• English
  • Login / Register

మారుతి సుజుకి స్విఫ్ట్

Published On మే 09, 2019 By prithvi for మారుతి స్విఫ్ట్ 2014-2021

ఎదురు చూడాల్సిన విషయాలు:

  •  మారుతి బ్యాడ్జ్ మరియు విశ్వసనీయత
  •  బాహ్య నమూనా కు స్పోర్టి లుక్
  •  మెరుగైన ఇంధన సామర్ధ్యం
  •  తక్కువ నిర్వహణ ఖర్చు
  •  అగ్ర శ్రేణి వేరియంట్ లో ఉన్న లక్షణం

మీరు రెండో సారి ఆలోచించేలా చేసే విషయాలు:

  •  వెలుపలి మరియు లోపలి భాగంలో బారీ మార్పులు లేకపోవడం
  •  వెనుక ప్రయాణికులకు తగినంత స్థలం లేకపోవడం
  •  చిన్న బూట్ స్పేస్

Maruti Suzuki Swift

మారుతి సంస్థ, తన అతిపెద్ద అమ్మకాల నమూనాను ఫేస్లిఫ్ట్ కు ఇస్తుంది. దాని సెగ్మెంట్లో రాజులా కిరీటంతో కూడిన ఒక చిన్న ప్రయత్నమే ఈ విలువైన కొత్త స్విఫ్ట్, ఈ చిన్న వాహనంలో ఏ అంశాలు అందించబడుతున్నాయో తెలుసుకుందామా?

మారుతి సుజుకి, 2005 నుండి ప్రీమియమ్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ముందంజలో ఉంది, ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్విఫ్ట్ అని పిలువబడే హాటెస్ట్ మరియు ఎక్కువగా ఎదురుచూస్తున్న మోడల్ అయిన స్విఫ్ట్ ను ప్రవేశపెట్టింది. దీని కంటే ముందు, దాని స్పోర్టి లుక్ ను కలిగిన బాహ్యభాగం మరియు అంతర్గత నమూనా కారణంగా అత్యంత ఉత్తేజకరమైన కార్లలో ఒకటిగా గుర్తించారు.

Maruti Suzuki Swift

భారతదేశంలో, ఉత్పత్తిదారుడు ఇప్పటి వరకు దేశంలో ఉన్న వినియోగదారులకు 2 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది మరియు వినియోగదారులు ఈ వాహనంలో కొత్తగా ఏదో ఒక విషయాన్ని అందజేయడం ద్వారా, సంస్థ ఇటీవలే ఒక ఫేస్లిఫ్ట్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశం ప్రత్యేకంగా, ఈ ప్రత్యేక మోడల్ లో నవీకరణను తీసుకొచ్చినప్పటికీ, ఈ నవీకరణ రెండవసారి అని చెప్పవచ్చు; ఇటీవల మారుతి సుజుకి సంస్థ ఈ వాహనం తో 'ఆల్- న్యూ స్విఫ్ట్' ను ప్రవేశపెట్టింది. కాబట్టి ఇది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందా.

ఎక్స్టీరియర్స్

దాని ప్రారంభానికి ముందు, ఈ వాహనంలో ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయి మరియు దీనిలో అందించే అన్ని కొత్త స్విఫ్ట్ గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి, వీటన్నింటితో ఇది ఎలా కనిపిస్తుందనే దాని గురించి తెలుసుకుందాం మరియు చివరికి వినియోగదారునికి ఏ విధంగా అందించబడుతుంది.

Maruti Suzuki Swift

ఇప్పుడు మన కళ్ళు సరిగ్గా వాహనం యొక్క ముందు వైపు ఉన్నాయి, మొదటి విషయం ఏమిటంటే, బయటి రూపకల్పనలో తీవ్ర మార్పులు ఏమి లేవు. నిజానికి ఈ ఫేస్ లిఫ్ట్ వాహనంలో వెండి చేరికలతో కూడిన నవీకరించబడిన ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ మరియు రూపకల్పన చేయబడిన ముందు బంపర్ వంటివి మనం డీజిల్ విడిఐ వేరియంట్లో కనిపిస్తాయి.

Maruti Suzuki Swift

మిగిలిన అంశాల విషయానికి వస్తే వంపు నిర్మాణం కలిగిన హుడ్, విస్తరించబడిన హెడ్ లాంప్లు, క్రోమ్ లోని ఎస్ లోగోతో కూడిన ముందు గ్రిల్ వంటివి దాని మునుపటి తరానికి కనిపించే వాటికి ఒకేలా ఉన్నాయి. సూక్ష్మమైన మార్పే కానీ దాని ఎయిర్ ఇంటేక్ పరిమాణం లో కొద్దిపాటి మార్పు కనిపిస్తుంది, ఇది ముందు బంపర్ యొక్క దిగువ భాగంలో ఉంచబడుతుంది.

Maruti Suzuki Swift

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఏ మార్పులు సంభవించబడలేదు, కాకపోతే, ఎలక్ట్రానిక్ మడత సర్ధుబాటు కలిగిన ఓఆర్విఎం (సైడ్ వ్యూ అద్దాలు) మరియు విడీఇ వేరియంట్ విషయంలో ప్లాస్టిక్ హబ్ క్యాప్స్ తో పాటు స్పోర్టిగా కనిపించే అల్లాయ్ వీల్స్ వంటివి మినహాయిస్తే ఏ రకమైన మార్పులు లేవు. సాధారణంగా, ప్రక్క భాగం నుండి చూస్తే, ఫ్లారెడ్ వీల్ ఆర్చెస్, విడిఐ యొక్క బ్యాడ్జ్, ముందు నుండి వెనుక వరకు పదునైన గీతలు, కారు రంగులో ఉండే డోర్ హ్యాండిళ్ళు, ఇండికేటర్ సూచికలతో కూడిన ప్రొనౌంచ్డ్ సైడ్ వ్యూ మిర్రర్లు, స్లొపింగ్ రూఫ్ లైన్ తో పాటు ఒక నల్లటి ఏ మరియు బి పిల్లార్లు వంటి అన్ని ముఖ్యమైన అంశాలతో స్పోర్టి లుక్ తో కనిపిస్తుంది. కారు రంగులో ఉండే డోర్ హ్యాండిళ్ళను జోడించడం వలన దానికి మంచి నిర్మాణ నాణ్యత అందమైన అనుభూతి అందించబడతాయి.

Maruti Suzuki Swift

మరో  భాగం విషయానికి వస్తే, వెనుక భాగం ఒక వంపు నిర్మాణం తో ఏ మార్పు లేని టైల్ గేట్ వంటివి అందించబడతాయి. అంతేకాకుండా వెనుక బాగంలో స్వీపింగ్ టైల్ లైట్లు మరియు ఒక బంపర్ అందించబడతాయి, ఈ టైల్ లైట్ క్లస్టర్ దాని దిగువ భాగంలో ఉన్న మధ్యలో ఒక బ్రేక్ లైట్ చొప్పించబడి ఉంటుంది. మోడల్ను గుర్తించడానికి మరియు తయారు చేయడానికి, మారుతి సుజుకి ఎస్ లోగో బ్యాడ్జ్ ఎడమ వైపున చిహ్నం అందంగా సెంటర్లో పొందుపరచబడి ఉంటుంది. దీనికి కొంచెం పై భాగం విషయానికి వస్తే, ఒక రేర్ స్పాయిలర్ బిగించబడి ఉంటుంది, దీని మధ్య భాగంలో అధిక మౌంట్ స్టాప్ ల్యాంప్ పొదుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా వెనుక రూఫ్ లైన్ కు ఒక యాంటెన్నా బిగించబడి ఉండటం వలన దీనికి మరింత స్పోర్టీ లుక్ వస్తుంది.

Maruti Suzuki Swift

ఇంటీరియర్

దాని బాహ్య నమూనా వలె, క్యాబిన్ లేఅవుట్ కూడా అవుట్గోయింగ్ మోడల్ వలె కొనసాగుతుంది. వెండి చేరికలతో కూడిన మూడు స్పోక్ల స్టీరింగ్ వీల్ అందించబడింది, అయితే దానిపై డ్రైఅర్ సౌకర్యార్ధం వీల్ పై నియంత్రణలు పొందుపరచబడి ఉంటాయి, అయితే ఈ ఫీచర్ విడిఐ వేరియంట్లో లేదు. ఇక్కడ అందించిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వృత్తాకార డైల్స్ తో సమానంగా ఉంటుంది.

Maruti Suzuki Swift

కారు గురించి అవసరమైన సమాచారాన్ని అందించే ఒక డిజిటల్ సమాచార ప్రదర్శన ఉంది. ఎడమ వైపు మరియు సెంటర్ కన్సోల్ లో ఎయిర్ వెంట్లు అందంగా పొందుపరచబడ్డాయి. క్యాబిన్ కు మరింత లుక్ అందించబడం కోసం వెంట్ల చుట్టూ వెండి తో చుట్టబడి ఉంటుంది. స్విఫ్ట్ విడిఐ లో అందించిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఖచ్చితంగా ముందుగా ఉన్న దాని కంటే మరింత ప్రీమియమ్ను కలిగి ఉంటుంది మరియు ఇప్పుడు ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో జతచేయబడింది, అయితే ఇది రేడియో, సిడి ప్లేయర్, యూఎస్బి వంటి ఇతర లక్షణాలు ముందుదానిలో వలే ఉన్నాయి.

Maruti Suzuki Swift

వృత్తాకార ఎయిర్ కండీషనింగ్ బటన్ల ఆపరేట్ వదానం చాలా అందంగా మ్రుదువైన అనుభూతిని కలిగి ఉంటుంది. ఇంతకు మునుపు చెప్పినట్లుగా, కొత్త స్విఫ్ట్ ఇప్పటికీ క్యాబిన్ మొత్తంలో, వస్తువులను నిల్వ చేయడానికి అనేక కబ్ హోల్డర్లను మరియు అదనపు ఖాళీ స్థలాలను అందిస్తుంది. ఎక్కువ దూరం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రిట్రాక్టబుల్ గ్లాస్ హోల్డర్ల ఫీచర్ చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది. దాని గ్లోవ్ బాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, దీనిలో కారు పత్రాలు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను ఉంచవచ్చు.

Maruti Suzuki Swift

ఈ ఫీచర్లతో పాటు, అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్డిఐ లో వినియోగదారుకు మరింత సౌలభ్యం చేకూర్చడానికి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో స్టార్ట్ స్టాప్ బటన్ను అందించబడిందని మేము కోరుకుంటున్నాము. స్విఫ్ట్ డీజిల్ ఫాబ్రిక్ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి, మేము తీసుకున్న టెస్ట్ వాహనంలో ఎరుపు, నలుపు మరియు వెండి లెధర్ కలయికలతో ఉన్న సీట్లు అందించబడ్డాయి. అంతేకాకుండా స్టీరింగ్ వీల్ కూడా ఎరుపు మరియు నలుపు లెధర్ కవర్ తో కప్పబడి క్యాబిన్ కు మంచి అనుభూతిని అందిస్తుంది.

Maruti Suzuki Swift

సౌలభ్యం గురించి మాట్లాడటానికి వస్తే, ముందు సీట్లు స్థలం పుష్కలంగా ఉంది మరియు అన్నింటికీ వెనక్కి లాగినప్పుడు మరింత ఎక్కువ స్థలం అందించబడుతుంది. మంచి కుషనింగ్ సపోర్ట్, లుంబార్ మద్దతు మరియు ముందువైపు హెడ్ రూం వంటివి చాలా అందంగా ఉన్నాయి. వెనుక భాగం విషయానికి వస్తే, ముందు సీట్లను వెనుకకు తోస్తున్నప్పుడు, వెనుక యజమానులకు లెగ్ రూం చాలా తక్కువగా ఉంటుంది. కుషనింగ్ సపోర్ట్ మంచిది గానే ఉంది కాని లుంబార్ మద్దతు ఎవరికీ నచ్చని విధంగా కొంచెం నిటారుగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి వెనుక సీటు కొంత అసౌకర్యం కలిగిస్తాయి.

Maruti Suzuki Swift

తొడ క్రింద మద్దతు ముందు మరియు వెనుక కూడా ముందు చెప్పినట్లుగానే అద్భుతంగా ఉంది. దాని ఏటవాలు పైకప్పు కారణంగా, హెడ్ రూం ఒక పొడవైన వ్యక్తి కోసం ఒక సమస్యగా ఉంటుంది. వెనుక కంపార్ట్మెంట్ లో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నప్పుడు లొపలికి వచ్చేందుకు మరియు బయట నిష్క్రమణకు కొంచెం సమయ గా ఉంటుంది అని చెప్పవచ్చు. అదనపు నిల్వ కోసం, వెనుక భాగంలో విస్తారమైన పార్సెల్ ట్రే ఉంది, కానీ దాని బూట్ గురించి చెప్పలేము, ఎందుకంటే ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. భద్రత కోసం, విడిఐ వేరియంట్ లో ఏబిఎస్ తో ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్ వంటి అంశాలు అందించబడతాయి. ద్వంద్వ ఎయిర్ బాగ్స్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ లు వంటి ఫీచర్లు జెడ్ డి ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తాయి.

Maruti Suzuki Swift

ఇంజిన్ మరియు పెర్ఫార్మెన్స్

మారుతి సుజుకి 1.3 లీటరు డీజిల్ ఇంజిన్ తో ఎక్కువ సమయం కేటాయించగలిగింది. అంతేకాకుండా మునుపటి ఎడిషన్లో అందుబాటులో ఉన్న 1248 సిసి డీజిల్ ఇంజిన్ కూడా ఇప్పటి కొత్త వెర్షన్ లో కొనసాగుతుంది. చెప్పుకోదగ్గ మంచి విషయం ఏమిటంటే, మారుతి సంస్థ ముందుపటి వెర్షన్ తో పోలిస్తే ఈ వెర్షన్ అత్యధికంగా 0.7 కెఎంపిఎల్ గల మైలేజ్ ను అందించే విధంగా దాని లైనప్ లో ఉన్న ఇంజన్ ను మెరుగుపర్చారు, అందువల్ల ప్రస్తుతం స్విఫ్ట్ డీజిల్ ఇంజన్ 25.2 కిమీ మైలేజ్ ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది.

Maruti Suzuki Swift

ఈసియు ను తగ్గించడం మరియు ఘర్షణ తగ్గడం వలన ఇది సాధ్యమవుతుంది. వివరంగా చెప్పాలంటే, ఈ 1.3 లీటర్ యూనిట్, గరిష్టంగా 4000 ఆర్పిఎం వద్ద 74 బిహెచ్ పి పవర్ ను అదే విధంగా 190 ఎన్ఎం గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విడుదల అయిన శక్తి దాని నాలుగు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఇది ఒక 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది, నగరంలో లేదా ఓపెన్ రహదారి లో మంచి పనితీరును అందిస్తుంది.

Maruti Suzuki Swift

డ్రైవింగ్ చేసేటప్పుడు, డీజిల్ మరియు క్లచ్ చాలా తేలికైన పనితీరును అందిస్తాయి, అంతేకాకుండా దాని స్టీరింగ్ వీల్ కూడా చాలా తేలికగా ఉంటుంది. ముందు వలే, రైడ్ మరియు హ్యాండ్లింగ్ భారతదేశ పరిస్థితులకు సరిపోయేలా ఉంటుంది, కొత్త స్విఫ్ట్ బాగా గుంతలు మరియు విరిగిన రహదారి ఉపరితలంపై మంచి రైడ్ అనుభూతిని అందిస్తుంది.

Maruti Suzuki Swift

తీర్పు

కొత్త మారుతి స్విఫ్ట్ వాహనానికి అన్నేక కొత్త అంశాలను అందించడం లేదు మరియు ఇది కొత్తగా కూడా లేదు. దాని ట్రేడ్మార్క్ పనితీరు మరియు విశ్వసనీయత తోపాటు లోపల మరియు వెలుపల రెండూ కూడా కొన్ని అదనపు పరికరాలతో కొద్దిగా మార్పు చేయబడి వినియోగదారుడి వద్దకు అందించబడుతుంది. అయినప్పటికీ, వినియోగదారుల సెంటిమెంట్ ద్వారా, ఈ హాట్ హ్యాచ్ ఇప్పటికీ తన ప్రత్యర్థులతో పోటీగా హాట్ కేక్ లవే ఎప్పటికప్పుడు తాజాగా అమ్ముతుందని అంచనా వేయవచ్చు.

Maruti Suzuki Swift

 

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience