వారాంతపు విశేషాలు: భారతదేశాన్ని వారి కంచుకోటగా నిర్మించుకోనున్న డాట్సన్, అధికారికంగా రాబోయే 2016 ఇన్నోవా యొక్క టీజర్ ను విడుదల చేసిన టొయోటొ

నవంబర్ 16, 2015 02:34 pm manish ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ వారం వార్తలు ప్రపంచవ్యాప్తంగా వాహనతయారి సంస్థ నుండి నవీకరణలను తీసుకొచ్చాయి. సీఈఓ సూచనల ప్రకారం డాట్సన్ వారు భారతదేశాన్ని వారి కంచుకోటగా నిర్మించుకోనున్నారు మరియు నివేదికల ప్రకారం వోక్స్వ్యాగన్ బీటిల్ త్వరలో భారరతదేశానికి రాబోతున్నది. డాట్సన్ రెడీ-గో చెన్నై వీధులలో మొదటి సారిగా భారతదేశంలో పరీక్ష చేయబడుతూ కంటపడింది మరియు కొద్ది రోజుల తరువాత మహీంద్రా ఎస్101 కూడా అదే విధంగా జరిగింది. హ్యుందాయి క్రెటా అక్టోబర్ నెలలో ఇప్పటివరకు అత్యధిక అమ్మకాలు నమోదు చేసుకున్న ఫలితంగా దేశంలోనే రెండో అతిపెద్ద వాహనతయారి సంస్థగా కానున్నది.

టొయోటా సంస్థ అధికారికంగా టీజర్ లో రాబోయే ఇన్నోవా యొక్క వెనుక భాగం విడుదల చేసింది. టాటా మోటార్స్   దాని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా లియోనెల్ మెస్సీ ని ప్రకటించింది. టాటా వారి రాబోయే హ్యాచ్‌బ్యాక్ అయిన కైట్ యొక్క అధికారిక ప్రకటనలో అంతర్జాతీయ ఎంబాసడర్ అయిన లియోనెల్ మెస్సీ కనపడటం జరిగింది. మరోవైపు, మారుతి దాని ఇటీవల విడుదల ప్రీమియం హ్యాచ్బ్యాక్, బాలెనో యొక్క ఉపకరణాలు వెల్లడించింది. అయితే, భారతీయ ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్‌లలో అగ్రగామి అయిన కార్‌దేఖో.కాం వారు ఆటో మొబైల్ డీలర్స్ అసొసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తో ఎంఓయూని కుదుర్చుకున్నారు. మేము టొయోటా నుండి కూడా రానున్న కార్లు జాబితాను సిద్ధం చేశాము. కాబట్టి ఈ వారం ఏమిఏమిటి జరిగాయో ఒకసారి చూద్దాము. 

వార్తలు:

డాట్సన్ వారు భారతదేశాన్ని వారి కంచుకోటగా నిర్మించుకోనున్నారు అని సీఈఓ గారు సూచన అందించారు

జైపూర్: డాట్సన్ కి అధినేత అయిన విన్సెంట్ కోబీ గారు ప్రపంచంలో వారి కంపెనీ పాత్ర పెంచేందుకు గానూ భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించనుంది అని తెలిపారు. నిస్సాన్ వారు ఈ బ్రాండ్ ని భారతదేశంలో మొదలుకుని, ప్రపంచ వ్యాప్తంగా పునఃప్రారంభం చేశారు. మొదట్లో కంపెనీ వారు అంతగా రాణించకపోయినా కూడా ఇంకా భారతదేశమే వారి భవిష్యత్ ఎగుమతులకు పట్టు కొమ్మ అని భావిస్తున్నారు. ఇంకా చదవండి 

త్వరలో భారతదేశంలో ప్రారంభం కానున్న వోక్స్వ్యాగన్ బీటిల్

జైపూర్: అంతకుముందు వోక్స్వ్యాగన్, దేశంలో నిర్ధారణ ప్రయోజనం కోసం కొత్త బీటిల్ యొక్క యూనిట్లను రవాణా చేసేది. ఇప్పుడు కారు యొక్క అనేక యూనిట్లను భారతదేశానికి తీసుకురావడం దేశంలో బీటిల్ యొక్క అత్యంత వేగమైన అప్రోచింగ్ కి సూచికగా చెప్పవచ్చు. ఈ కారు సిబియు మార్గం ద్వారా భారతదేశానికి తీసుకురాబడుతున్నది . ఇంకా చదవండి

హ్యుండై ఇండియా అక్టోబర్ కి అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది; క్రేటా జోరుని కొనసాగిస్తోంది

జైపూర్: హ్యుండై మోటర్ ఇండియా లిమిటెడ్ వారు రికార్డు స్థాయిలో అత్యధిక దేశీయ అమ్మకాలను గత నెల నమోదు చేశారు. ఈ కొరియన్ ఆటో తయారీదారి గత నెల దేశీయ మార్కెట్లో గత నెల 47,015 యూనిట్లను అమ్మడం జరిగింది మరియూ 14,777 యూనిట్లను ఎగుమతి చేశారు. మొత్తం కలిపి 61,792 యూనిట్ల సంచిత అమ్మకాలను నమోదు చేయడం జరిగింది. ఇంకా చదవండి 

2016 టయోటా ఇన్నోవా యొక్క వెనుక భాగం బ్రోచర్ లో బహిర్గతం!

జైపూర్: కొన్ని రోజుల ముందు 2016 టయోటా ఇన్నోవా యొక్క బ్రోచర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి మరియు ఇప్పుడు ఆ ప్రముఖమైన ఎంపివి వెనుక భాగం యొక్క మరిన్ని ఎక్కువ షాట్లు ఉద్భవించాయి. రాబోయే కారు గణనీయంగా ప్రస్తుత కారు కంటే మరుతూ ఉంది. సాధారణంగా ఉండే కారు ఇప్పుడు నవీకరణలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే, మరింత టొయోటా తాజా రూపకల్పన ని కలిగి ఉంది. ఇంకా చదవండి 

టొయోటా వారు అధికారికంగా 2016 ఇన్నోవా ప్రకటనతో ముందుకొచ్చారు!

జైపూర్: టొయోటా వారు రెండవ తరం ఇన్నోవా యొక్క మొదటి అధికారిక ప్రకటన ని 'త్వరలో రాబోతోందీ అనే శీర్షికతో విడుదల చేశారు. తాజాగా ఈ 2016 ఇన్నోవా కి సంబంధించి ఇండొనేషియా బ్రోషర్ సంఘటనతో సహా అనేక మార్లు వివరాలు వెలువడటం జరిగింది. ఈ నెల 23న ఈ రెండవ తరం ఇన్నోవా విడుదల ఆయే అవకాశం ఉంది. భారతీయ విడుదల మాత్రం వచ్చే ఏడాది జరగవచ్చు కాకపోతే ఆవిష్కరణ మాత్రం ఆటో ఎక్స్‌పో 2016 న జరగవచ్చును. ఇంకా చదవండి

లియోనెల్ మెస్సీ ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన టాటా మోటార్స్

జైపూర్: జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ యజమానులు, టాటా మోటార్స్, వారు వారి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నాలుగు సార్లు ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అయిన లియోనెల్ మెస్సీని ప్రకటించింది. స్వదేశ వాహనతయారీ సంస్థ ప్రకారం, దాని ప్రయాణీకుల వాహన విభాగం మొదటిసారి బ్రాండ్ అంబాసిడర్ తో బ్రాండ్ సంఘం ప్రచారం చేయనున్నాయి మరియు లియోనెల్ మెస్సీ యొక్క ఎండార్స్మెంట్ దీర్ఘకాల భాగస్వామ్యంగా ఉంటుంది. ఇంకా చదవండి 

మొదటి సారిగా టాటా కైట్ వారి ప్రకటన: ఇందులో లియోనెల్ మెస్సీ కనపడ్డారు

జైపూర్: టాటా వారి రాబోయే హ్యాచ్‌బ్యాక్ అయిన కైట్ యొక్క అధికారిక ప్రకటనలో అంతర్జాతీయ ఎంబాసడర్ అయిన లియోనెల్ మెస్సీ కనపడటం జరిగింది. టాటా వారి #మేడ్ఆఫ్‌గ్రేట్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రకటన అంతర్జాతీయంగా ప్రదర్శింపబడుతోంది మరియూ కంపెనీకి అంతర్జాతీయ గుర్తింపుని పెంచనుంది. ఇంకా చదవండి

మారుతి బాలెనో యాక్సెసరీస్ బహిర్గతం

జైపూర్: మారుతి బాలెనో, ప్రీమియం హ్యాచ్బ్యాక్ శ్రేణి కొన్ని రోజుల క్రితం రూ.4.99 లక్షల నుండి 8.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించబడినది. పోటీ ధరతో కారు ఎంచుకోవడానికి కొత్త యాక్సెసరీస్ తో ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాక్సెసరీస్ లను నెక్సా వెబ్సైట్ ద్వారా సమీకరించి కారు యొక్క మొత్తం రూపాన్ని చూడవచ్చు. ఇంకా చదవండి 

కార్‌దేఖో.కాం ఎఫ్ఏడీఏ తో చేతులు కలపడం వలన ఆటోమొబైల్ డీలర్లకి ఉత్తేజాన్ని అందించింది

జైపూర్:భారతీయ ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్‌లలో అగ్రగామి అయిన కార్‌దేఖో.కాం వారు ఆటో మొబైల్ డీలర్స్ అసొసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తో ఎంఓయూని కుదుర్చుకున్నారు. డిజిటల్ వేదిక ద్వారా భారతీయ ఆటోమొబైల్ డీలర్లకు ఏ విధంగా లాభం చేకూర్చాలి అనే లక్ష్యంగా కలిసి పనిచేస్తారు. ఒప్పందం ప్రకారం కార్‌దేఖో.కాం వారు ఎఫ్ఏడీఏ తో కలసి ఆటో సమ్మిట్ 2016-ఎఫ్ఏడీఏ యొక్క 9వ ఆటోమొబైల్ డీలర్ల కన్వెన్షన్ ని 'డిజిటల్ డీలర్' పేరిట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 7, 2016 లో జరగనుంది. దీనికి దాదాపుగా 800-1,000 డీలర్లు దేశ వ్యాప్తంగా హాజరు కానున్నారు. ఇంకా చదవండి 

టొయోటా వారి రాబోయే కార్లు - చూడండి!

జైపూర్: టొయోటా, ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీసంస్థ మరియు అత్యుత్తమ సమర్పణలు అందించడం ద్వారా భారత ఆటోమోటివ్ రంగంలో తనకు తాను నిరూపించుకున్న సంస్థ. ఈ వాహన తయారీసంస్థ కొరెల్ల, ఇన్నోవా మరియు లగ్జరీ సెడాన్ క్యామ్రీ వంటివి అందించి అపారమైన విజయం సాధించింది. కాబట్టి, ఇక్కడ టొయోటా వారి రాబోయే అద్భుతమైన కార్ల యొక్క జాబితాను మీ ముందు ఉంచడం జరిగింది. వాటిని చూడండి!  ఇంకా చదవండి 

మిస్టీ గ్రీన్ పర్ల్ వర్ణంలో హోండా బీఆర్-వీ ప్రదర్శితమైంది

జైపూర్: ఇండియన్ మోటర్ షోలో మొదటి ఆవిష్కారం దగ్గర నుండి హోండా బీఆర్-వీ రఒడ్‌షోలో ప్రదర్శితం అవుతోంది. కొనుగోలకి ఈ వాహనం యొక్క అనుభవం అందించేందుకు కంపెనీ వారు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇందుకు గాను హోండా వారు బీఆర్-వీ ని మిస్టీ గ్రీన్ పర్ల్ వర్ణంలో అందించారు. 2015 సౌరభ్యా ఆటోమోటివ్ ఎగ్జిబిషన్ లో ఈ కారుని ప్రదర్శించారు మరియూ భారతదేశంలో ఇది 2016 డిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫిబ్రవరి నెలలో ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది. ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience