మారుతి సుజుకి ఎస్ క్రాస్ నుండి ఆశించే అంశాలేమిటి?
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం sourabh ద్వారా జూలై 03, 2015 11:14 am సవరించబడింది
- 11 Views
- 6 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మారుతి సుజుకి త్వరలోనే ప్రారంభించనున్న దాని కొత్త కాంపాక్ట్ ఎస్యూవి ఎస్-క్రాస్ ను ఇటీవలే మలేషియాలో 2015 ఐఐఎఫ్ఏ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రదర్శించారు. నివేదిక ప్రకారం మారుతి సుజుకి ఎస్-క్రాస్ వచ్చే నెల మొదటి వారంలో వస్తోంది మరియు ఇది రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు విడుదలకి సిద్ధంగా ఉన్న హ్యూందాయ్ క్రెటా వంటి వాటితో పోటీ పడనుంది. కంపెనీ ఒక ప్రత్యేక మీడియా ఈవెంట్ నిర్వహించి దానిలో కాంపాక్ట్ ఎస్యూవి గురించి నిర్దిష్ట వివరాలను బహిర్గతం చేశారు. ఎస్-క్రాస్ ను రెండు డీజిల్, డెల్టా, జీటా ఆల్ఫా, సిగ్మా మరియు సిగ్మా(ఓ) అనే వివిధ వేరియంట్ల పేర్లతో మన ముందుకి రాబోతోంది.
కాబట్టి మారుతి సుజుకి ఎస్ క్రాస్ నుండి కోరుకుంటున్న అంశాలేంటో చూద్దాం
బాహ్య భాగాలు
- ఈ వాహనం యొక్క ముందు ప్రొఫైల్ రిఫ్రెష్ కనిపిస్తుంది మరియు ఈ ఎస్యువి యొక్క కొలతలను గనుక చూసినట్లైతే, దీని యొక్క పొడవు 4300 మిల్లీమీటర్లు, వెడల్పు 17965 మిల్లీమీటర్లు, ఎత్తు 1590 మిల్లీమీటర్లు. ఈ వాహనం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లు.
- ఈ వాహనాల యొక్క వీల్బేస్2600 మిల్లీమీటర్లు, బూట్ స్పేస్ 430 లీటర్లు ఉండగా, దీనిని మనం 480 లీటర్లు వరకు పొడిగించవచ్చు.
- ప్రామాణిక అంశాలు పరంగా చెప్పాలంటే, బాడీ కలర్ ఓఆర్విఎంస్, డోర్ హ్యాండిల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు స్టీల్ రిమ్స్ వంటి వాటితో రాబోతుంది.
- ఆప్షనల్ గా చెప్పాలంటే, ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, ఓఆర్విమెస్ పై సైడ్ సూచికలు, ఎల్ ఈ డి పొజిషన్ ల్యాంప్స్ వంటివి ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే అందించబడతాయి.
అంతర్గత భాగాలు
- ఈ ఎస్యువి లోపలి బాగం అంతా ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో పాటుగా ఏసి పై క్రోమ్ చేరికలతో రాబోతుంది.
- ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ ఈ వాహనాల దిగువ శ్రేణి వేరియంట్ లో మరియు లెధర్ అపోలిస్ట్రీ అగ్ర శ్రేణి వేరియంట్లలో అందించబడతాయి.
- సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్ మరియు విద్యుత్తో సర్దుబాటయ్యే ఓఆర్విఎంలు వంటి కొన్ని లక్షణాలు ప్రామాణికంగా అందించబడతాయి.
- ఈ కాంపాక్ట్ ఎస్యువి, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, క్రూజ్ నియంత్రణ మరియు ఖాళీతో కూడిన స్లైడింగ్ ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ వంటి వాటిని కూడా తయారీదారుడు ఈ వాహనంలో పొందుపరిచాడు.
ఇతర కంఫర్ట్ మరియు భద్రతా లక్షణాలు
- భద్రత పరంగా ఈ వాహనం ముందు భాగానికి వస్తే, డ్రైవర్ సైడ్ ఎయిర్బ్యాగ్ మరియు ఈ వాహనాల అగ్ర శ్రేణి మరియు మద్య శ్రేణి వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ అందించబడతాయి.
- ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్లతో పాటు ఏబిఎస్ నియంత్రణ ను తయారీదారుడు ఈ వాహనంలో పొందుపరిచాడు.
- స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలు, నావిగేషన్ మరియు 7-అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ప్లే సమాచార వ్యవస్థ వంటి వాటితో రాబోతుంది.
- బ్లూటూత్ మరియు యూఎస్బి కనెక్టివిటీలు అగ్ర శ్రేణి వేరియంట్ లలో మాత్రమే అందించబడతాయి.
ఇంజిన్ ఎంపికలు
రెండు డీజిల్ ఇంజన్ల్ మాత్రమే అందించబడతాయి. ఈ వాహనాలలో పెట్రోల్ ఇంజన్ లు లేవు
- ఈ వాహనాల డీజిల్ ఇంజన్ లు 1.6 లీటర్ డిడి ఐఎస్ మరియు 1.3 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజన్లు మాత్రమే అందించబడతాయి. ఈ వాహనాలలో పెట్రోల్ ఇంజన్ లు ప్రస్తుత విడుదలలో అందించబడటం లేదు
- 1.6 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 3750 rpm వద్ద 120 PS పవర్ ను విడుదల చేస్తుంది. అదే టార్క్ విషయానికి వస్తే, 1750 rpm వద్ద 320 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది.
- ఫియాట్ నుండి తీసుకోబడిన ఈ మల్టిజెట్ 1.3 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజన్, సియాజ్ లో విడుదల చేసినట్లుగా విడుదల చేయబడుతుంది. అంటే, 4000 rpm వద్ద 90PS పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా, 1750 rpm వద్ద 200 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది.
- 1.6 లీటర్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. 1.3 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
- దీనిలో ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే, ఆటోమేటిక్ వెర్షన్ లు మరియు ఏడబ్ల్యూడి డ్రైవ్ అందించబడవు.
వేరియంట్ యొక్క నిర్దేశాలు
ఎస్ క్రాస్ 1.3లీటర్ డెల్టా మరియు 1.6లీటర్ డెల్టా: స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నలుపు మరియు సిల్వర్ రూఫ్ రెయిల్స్, ఫుల్ వీల్ క్యాప్స్ మరియు డోర్ క్రోం హ్యాండిల్స్, యాంటీ తెఫ్ట్ భద్రతా వ్యవస్థ, డిస్ప్లేతో రివర్స్ పార్కింగ్ సెన్సార్ మరియు సిడి ప్లేయర్ తో ఆడియో.
ఎస్ క్రాస్ 1.3లీటర్ జీటా మరియు 1.6లీటర్ జీటా: స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ మరియు పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ (1.3లీటర్ కి మాత్రమే), ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓఆర్ విఎంస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ సెంటర్ ఆర్మెస్ట్ మరియు పార్సెల్ ట్రే.
ఎస్ క్రాస్ 1.3లీటర్ ఆల్ఫా మరియు 1.6లీటర్ ఆల్ఫా: 16-అంగుళాల అలాయ్ వీల్స్ మరియు లెదర్ అపోలిస్ట్రీ, క్రూజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్.
ఎస్ క్రాస్ 1.3లీటర్ సిగ్మా మరియు సిగ్మా (ఓ): బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, స్టీల్ రిమ్స్ మరియు ఫాబ్రిక్ అపోలిస్ట్రీ. సిగ్మా ఎంపికలో డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఏబిఎస్ మరియు 4 స్పీకర్స్.