వారంలోని టాప్ 5 కార్ వార్తలు: మారుతి విటారా బ్రెజ్జా, టయోటా వెల్‌ఫైర్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, 2020 ఎలైట్ i20 & హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం dhruv attri ద్వారా మార్చి 04, 2020 01:35 pm ప్రచురించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మాస్ మార్కెట్ లో హ్యుందాయ్ ఈ వారం ముఖ్యాంశాలలో తన యొక్క ఆఫరింగ్స్ తో ఆధిపత్యం చెలాయించింది
మారుతి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ వివరించబడ్డాయి: కొత్త విటారా బ్రెజ్జా అవుట్‌గోయింగ్ మోడల్ కంటే తక్కువ ధర వద్ద ప్రారంభించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది మరియు వాటిలో మూడు ఆటోమేటిక్ ఆప్షన్ తో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక ఒకటి కొనుక్కోవాలనుకుంటే ఏది కొనాలో ఇక్కడ చూడండి.
టయోటా వెల్‌ఫైర్: టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రీమియం అని మీరు అనుకుంటున్నారా? అయితే, దాని బంధువు వెల్ఫైర్ ఖచ్చితంగా దాని బిజినెస్-క్లాస్ అనుభవంతో దానిని మించి ఉందని చెప్పవచ్చు . అయితే, దీని ధర ట్యాగ్ రూ.79.50 లక్షలు, ఈ ధర మీకు కొంచెం బాద కలిగించే విషయం అనే చెప్పాలి. ఆ డబ్బు కోసం ఇది ఖచ్చితంగా ఏమిటి అందిస్తోంది? ఇది ఖచ్చితంగా బ్యాడ్జ్ మాత్రమే కాదు, కాబట్టి ఇది ఏమిటి?
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ టర్బో: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ యొక్క మరింత శక్తివంతమైన పెట్రోల్ వెర్షన్‌ను తీసుకువచ్చింది. ఇది ఆరా టర్బో మాదిరిగానే ఇంజిన్ ను పొందుతుంది, కాని ప్రామాణిక హ్యాచ్‌బ్యాక్ కంటే మీరు ఎంత ఎక్కువ చెల్లించాలి? ఇక్కడ తెలుసుకోండి.
2020 హ్యుందాయ్ ఎలైట్ i20: రాబోయే i20 లోపలి భాగంలో మాకు మంచి లుక్ వచ్చింది. ఇది ఎలా కనిపిస్తుంది మరియు ఇది ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం ఆఫరింగ్ అవుతుందా? ఇక్కడ తెలుసుకోండి.
2020 హ్యుందాయ్ క్రెటా: హ్యుందాయ్ క్రెటా ఏప్రిల్ లో జనరేషన్ అప్‌డేట్ పొందబోతోంది, అయితే ప్రస్తుతం ఉన్న మోడల్ లాభదాయకమైన డిస్కౌంట్‌తో లభిస్తుంది. కాబట్టి మీరు క్రొత్తదాని కోసం వేచి ఉండాలా లేదా అవుట్గోయింగ్ మోడల్ కోసం వెళ్ళాలా? అనే ప్రశ్న కి సమాధానం ఇక్కడ తెలుస్తుంది.
మరింత చదవండి: గ్రాండ్ i10 ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful