"శక్తివంతమైన" సఫారి-స్టోమ్ తన కఠినమైన పోటీని ఎదుర్కొని నిలబడుతుందా ?
టాటా సఫారి స్టార్మ్ కోసం sumit ద్వారా డిసెంబర్ 09, 2015 12:54 pm ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టాటా కంపెని ఇటీవల శక్తివంతమైన సఫారి-స్టోమ్ వెర్షన్ ని విడుదల చేసింది. ఇది వెరికార్ 400 2.2 లీటర్ 4-సిలిండర్ ఇంజన్ ని కలిగి, మునుపటి మోడల్ కంటే 25% ఎక్కువ టార్క్(400NM) ని అందించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అనగా ఈ వాహనము 0-100KMPH వేగాన్నీ కేవలం 12.8సెకన్ లలో అందుకుంటుంది, అదే ఇంతకుముందు వెర్షన్ ఇదే వేగాన్నీ 13.8సెకన్ లలో అందుకునేది. చిన్నపాటి దూరాన్ని (0-60KMPH) అప్ గ్రెడెడ్ వెర్షన్ మునుపటి వెరికార్ 320వెర్షన్ కంటే సుమారు 0.5 సెకన్ల వేగంగా అందుకుంటుంది. ఇంకా మెరుగైన గేర్ బాక్స్ తో ఈ SUV 156PS యొక్క గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఈ సదుపాయాలు అన్ని (సుమారు.) రూ 40,000 అదనపు ఖర్చుతో వస్తాయి.
అయితే ఈ అదనపు శక్తి మరియు మంచి గేర్ బాక్స్ నామమాత్రపు ధర పెరుగుదలతో అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే సఫారి-స్టోమ్ ఈ విభాగంలో తన స్థానాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా టాటా యొక్క ఈ SUV ప్రస్తుత మార్కెట్ లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న హ్యుందాయి క్రెటా నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. క్రెటా 5 సీటర్ అయినప్పటికీ అమ్మకాలలో చాలా రికార్డ్ లను బ్రేక్ చేసింది. దక్షిణ కొరియా కంపెనీ అయిన హ్యుందాయి భవిష్యత్తు కోసం దానిని ఉత్తమంగా అందించింది. మారుతి సుజుకి యొక్క ఎస్ క్రాస్ మరియు మహీంద్రా XUV500 లతోకూడా ఇది కొంత పోటీని ఎదుర్కుంటోంది. అయితే మహీంద్రా XUV500 ఇప్పటికే ప్రజల మనసులను దోచుకోగా, ఇటీవలి పండుగ సీజన్ లో మారుతి ,ఎస్ క్రాస్ పై ఒక లక్ష డిస్కౌంట్ ని అందిచడం వినియోగదారులని బాగా ఆకర్షించింది. టాటా యొక్క బలమైన పోటీదారుగా ఈ వాహనం చేరడంతో ఈ సెగ్‌మెంట్ లోని కార్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే శక్తివంతమైన టాటా సఫారి-స్టోమ్ హ్యుందాయి క్రెటా, XUV500, ఎస్ క్రాస్ లతో పోటీ పడి కేవలం ప్రేక్షకుడిలా నిలుస్తుందో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి:
- రూ. 13.52 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన మరింత శక్తివంతమైన టాటా సఫారి స్ట్రోం
- ధర తో పోలిస్తే, పోటీతత్వం కన్నా రెండు రెట్లు ఎక్కువ టార్క్ ను విడుదల చేస్తున్న 2015 టాటా సఫారీ ఎస్యువి
మరింత చదవండి : టాటా సఫారి-స్టోమ్