ఆటో ఎక్స్‌పో 2020 లో మారుతి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ నుండి ఏమి ఆశించవచ్చు
మారుతి విటారా బ్రెజా కోసం sonny ద్వారా జనవరి 06, 2020 02:54 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్ -4m SUV మిడ్ లైఫ్ రిఫ్రెష్ పొందబోతోంది
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా 2020 లో దాదాపు సరికొత్త మోడల్ లాగా ఉంటుంది. ఇది మొదటిసారిగా పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది మరియు దాని మిడ్-లైఫ్ ఫేస్ లిఫ్ట్ ను కూడా అందుకుంటుంది. ఫిబ్రవరిలో జరిగే 2020 ఆటో ఎక్స్‌పో లో ఫేస్‌లిఫ్టెడ్ బ్రెజ్జాను ఈ కార్ల తయారీ సంస్థ విడుదల చేయనుంది. క్రొత్త బ్రెజ్జా నుండి మనం ఏమిటి ఆశించవచ్చో ఇక్కడ ఉంది:
1) ఫ్రంట్ ఎండ్ మరియు వెనుక రేర్ ఎండ్ కు డిజైన్ నవీకరణలు
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఇటీవల ఎటువంటి కవరింగ్ లేకుండా అనేకసార్లు మా కంటపడింది. ఇది రిఫ్రెష్ చేసిన ఫ్రంట్ ఎండ్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియు LED DRL లతో కనిపించింది. అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ బంపర్‌లో కొత్త ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ లు కూడా ఉన్నాయి.
వెనుక భాగం విషయానికి వస్తే మనకి అంత స్పష్టంగా కనిపించలేదు కానీ, రహస్య షాట్లు ఇతర డిజైన్ ట్వీక్‌లలో నవీకరించబడిన టైల్యాంప్‌లను సూచిస్తాయి. హై వేరియంట్లలో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మినహా మారుతి సబ్ -4m SUV ఆఫర్ యొక్క సైడ్ ప్రొఫైల్‌లో ఎటువంటి మార్పు లేదు.
2) 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది
ప్రారంభించినప్పటి నుండి, విటారా బ్రెజ్జా ఫియట్-సోర్స్డ్ 1.3-లీటర్ డీజిల్ మోటారుతో మాత్రమే అందించబడింది, ఇది రాబోయే BS6 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అయితే చేయబడదు. వాస్తవానికి, ఏప్రిల్ 2020 తర్వాత డీజిల్ ఇంజిన్లను అందించబోమని మారుతి ప్రకటించింది మరియు అది ఇప్పటికి ఆ మాట మీదే ఉంది. కాబట్టి, సబ్ కాంపాక్ట్ SUV కి ఇప్పుడు మొదటిసారి పెట్రోల్ పవర్‌ట్రైన్ లభిస్తుంది.
మారుతి ఏ BS 6 ఇంజిన్ అవుతుందో ధృవీకరించనప్పటికీ, ఎర్టిగా / XL 6 మరియు సియాజ్‌లకు శక్తినిచ్చే తేలికపాటి-హైబ్రిడ్ టెక్‌తో అదే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుందని మేము నమ్మడానికి మంచి కారణం ఉంది. MPV లు మరియు సెడాన్లలో, ఇది 105PS మరియు 138Nm యొక్క అవుట్పుట్ కి ట్యూన్ చేయబడుతుంది, అయితే 4-స్పీడ్ ఆటోమేటిక్ ఎంపికతో 5-స్పీడ్ మాన్యువల్ కి జతచేయబడుతుంది. హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల నుంచి వచ్చే 1.2-లీటర్ BS 6 పెట్రోల్ మోటారు సబ్-కాంపాక్ట్ SUV కి సరిపోకపోవచ్చు.
3) CNG వేరియంట్‌ను కూడా పొందుతుందని భావిస్తున్నారు
విటారా బ్రెజ్జా వంటి చిన్న, ధర-సెన్సిటివ్ మోడళ్లలో మారుతి ఎటువంటి డీజిల్ ఇంజన్లను అందించదు కాబట్టి, కార్‌మేకర్ అదనపు ఇంధన సామర్థ్యం కోసం CNG వేరియంట్‌లను అందించనుంది. ఎర్టిగా MPV లోని 1.5-లీటర్ BS 6 పెట్రోల్-CNG మోటారు 92Ps మరియు 122Nm ఉత్పత్తిని 26 km / kg సామర్థ్యంతో కలిగి ఉంది. చిన్న విటారా బ్రెజ్జా మరింత పొదుపుగా ఉంటుంది, కానీ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
4) ఫేస్‌లిఫ్ట్ 2020 విటారా బ్రెజ్జాకు మరిన్ని కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది కొత్త పెట్రోల్ ఇంజన్ మరియు అప్‌డేటెడ్ స్టైలింగ్ కాకుండా, విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కొన్ని అదనపు ఫీచర్ల నుండి కూడా ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నారు. మనకు ఇంకా ఇంటీరియర్ యొక్క రహస్య చిత్రాలు లేవు, కానీ మారుతి 2020 మోడల్‌ను దాని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క సరికొత్త వెర్షన్, కొత్త అప్హోల్స్టరీ, క్యాబిన్ లో రంగు ఇన్సర్ట్‌లు మరియు అప్‌డేట్ చేసిన స్టీరింగ్ వీల్‌తో సన్నద్ధం చేసే అవకాశం ఉంది. వెలుపల, ఇది LED హెడ్‌ల్యాంప్‌లు మరియు డే టైం రన్నింగ్ LED లను పొందుతుందని భావిస్తున్నాము.
5) అన్ని అప్‌డేట్స్ కి చిన్న ప్రీమియం
ప్రస్తుత విటారా బ్రెజ్జాను డీజిల్ ఇంజిన్ తో అందిస్తున్నందున, BS6 పెట్రోల్‌తో ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ టాప్-స్పెక్ వేరియంట్‌లకు స్వల్ప ప్రీమియంతో ఇలాంటి ధరను కలిగి ఉంటుంది. మారుతి సబ్ -4m SUV కి ప్రస్తుత ధరలు రూ .7.63 లక్షల నుంచి రూ .10.38 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా XUV 300 వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా కొనసాగుతుంది, ప్రస్తుతం దీనిని కియా QYI అని పిలుస్తారు.
మరింత చదవండి: విటారా బ్రెజ్జా AMT