డాట్సన్ వారు భారతదేశాన్ని వారి కంచుకోటగా నిర్మించుకోనున్నారు అని సీఈఓ గారు సూచన అందించారు
డాట్సన్ రెడి-గో 2016-2020 కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 02, 2015 06:54 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్ యాఖ్యను వ్రాయండి
జైపూర్:
డాట్సన్ కి అధినేత అయిన విన్సెంట్ కోబీ గారు ప్రపంచంలో వారి కంపెనీ పాత్ర పెంచేందుకు గానూ భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించనుంది అని తెలిపారు. నిస్సాన్ వారు ఈ బ్రాండ్ ని భారతదేశంలో మొదలుకుని, ప్రపంచ వ్యాప్తంగా పునఃప్రారంభం చేశారు. మొదట్లో కంపెనీ వారు అంతగా రాణించకపోయినా కూడా ఇంకా భారతదేశమే వారి భవిష్యత్ ఎగుమతులకు పట్టు కొమ్మ అని భావిస్తున్నారు.
వచ్చే ఏళ్ళలో సార్క్ దేశాలు మరియూ దక్షిణ ఈశాన్య ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకోనున్నారు. "షార్ట్-టర్మ్ లక్ష్యాల పరంగా కనీసం 10 నుండి 15 దేశాలు మా పరిశీలన లో ఉన్నాయి. ఆఫ్రికాలో డాట్సన్ గో నేను కొనుగోలు చేస్తే, అది భారతదేశంలో తయారు అయినది అయి ఉంటుంది. చెన్నైలోని సదుపాయంలో తయారు చేసి 10-20 దేశాలకు ఎగుమతి చేయగలగటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంచి సమతూలన ఏమిటంటే, రెండు వంతులు స్థానికంగా, ఒక వంతు ఎగుమతులుగా నిష్పత్తి ఉండటం," అని అన్నారు.
ఎలక్ట్రానిక్ వాహనాల ఎదుగుదలతో పాటుగా డాట్సన్ ఎంతగా నిస్సాన్ ఎదుగుదలకి ముఖ్యమో కూడా వారు తెలిపారు. "10 వేల డాలర్ల విభాగంలోకి, అనగా కొత్త భూభాగంలోకి ప్రవేశించడం సవాలే కానీ దీని కోసం మా వద్ద ప్రణాలికలు ఉన్నాయి," అని అన్నారు.
ప్రస్తుతం, డాట్సన్ భారతదేశం, ఇండొనేషియా, రష్యా మరియూ దక్షిణ ఆఫ్రికా దేశాలలో ఉంది మరియూ 2014లో 50,000 వాహనాల సంచిత అమ్మకాలు అందుకుది. భారతదేశంలో, డాట్సన్ గో ఇంకా గో+ లను అమ్ముతుంది. 2016 లో గో క్రాస్ కూడా ఈ జాబితాలో చేరనుంది.