనకి తెలియకుండా వెళిపోతుంది.

Tata Tiago JTP

మీరు గనుక ఘాట్ రోడ్డులపై వెళుతున్నట్లయితే, మీకు ఇంకా ఆనందం అనిపిస్తుంది, బాడీ రోల్ అనేది కంట్రోల్ లో ఉంటుంది మరియు భయంగా, చికాకుగా అయితే ఉండదు. మీరు ఇంకా స్పీడ్ గా వెళుతున్న కొలదీ మీకు ఆ బరువు బయట వీల్స్ మీద షిఫ్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, దానిని క్రిందకి దించి మీకు మంచి డ్రైవింగ్ ని అందిస్తుంది.

Tata Tigor JTP

లైన్స్ విషయానికి వస్తే స్టీరింగ్ అనేది మీకు అనుగుణంగా ఉంటుంది మరియు ముఖ్యంగా చెప్పాలంటే చాలా త్వరగా ప్రతిస్పందిస్తుంది. మీరు ముఖ్యంగా టియాగో JTP విషయానికి వస్తే అది మేము చూసి గానీ నమ్మలేము. మీకు వీల్ తిరుగుతున్నప్పుడు ఆ టైర్స్ కూడా అలాగే తిరుగుతాయి, మేము చూస్తే గానీ నమ్మలేదు. మీరు ఇంకా దీనిలో మెచ్చుకొనే విషయం ఏమిటంటే స్టీరింగ్ వీల్ బరువు ని ఎలా అయితే బిల్డ్ చేస్తుందో ఆ అంశం బాగా నచ్చుతుంది. ట్రిపుల్ డిజిట్ స్పీడ్ లో గనుక చూసినట్లయితే మిగిలిన కార్ల కంటే బాగా బరువుగా ఉంటుంది మరియు సెంటర్ కి కూడా బాగా వేగంగా వస్తుంది. దీనివలన JTP ఎలక్ట్రిక్ పవర్ కోడ్ తో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. హార్డ్వేర్ పరంగా, స్టీరింగ్ రాక్ JTP కానీ వెర్షన్స్ కి సమానంగా ఉంటుంది.

 

Tata Tiago JTPటియగోకి 185 / 60R15 టైర్లు లభిస్తాయి, అయితే టైగర్ 185/65-సెక్షన్ టైర్లతో కొంచెం పొడవుగా వెడల్పుగా ఉంటుంది. మేము పరీక్షించిన కార్లలో అపోలో ఆల్నాక్ 4G టైర్లతో వచ్చింది, రెండు కార్లు కోసం ప్రత్యేకంగా JTP వాడుతున్నారని పేర్కొంది. మాకు గ్రిప్ పరంగా ఎటువంటి సమస్యలు లేవు మరియు మేము కార్లు స్పీడ్ గా వెళ్ళే సమయంలో మేము చక్రాలు నుండి స్లిప్ ని గమనించాము. ఈ వెడల్పుగా ఉండే రబ్బరు కూడా ఈ బ్రేకింగ్ పనితీరుని బాగా పెంచింది. ఈ హార్డ్‌వేర్ అలానే మారకుండా ఉన్నప్పటికీ ఈ రబ్బర్ కొంచెం వెడల్పుగా ఉండడం వలన ఈ పనితీరుని బాగా పెంచిందని చెప్పవచ్చు.

Tata Tiago JTP

భద్రత

టియాగో JTP మరియు టిగోర్ JTP లు అదే భద్రతా కిట్ ని ప్రామాణిక కారు యొక్క అత్యుత్తమ టాప్-వెర్షన్ లో ఉన్నది పొందుతాయి. దీనిలో డ్యుయల్ ఎయిర్బాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు లాక్-బ్రేక్ బ్రేక్లు, అలాగే కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.

తీర్పు

మీరు రెండిటిలో ఒకదాన్ని కొనుగోలు చేయాలా? 1.2 లక్షల రూపాయల అధనపు డబ్బుకు విలువైనదా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానము, అవును. కానీ, కొన్ని షరతులు ఉన్నాయి.   

Tata Tigor JTP

ఉదాహరణకు, మీ ప్రాధాన్యత జాబితాలో ఇంధన సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉంటే, మరియు JTP అనేది ఒక క్రొత్త 'టాప్-ఎండ్' మోడల్ గా ఎక్కువ లక్షణాలతో ఉండవచ్చని మీరు భావిస్తే, ఖచ్చితంగా ఈ కారు మీకు కాదు.

కానీ మీరు ఈ కారుని కేవలం పనితీరు కోసం కొనాలని అనుకుంటే మరియు టేబుల్ లో ఇచ్చే విలువ మీరు మెచ్చుకున్నట్లయితే, ఇంకా డ్రైవ్ చేయడానికి బాగుండాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు.

అవును, మేము టియాగో JTP లో కొన్ని అధనపు లక్షణాలు ఉదాహరణకు ఒక పార్కింగ్ కెమెరా మరియు ఆటో ఎసి వంటివి ముఖ్యంగా ఈ ధర వద్ద ఉండి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇది డీల్ బ్రేకర్ అయితే కాదు ఎందుకంటే ఉత్సాహకరమైన డ్రైవింగ్ కోసం చూస్తే మాత్రం మీరు దీనిని తీసుకోవచ్చు.

మొత్తంగా చెప్పాలంటే, మీరు గనుక సరసమైన ధరతో కొనుక్కొనే విధంగా ఉండే చిన్న కారుని రోజూ వారి అవసరాలకు కావాలనుకుంటే మాత్రం మీ కోరిక నెరవేరింది అని చెప్పుకోవచ్చు.

Tata Tiago JTP

 

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience