టాటా సఫారి-స్టోమ్

` 10.8 - 15.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్‌లు

 
*Rs

టాటా సఫారి-స్టోమ్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
అమ్మకాలు పడిపోవటంతో నిర్బంధించడానికి , భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అధికారికంగా దేశంలో దాని ప్రీమియం నవీకరించబడిన ఎస్యూవీ టాటా సఫారి స్ట్రోం వెర్షన్ ప్రారంభించింది. ఈ వాహనం యొక్క మొత్తం శరీర నిర్మాణం దాని మునుపటి వాహనంలానే ఉంటుంది. కానీ దీని బంపర్ మరియు రేడియేటర్ గ్రిల్ లో మార్పు పొందింది. అదే సమయంలో, క్రోమ్ స్ట్రిప్ పైన స్ట్రోం అక్షరాలు ఇప్పుడు నల్లని రంగులో అందుబాటులో ఉన్నాయి. దీని లోపల భాగాలు కూడా జావా నలుపు రంగు స్కీమ్, డోర్ హ్యాండిల్స్ మరియు డాష్‌బోర్డ్ పైన సిల్వర్ చేరికలు రావడం వలన చూడడానికి చాలా క్లాసీ గా కనిపిస్తుంది. తయారీదారుడు ఇటువంటి సౌకర్య లక్షణాలు అమర్చి ప్రయాణాన్ని మరింత సానుకూలం చేశారు. ఈ వాహనం ఆధునిక ఆల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్లు కలిగి ఉండి దీని ముందర ఉండే కనెక్ట్ నెక్స్ట్ అనే సమాచార వ్యవస్థ పైన డ్రైవర్ కి మార్గం చూపిస్తాయి. అంతేకాకుండా తయారీదారుడు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ పైన బహుళ-ఫంక్షనల్ స్విచ్‌లు అమర్చారు. దీని వలన డ్రైవర్ యొక్క శ్రమ తగ్గుతుంది. అయితే, ప్రధాన నవీకరణ ఏమిటంటే, ఇంజిన్ లో శక్తి మరియు టార్క్ అభివృద్ధి చెందింది. ఇది ఇప్పుడు 2.2 లీటర్ వరికార్ డీజిల్ ఇంజిన్ 148భ్ప్ అత్యుత్తమ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా దీనిలో 260mm వ్యాసం గల సెల్ఫ్ అడ్జస్టింగ్ క్లచ్ అందుబాటులో ఉంది.

కార్ల తయారీ సంస్థ ఈ వేరియంట్ లైనప్ లో ఎటువంటి మార్పులు చేయలేదు మరియు ఇది నాలుగు వేరియంట్స్ ఎల్ ఎక్స్, ఈ ఎక్స్, వి ఎక్స్ మరియు వి ఎక్స్ 4డబ్ల్యూ డి తో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్స్ ఇప్పుడు ఫ్లిప్ కీతో కూడిన రిమోట్ సెంట్రల్ లాకింగ్ తో అందిస్తున్నారు ఇది మరింతగా సౌకర్యాన్ని పెంచుతుంది. మరోవైపు, ఈ మోడల్ సిరీస్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో కూడిన కొత్త తరం ఏబిఎస్ 8.1 తో అనుసంధానం చేయబడి ఉంది. ఇది బ్రేకింగ్ మెకానిజం ను జతపరుస్తుంది. ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో దోహదపడుతుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ విఎక్స్ గ్రేడ్ ట్రిమ్స్ లో మాత్రమే (రెండు 4*2 మరియు 4*4 )అందిస్తున్నారు.అయితే, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ మరియు ఇంజిన్ ఇమ్మొబిలజర్ మాత్రం అన్ని ప్రామాణిక వేరియంట్లలో అందిస్తున్నారు. బ్రేకింగ్ మెకానిజం లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ దాని గ్రౌండ్ క్లియరెన్స్ మెరుగుదలకు మాత్రం కొన్ని డ్రైవింగ్ అనుకూలతలను జోడించారు. అదే సమయంలో, దాని 4*4 వెర్షన్ యొక్క ఈ ఎస్ ఓ ఎఫ్ ( ఎలక్ట్రానిక్ షిఫ్ట్ ఆన్ ఫ్లై) ఫంక్షన్ మాత్రం భూభాగాల మీద మరియు కఠినమైన రహదారుల మీద నడపడానికి సులభంగా ఉంటుంది. దీని బేస్ వేరియంట్ పక్కన పెడితే, దీని మిగతా అన్ని వేరియంట్లలో డిస్క్ బ్రేకింగ్ మెకానిజం అందుబాటులో ఉంది. ఈ వాహనం ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రా ఎక్స్ యు వి500 నిస్సాన్ టెరానో మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాటితో పోటీ పడుతున్నది. ఈ వాహనం 3 సంవత్సరాలు లేదా 100,000 కిలోమీటర్ల వారంటీతో అందుబాటులో ఉంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ ఇంజిన్ ని చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ ఇంధన సామర్ధ్యం దీని మునుపటి వెర్షన్ వలే ఉంది తప్ప పెద్దగా మారలేదు. ఇది నగర రోడ్లపై 8kmpl అందిస్తుంది మరియు గరిష్టంగా 13.2kmpl మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


తయారీదారుడు శక్తి అభివృద్ధి కోసం కొత్త 260mm వ్యాసం గల సెల్ఫ్ అడ్జస్టింగ్ క్లచ్ స్థాపించారు. దీని వలన శక్తి సామర్ధ్యం పెరిగింది. ఫలితంగా 148bhp గరిష్ట శక్తి ని మరియు 320ఎన్ ఎం టార్క్ ని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


మెరుగైన విద్యుత్ మరియు సున్నితమైన గేర్ షిఫ్ట్ తో అందిస్తున్న ఈ నవీకరించబడిన ఎస్ యు వి ఇప్పుడు సుమారు 195 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలిగే సామర్ధ్యాన్ని పొందింది. అదే సమయంలో, ఇది 12 సెకన్లలో 0 నుండి 100 Kmph వేగం వరకూ చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


బాహ్య భాగంలో ఆకర్షణీయంగా ఉన్న ఈ కొత్త ఎస్ యు వి మరికొన్ని గుర్తించదగిన నవీకరణలను పొందింది. ఈరేడియటర్ గ్రిల్ ప్రీమియం ఇంటర్నేషనల్ ఎస్ యువి బ్రాండ్ల దగ్గర నుండి స్పూర్తి పొంది క్రొత్త డిజైన్ ని పొందింది. కంపెనీ చిహ్నం ఈ గ్రిల్ మధ్యలో ఉంచుతారు మరియు ఒక క్రోమ్ స్ట్రిప్ దీని పైన ఉంచబడుతుంది. ఈ స్ట్రిప్ ఇప్పుడు నల్ల రంగు స్ట్రోం అక్షరాలతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని హెడ్‌లైట్ క్లస్టర్ కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ రూపంలో నవీకరణ ను పొందుతుంది. ఈ క్లస్టర్, 'పాలీ ఎల్లోప్సాయిడ్' వంటి లక్షణాన్ని పొంది ఉంది. ఈ లక్షణం దీని ముందరి దానికి ప్రస్తుతం ఉన్న వాహనానికి తేడా స్పష్టంగా చూపిస్తుంది. దీనిలో పైన ఉన్న గ్రిల్ లానే దీని ముందు బంపర్ లో ఉన్న దిగువ గ్రిల్ చార్కోల్ గ్రే రంగు పధకంతో ఒక కొత్త డిజైన్ ని పొందుతుంది. ఇంతేకాకుండా, దీని ముందరి భాగం యొక్క అన్ని అంశాలు అవుట్గోయింగ్ మోడల్ అవుట్గోయింగ్ మోడల్ కి ఉన్నట్టు గానే ఉంటాయి. దీని సైడ్ ప్రొఫైల్ లో బాడీ రంగు లో ఓఆర్ విఎం లు ఉండగా దీని అగ్ర శ్రేణి వేరియంట్లో క్రోమ్ ట్రీట్మెంట్ లో అందుబాటులో ఉంటాయి. ఇది బి పిల్లర్ స్టైలింగ్ టేప్, సైడ్ క్లాడింగ్స్ మరియు రూఫ్ రెయిల్స్ వంటి సాంప్రదాయక స్టయిలింగ్ అంశాలను పొంది ఉంది. వి ఎక్స్ వేరియంట్ ని పక్కన పెడితే, మిగిలిన రెండు వేరియంట్స్ స్టీల్ రిమ్స్ తో అమర్చబడి ఉంటాయి. ఈ రిమ్స్ వీల్ కాప్స్ తో పొందుపరచబడి ఉన్నాయి. దీని వెనుక భాగంలో ఉన్న స్పాయిలర్ వలన ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని టెయిల్ లైట్ టాటా' అక్షరాలతో ఒక క్రోమ్ స్వరూపాలను కలిగి ఉంటుంది. దీని టెయిల్ లైట్ క్లస్టర్ సంప్రదాయ డిజైన్ కలిగి ఉండి వాటితో పాటూ బ్రేక్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ మరియు కర్టసీ ల్యాంప్స్ ను కలిగి ఉంది. దీని ఫ్రంట్ బంపర్ లా కాకుండా వెనుక బంపర్ మస్కులైన్ డిజైన్ ను కలిగి ఉంది. ఇది భద్రత కొరకు ఒక జత రెఫ్లెక్టర్స్ ని కూడా కలిగి ఉంది.

వెలుపలి కొలతలు:


ఈ పునరుద్ధరించిన వెర్షన్ యొక్క బాహ్య కొలతలు కూడా దీని ముందు వెర్షన్ లానే 4655మ్మ్ పొడవుతో మరియు 1922mm ఎత్తుతో అందుబాటులో ఉంది. దీని వెడల్పు 1855mm ( సైడ్ ఫుట్ స్టెప్ కాకుండా) కానీ సైడ్ ఫుట్ స్టెప్ తో కలిపి అయితే 1965mm వరుకూ ఉంటుంది. ఇంకా ఇది 2650mm వీల్‌బేస్ ని కలిగియుండి 200mm కనీసం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

లోపలి డిజైన్:


తయారీదారుడు దీని అంతర్భాగానికి అనేక సౌకర్య లక్షణాలను అందించడమే కాకుండా ఆకర్షణీయంగా కూడా కనిపించేలా డిజైన్ చేశారు. ఇది డ్యుయల్ టోన్ అంతర్గత కాబిన్ ని కలిగి ఉండడమే కాకుండా చాలా విశాలంగా అనేక అంశాలతో అందించబడుతుంది. ఇది మరింత క్లాస్సి లుక్ ఇచ్చే క్రోమ్ మరియు వుడ్ తో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జావా బ్లాక్ ఇంటీరియర్ చేరికలతో వస్తుంది. ఈ సిరీస్ లో అన్ని వేరియంట్స్ ఫాబ్రిక్ సీటు అపోలిస్ట్రీ తో అందించబడతాయి. దీని ముందర భాగంలో రెండు ఇండివిడ్యువల్ సీట్లు ఉంటాయి. దీని రెండవ వరస మరియు మూడవ వరసలో బెంచ్ మాదిరీ సీట్లు ఉంటాయి. దీనిలో ఏడుగురు ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. దీని ముందు వరుస సీట్లకు 3-పొజిషన్ లంబర్ సపోర్ట్ ఆర్మ్‌రెస్ట్ తో పాటూ అందుబాటులో ఉండి డ్రైవింగ్ సులభతరం చేస్తుంది. ఈ సీట్ల అమరిక అందరి ప్రయాణికులకి సరిపోయే విధంగా తగినంత లెగ్ స్పేస్ మరియు హెడ్‌రూమ్ ని అందించే విధంగా ఉంటుంది. ఇది మౄదువైన డాష్‌బోర్డ్ కొన్ని లక్షణాలను కలిగి ఉండి. అవేమిటంటే, గ్లోవ్ బాక్స్, ఏ.సి వెంట్లు, ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ మరియు సెంటర్ లో కంపెనీ చిహ్నం తెలిపే ఒక మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ దీనిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇది గేర్ షిఫ్ట్ నాబ్ మరియు పార్కింగ్ లివర్ తో పాటు చుట్టబడిన స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంది. ప్రకాశించే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అడ్జస్టబుల్ లైట్ ఇంటెన్సిటీ ఫంక్షన్ తో వస్తుంది. ఇది డ్రైవర్ ని అప్డేట్ చేసేందుకుగానూ అనేక నోటిఫికేషన్లు మరియు హెచ్చరికలను కలిగి ఉంది. ఈ జాబితా తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, డిజిటల్ ట్రిప్‌మీటర్, బయట ఉష్ణోగ్రత డిస్ప్లే, డోర్ అజార్ హెచ్చరిక, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ మరియు అనేక లక్షణాలను కలిగి ఉంది. దీని కాబిన్ రెండవ వరుస పైకప్పు లో ఏ.సి వెంట్లతో పాటూ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనిలో 12వి పవర్ సాకెట్ ముందు మరియు మధ్య వరుసలో మొబైల్ ఫోన్లు చార్గింగ్ కొరకు అందించబడుతున్నది. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉండడం వలన భారీ ట్రాఫిక్ పరిస్థితులలో డ్రైవర్ యొక్క శ్రమని తగ్గిస్తుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో ముందు పైకప్పు పైన ల్యాంప్ ఉండి కారు లో కూర్చుని చీకటి సమయాల్లో ఏదిన చదువుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఆధునిక డిలే ఫంక్షన్ తో వస్తుంది. దీని మధ్య భాగంలో నైపుణ్యం గల సంగీత వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే, దాని మధ్య మరియు ప్రవేశ స్థాయి వేరియంట్స్ దాని చక్కదనం జోడించే అల్యూమినియంతో అందుబాటులో ఉంది. వీటితో పాటు, కార్ల తయారీదారుడు ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనానికి అసంఖ్యాక విశిష్టతలను చేర్చి ప్రయాణికులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నారు. ఈ జాబితాలో ముందు కన్సోల్ కి కప్ మరియు బాటిల్ హోల్డర్స్, ముందరి సీటు వెనుక పాకెట్స్, సన్ గ్లాస్ హోల్డర్ తో ఒక పెద్ద గ్లోవ్ బాక్స్, సెంటర్ కన్సోల్ లో అనలాగ్ గడియారం, లంబర్ సపోర్ట్ తో ముందరి సీట్లు, ఒక యాష్ ట్రే, ముందరి కన్సోల్ లో సిగరెట్ లైటర్ అందుబాటులో ఉంది.

లోపలి సౌకర్యలు:


ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకుగానూ కారు తయారీదారుడు దాని రెండుయ్ వేరియంట్లకి అనేక సౌకర్య లక్షణాలు చేర్చారు. డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫంక్షన్ తో అందుబాటులో ఉంది. ఇది ఇంకా టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ ని కలిగి ఉండడం వలన భారీ ట్రాఫిక్ పరిస్థితులలో డ్రైవర్ యొక్క శ్రమ తగ్గుతుంది. దీనిలో మాన్యువల్ హెచ్ విఎ సి (తాపన, ప్రసరణ మరియు ఎయిర్ కండిషనింగ్) యూనిట్ వెనుక ఏసీ వెంట్లతో కాబిన్ ఎయిర్ ని నియంత్రిస్తుంది. ఇది డస్ట్ మరియు పోలెన్ ఫిల్టర్ ని కాబిన్ ఎయిర్ శుద్ధి చేసేందుకు కలిగి ఉంటుంది. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్ ఒక ఆధునిక సంగీతం వ్యవస్థ తో అందజేయబడి ఉంది. ఈ వ్యవస్థ సిడి / ఎం పి3 ప్లేయర్, యు ఎస్ బి ఇంటర్ఫేస్, పోర్ట్ ఆక్స్-ఇన్ పోర్ట్ కి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది నాలుగు స్పీకర్లను ధ్వని పంపిణీ కొరకు అందిస్తుంది. ఇది మరింత సామాను పెట్టుకునేందుకు 60:40 స్ప్లిట్ మరియు పూర్తిగా ను మడత వేయగల సీట్లను మధ్య వరుసలో కలిగి ఉంది. వీటితో పాటు, అది ఒక వెనుక వాష్ మరియు వైప్ ఫంక్షన్ ( ఇఎక్స్ వేరియంట్ కొరకు మాత్రమే) అందుబాటులో ఉంది. అంతేకాకుండా అన్ని నాలుగు పవర్ విండోస్, డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్, విద్యుత్‌తో సర్దుబాటు బాహ్య వెనుక వీక్షణ అద్దాలు, ముందు సీట్లు కోసం మూడు స్థానం లంబర్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇంకా దీనిలో టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ వ్యవస్థ ఉండడం వలన ట్రాఫిక్ పరిస్థితుల సమయంలో చాలా సదుపాయంగా ఉంటుంది. దీనిలో ప్రయాణికులు కూర్చునే అన్ని సీట్లకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఆర్మ్‌రెస్ట్ మరియు సీట్ బెల్ట్‌లు అందించబడుతున్నది. వీటితోపాటు, అధనంగా టిల్ట్ అడ్జస్టబుల్ ఫంక్షన్ తో పవర్ స్టీరింగ్, ఫాలోమీ హెడ్‌ల్యాంప్స్, ముందరి తలుపులపై పడుల్ ల్యాంప్స్, కార్గో ఏరియా లైట్, ప్రకాశవంతమైన జ్వలన కీ స్లాట్ మరియు విండో వైండింగ్ స్విచ్లులను అందిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ కలిసీ ఈ ఎస్ యు వి లో ప్రయాణాన్ని చిరస్మరణీయ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. క్యాబిన్ కూడా డ్రైవర్ సౌలభ్యం స్థాయి పెంచేందుకు యాంటీ గ్లారే అంతర్గత రేర్ వ్యూ అద్దం తో కలిసి ఉంటుంది. ముందు విండ్‌స్క్రీన్ వైపర్స్ టూ స్పీడ్ సెట్టింగ్‌లను కలిగి ఉంటుంది. రిమోట్ ఆపరేటెడ్ ఇంధన ట్యాంక్ లిడ్ ఓపెనర్, ముందు మరియు రేర్ క్యాబిన్ ల్యాంప్స్ , ఫ్రంట్ సన్ విజర్స్ మరియు ఒక పవర్ స్టీరింగ్ వీల్ వంటి ఇతర అంశాలను కలిగి ఉంది. దీని ఖరీదైన అంతర్గత భాగాలు విలాసవంతమైన స్థలం అందించడంలో సహాయపడతాయి.

లోపలి కొలతలు:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం లోపల విశాలమైన కుషన్ సీట్లను కలిగి ఉంటుంది. దీని క్యాబిన్ సులభంగా ఏడు ప్రయాణికులకు సరిపడే విధంగా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ముందర మరియు వెనుక కూర్చునే ప్రయాణికుల కొరకు పుష్కలమైన హెడ్ స్పేస్ మరియు షోల్డర్ స్పేస్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా విశాలవంతమైన మోకాలు స్పేస్, లెగ్‌రూం మరియు తగినన్ని సామానులు పెట్టుకునేందుకు బూట్ కంపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. అలానే దీని మధ్య భాగంలో ఇంధన ట్యాంక్ అమర్చబడి ఉంది. దీని సామర్ధ్యం 63 లీటర్లు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


దీని బోనెట్ కింద , ఈ మోడల్ సిరీస్ 2179సిసి స్థానభ్రంశాన్ని అందించే 2.2-లీటరు వరికోర్ డీజిల్ ఇంజిన్ తో అందించబడుతుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు 16 కవాటాలతో అమర్చబడి డబుల్ ఓవర్‌హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది మరియు వేరియబుల్ టర్బెన్ టెక్నాలజీలో వస్తుంది. ఈ డిఓ హెచ్ సి ఆధారిత ఇంజిన్ సాధారణ రైల్ ప్రత్యక్ష ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి ఉండి మంచి పనితీరు మరియు మంచి ఇంధన శక్తి ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 4000rpm వద్ద 148.08bhp శక్తి ని అందిస్తుంది. ఇది మునుపటి దానికంటే, 10bhp శక్తి ని అధ్కంగా ఇస్తుంది. ఇది 1700 నుండి 2000rpm వద్ద 320Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ సిస్టమ్ తో అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ టార్క్ అవుట్‌పుట్ ని దీని ముందరి రెండు చక్రాలకు అందిస్తుంది. అయితే, దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో ఫ్లై మెకానిజం ఎలక్ట్రానిక్ షిఫ్ట్ టార్క్ అవుట్‌పుట్ ని అన్ని నాలుగు చక్రాలకి అందిస్తుంది. ఇది అత్యుత్తమ పనితీరు మరియు ఒక మర్చిపోలేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎటువంటి డ్రైవింగ్ పరిస్థితులలోనైనా సున్నితమైన త్వరణాన్ని అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


కంపెనీ ఈ మోడల్ సిరీస్ కి ఒక ఆధునిక 2-డిన్ టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ ని అందించింది. ఈ సమాచార వ్యవస్థ సిడి ప్లేయర్, రేడియో, యు ఎస్ బి పోర్ట్, ఎస్డి కార్డ్ స్లాట్ మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీ ని కలిగి ఉంది. ఇది కాల్స్ మరియు ఆడియో స్ట్రీమింగ్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నియంత్రణలు స్టీరింగ్ వీల్ మీద అమర్చబడి ఉంటాయి. ఇది వారి ప్రయాణం అంతటా ప్రీమియం ధ్వని అనుభవం ఇవ్వడం కోసం నాలుగు స్పీకర్లు కలిగి ఉంది. బేస్ వేరియంట్లో అనేక లక్షణాలు లేకపోవచ్చు. కానీ కొనుగోలుదారులు శక్తివంతమైన సీటు కవర్లు, ప్రీమియం నాణ్యత గల అపోలిస్ట్రీ, ఒక అధునాతన మ్యూజిక్ సిస్టమ్, లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, ఫ్లోర్ మ్యాట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు అనేక ఇతర లక్షణాలతో అలంకరించవచ్చు. అదే సమయంలో, యజమానులు కూడా మడ్ గార్డ్, శరీరం గ్రాఫిక్స్, రేర్ స్పాయిలర్, ప్రొటెక్టివ్ క్లాడింగ్, ఓఆర్ విఎం ఎస్ పైన టర్న్ ఇండికేటర్ మరియు అనేక ఇతర అంశాలను ఎంచుకోవచ్చు. మరోవైపు, దాని వెలుపల కూడా అది పైకప్పు సామాను క్యారియర్, పైకప్పు స్పాయిలర్ మరియు మిశ్రమ లోహ చక్రాలు సమితి వంటి కొన్ని ఇతర అంశాలు అనుకూలీకరించవచ్చు.

వీల్స్ పరిమాణం:


దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో వీల్ ఆర్చులు 16 అంగుళాల అలాయి వీల్స్ సమితితో అమర్చబడి ఉంటాయి. అలానే దీని మధ్య శ్రేణి మరియు దిగువ శ్రేణి వేరియంట్లు పూర్తి వీల్ కవర్స్ కలిగిన స్టీల్ చక్రాల సమితిని కలిగి ఉంటాయి. ఈ రిమ్స్ తదుపరి 235/70 R16 పరిమాణం గల అధిక పనితీరు గల ట్య్యుబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉండి రోడ్ పైన మంచి పట్టు ని అందిస్తుంది. తయారీదారు కూడా అన్ని వేరియంట్స్‌లో దీని వెనుకభాగంలో ఫ్లోర్ క్రింద పూర్తి పరిమాణం గల విడి చక్రం అందిస్తున్నారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ స్పోర్ట్ యుటిలిటీ వాహనం సమర్ధవంతమైన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానంతో అమర్చబడి ఉంది. దీని ముందు ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్స్ మరియు షాక్ అబ్జార్బర్స్ తో పాటు ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ టైప్ సస్పెన్షన్ వ్యవస్థతో అమర్చబడి ఉంది. మరోవైపు, వెనుక ఆక్సిల్ 5-లింక్ సస్పెన్షన్ వ్యవస్థతో అమర్చబడి ఉంది. ఈ స్పోర్ట్ యుటిలిటీ వాహనం వాక్యూమ్ ఇండిపెండెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ ని కలిగి ఉంది. రెండు ఎస్ యు వి లు కూడా శక్తివంతమైన బ్రేకింగ్ మరియు నమ్మకమైన సస్పెన్షన్ మెకానిజంతో జత చేయబడి ఉంది. దీని వలన అన్ని వేళలా వాహనం సమతుల్య మరియు స్థిరంగా ఉంటుంది. దాని ముందు మరియు వెనుక చక్రాలు రెండు కూడా వెంటిలేషన్ డిస్క్ బ్రేక్‌లు బిగించి ఉంటాయి. అదనంగా, బ్రేకింగ్ మెకానిజం కి మరింత తోడుగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) తో పాటు ఒక యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లు బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా, ఇది చాలా బాధ్యతాయుతంగా మరియు సులభ నిర్వహణ కోసం పవర్ తో సర్ద్ధుబాటయ్యే స్టీరింగ్ బిగించి ఉంటుంది. 6 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటుగా టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ను కూడా కలిగి ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


కారు తయారీదారుడు ఈ వాహనం లో అత్యంత భద్రాత లక్షణాలు చేకూర్చారు. దీని వలన ప్రయాణికులు సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. దీని విఎక్స్ వేరియంట్లో డ్రైవర్ కి అలానే సహ డ్రైవర్ కి కి కూడా ఎయిర్ బాగ్స్ అందుబాటులో ఉన్న కారణంగా ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా దీని అన్ని వేరియంట్లలో కూడా అన్ని తలుపులకి సైడ్ ఇంపాక్ట్ బార్స్ ఉండడం వలన ప్రమాదం వచ్చినపుడు తట్టుకోగలదు. అంతేకాకుండా దీనిలో సీట్ బెల్ట్ ఉన్న కారణంగా ప్రయాణికులకి మరింత భద్రత చేకూరుతుంది. డ్రైవర్ ని సీటు బెల్ట్ పెట్టుకోమని హెచ్చరించే సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ కూడా ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద అందుబాటులో ఉంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో ఆల్ట్రాసోనిక్ రివర్స్ గైడ్ వ్యవస్థ అందుబాటులో ఉన్న కారణంగా పార్కింగ్ సమయంలో డ్రైవర్ కి సులభం అవుతుంది. ఇంకా దీనిలోఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇ బి డి) తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) హైడ్రాలిక్ బ్రేక్‌లు తో అందుబాటులో ఉంది . అంతేకాకుండా దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ ఉన్నకారణంగా అనధికార ఎంట్రీని తొలగించవచ్చు. డ్రైవర్ ని సీటు బెల్ట్ పెట్టుకోమని హెచ్చరించే సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ కూడా ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద అందుబాటులో ఉంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో ఆల్ట్రాసోనిక్ రివర్స్ గైడ్ వ్యవస్థ అందుబాటులో ఉన్న కారణంగా పార్కింగ్ సమయంలో డ్రైవర్ కి సులభం అవుతుంది. ఇంకా దీనిలోఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇ బి డి) తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) హైడ్రాలిక్ బ్రేక్‌లు తో అందుబాటులో ఉంది . అంతేకాకుండా దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ ఉన్నకారణంగా అనధికార ఎంట్రీని తొలగించవచ్చు. ఇంకా దీనిలో సెంట్రల్ లాకింగ్ సిష్టం చైల్డ్ సేఫ్టీ లాక్స్ తో పాటూ అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిలో స్పష్టమైన లెన్స్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు రిఫ్లెక్టర్ తో రేర్ ఫాగ్ లైట్లు, మోటరైజెడ్ హెడ్ ల్యాంప్స్ అడ్జస్ట్మెంట్, చైడ్ సేఫ్టీ లాక్, యాంటీ గ్లేర్ వెనుక వ్యూ అద్దం, సీటు బెల్ట్ హెచ్చరిక, తలుపు తెరిచినప్పుడు హెచ్చరిక, కొలాప్సబుల్ స్టీరింగ్ కాలమ్, ట్యూబ్ లేని రేడియల్ టైర్లు వంటి ఇతర భద్రతా లక్షణాలను కలిగి ఉంది. అన్ని లక్షణాలు కలిసి ఈ వాహనానికి మరింత భద్రత చేకూరుస్తున్నాయి.

అనుకూలాలు:


1. ఈ వాహనం, విశాలమైన అంతర్గత క్యాబిన్ తో పాటు ఆధునిక భద్రత మరియు సౌకర్యం లక్షణాలతో ఇమిడి ఉంటుంది.
2. ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్, ఏ రహదారి పరిస్థితుల్లో నైనా మంచి పటుత్వాన్ని ఇవ్వడం కొరకు 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
3. నవీకరించిన బాహ్య భాగాలు కారణంగా, ఈ వాహనం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.
4. అధిక ఇంజిన్ పనితీరు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
5. అమ్మకాలు తర్వాత సర్వీస్ చాలా మంచిగా మరియు నిర్వహణ ఖర్చు సహేతుకంగా ఉంది

ప్రతికూలాలు:


1. ఈ వాహనాల యొక్క ప్రారంభ ధర చాలా అధికంగా ఉంటుంది.
2. దిగువ శ్రేణి వేరియంట్లలో ఆడియో వ్యవస్థ లేదు.
3. ఈ వాహనాల లోపలి డిజైన్ మెరుగు పడవలసిన అవసరం ఉంది.
4. దిగువ శ్రేణి వేరియంట్ లలో రేర్ ఏసి వెంట్స్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు.
5. ఇంధన సామర్ధ్యం మరియు త్వరణం ఇంకా మెరుగు పడవలసిన అవసరం ఉంది.