Tata Punch: పంచ్ యొక్క అన్ని వేరియంట్లలో సన్ రూఫ్‌ను పొందనున్న టాటా
టాటా పంచ్ కోసం shreyash ద్వారా ఆగష్టు 08, 2023 04:30 pm ప్రచురించబడింది
- 73 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సన్‌రూఫ్ ను జోడించడం వల్ల వాటి సంబంధిత వేరియంట్‌ల కంటే రూ. 50,000 వరకు ధర పెరగవచ్చు.
పంచ్ CNGని సన్ రూఫ్‌తో ప్రారంభించిన మూడు రోజులలోనే, టాటా ఈ ఫీచరుని మైక్రో SUV సాధారణ పెట్రోల్ వేరియంట్స్ అన్నింటిలోనూ ప్రవేశపెట్టింది. సన్ రూఫ్ ను జోడించిన తరువాత అన్ని వేరియంట్ల ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సన్ రూఫ్ వేరియంట్లు |
ధర |
ప్రాతినిధ్య వేరియంట్‌తో ఉన్న వ్యత్యాసం |
ఎకంప్లిష్డ్ S |
రూ 8.25 లక్షలు |
+ రూ 50,000 |
ఎకంప్లిష్డ్ డాజిల్ S |
రూ 8.65 లక్షలు |
+ రూ 50,000 |
ఎకంప్లిష్డ్ ఎస్ AMT |
రూ 8.85 లక్షలు |
+ రూ 50,000 |
క్రియేటివ్ DT S |
రూ 9.20 లక్షలు |
+ రూ 45,000 |
ఎకంప్లిష్డ్ డాజిల్ S AMT |
రూ 9.25 లక్షలు |
+ రూ 50,000 |
క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ DT |
రూ 9.50 లక్షలు |
NA |
ఎకంప్లిష్డ్ డాజిల్ S CNG |
రూ 9.68 లక్షలు |
NA |
క్రియేటివ్ DT S AMT |
రూ 9.80 లక్షలు |
+ రూ 45,000 |
క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ DT AMT |
రూ 10.10 లక్షలు |
NA |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
మీరు టేబుల్‌లో చూసినట్టుగా టాటా పంచ్ ఎకంప్లిష్డ్ ఎస్ వేరియంట్ నందు సన్ రూఫ్‌ని అందిస్తున్నారు, దీని ధర రూ 8.25 లక్షల నుండి మొదలవుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ అనేది క్రియేటివ్ iRA వేరియంట్ యొక్క పేరు మార్చబడిన వెర్షన్ అని, ఇందులో సన్ రూఫ్‌తోపాటు టాటా iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఫీచర్ కూడా అందించబడింది.
పోలిక కోసం మాత్రమే, సన్ రూఫ్ కలిగిన ఆల్ట్రోజ్- ఎక్స్ఎం (ఎస్) వేరియంట్‌తో మొదలవుతుంది (కానీ వాయిస్ అసిస్టెంట్ లేకుండా), రూ 7.35 లక్షల ధరలో అందుబాటులో ఉంటుంది, ఇది టాటా పంచ్ సన్ రూఫ్ వేరియంట్ కన్నా రూ 90,000 తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. దీనికి భిన్నంగా టాటా పంచ్ ప్రత్యక్ష పోటీదారైన హ్యుందాయ్ ఎక్స్టర్, దాని SX వేరియంట్‌లో సన్ రూఫ్ వెర్షన్ రూ 8 లక్షలతో ప్రారంభించబడుతుంది. ఇది టాటా పంచ్ ఎకంప్లిష్డ్ S వేరియంట్ కన్నా రూ 25,000 తక్కువ.
మరిన్ని వివరాలకై చదవండి: టాటా పంచ్ CNG వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్ CNG – స్పెసిఫికేషన్ మరియు ధరల పోలిక
పవర్ ట్రైన్స్ తనిఖీ
ప్రస్తుతం పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజనుతో అందించబడుతుంది, ఇది 88PS మరియు115Nm పవర్, టార్క్ లను విడుదల చేయటమే కాక, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT తో జత చేయబడుతుంది. ఇదే ఇంజనుని CNG మోడ్ లో ఇది 74PS మరియు 103Nm పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే జత కలిసి వస్తుంది.
ధరల పరిధి & పోటీదారులు
టాటా పంచ్ ధర రూ 6 లక్షల నుండి రూ 10.10 లక్షల వరకు ఉంటుంది. (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది హ్యుందాయ్ ఎక్స్టర్‌కు ప్రత్యక్ష పోటీదారు, దీనిని ధరలతో పోలిస్తే దీనిని సిట్రియెన్ C3, మారుతి ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్‌లకు పోటీగా భావించవచ్చు .
మరింత వివరాలకై చదవండి: టాటా పంచ్ AMT
0 out of 0 found this helpful