ఎస్-క్రాస్ కొనాలని అనుకుంటున్నారా? ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఉంది

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 23, 2015 06:02 pm ప్రచురించబడింది

జైపూర్: మారుతీ వారు వారి కాంపాక్ట్ క్రాస్-ఓవర్ అయిన ఎస్-క్రాస్ ని వచ్చే నెల ఆగస్ట్ 4కి అటు ఇటుగా మొదటి వారంలో విడుదల చేశేందుకు సిద్దం అయ్యారు. కాంపాక్ట్ సెగ్మెంట్ లో పోటీ హ్యుండై క్రేటాతొప ఎక్కువైనా, ఎస్-క్రాస్ రాకతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ, ప్రతి వాహనానికి దాని ప్రత్యేకత ఉంది మరియూ ఇక్కడ ఎస్-క్రాస్ ని అన్నిటికంటే బిన్నంగా ఉంచే అలంటి కొన్ని లక్షణాలు చూద్దాము.

నెక్సా తో మొదలుపెడితే, అది ఇప్పటికే ప్రసిద్దమైంది పేరు అయ్యింది, ఈ ఉన్నత డీలర్షిప్ తో మారుతీ వారు ఎస్-క్రాస్ ని మరియూ వారి ఇతర ఉత్పత్తులని వచ్చే సంవత్సరాలలో విడుదల చేయనున్నరు. దీనిని ప్రసిద్దం చేశేందుకు గాను, మారుతీ వారు ఎస్-క్రాస్ ని నెక్సా ప్రారంభం అయ్యే నగరాలలో విడుదల చేస్తోంది. ఇది కారుని కొనుగోలుదారులతో పాటుగా సామాన్య ప్రజల వద్దకు కూడా తీసుకెళ్ళేందుకు చేస్తున్న ప్రయత్నం.  

సౌకర్యవంతమైన క్యాబిన్

ఎస్-క్రాస్ క్యాబిన్ లోకి అడుగు పెట్టిన వెంటనే, మీకు ఇది మీరు ఎప్పుడు కూర్చునే మామూలు క్యాబిన్ లాగా అనిపించదు. ఇందులోని పదార్ద్దాల నాణ్యత డస్టర్ మరియూ ఈకోస్పోర్ట్ వంటి పోటీదారుల కంటే ఎంతో ఉన్నతంగా ఉంటాయి.

భారీ సమతుల్యం!


ఇప్పుడు, ఎస్-క్రాస్ ఎస్ యువి లా కాకుండా మరింతగా హాచ్బాక్ లా కనిపిస్తుంది. కానీ 4,300mm పొడవు తో భారీగా ఉంది. దాని కొలతలు, పరిమాణం దీని ప్రత్యర్థులు తో సమానంగా ఉందని నిర్దారించవచ్చు.

టార్క్ 1.6 డీజిల్ !


ఆకర్షణీయమైన ఎస్-క్రాస్ 1.6 లీటర్ ఫియట్ ఇంజిన్ తో 320nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే విధమైన టార్క్ సఫారి స్ట్రాం లో 2.2 లీటర్ వారికోర్ ఇంజిన్ ద్వారా లభిస్తుంది. అయితే, స్ట్రాం లో విడుదల అయ్యే ఈ టార్క్ వాహనాన్ని ముందుకు నడపడానికి ఉపయోగపడగా, ఇదే టార్క్ ఎస్-క్రాస్ కి భారీ ట్రాఫిక్ పరిస్థితులప్పుడు సహకరిస్తుంది.

ధర!

నిజాయితీగా చెప్పాలంటే, ఎస్-క్రాస్ కొంచం హ్యుండై క్రేటా కంటే సాంప్రదాయంగా ఉంటుంది కానీ మారుతీ వారు దీన్ని సరన ధరకు గనుక అందిస్తే ఎస్-క్రాస్ కి స్పందన మరింత బాగా వచ్చే అవకాశం ఉంది. ఇది క్రేటా యొక్క దిగువ శ్రేని మరియూ ఉన్నత శ్రేని రెండిటి కంటే తక్కువగా అందిస్తుంది అన్నట్టుగా అనిపిస్తోంది కాబట్టి దీనిలో ఉన్న అంతర్గత నాణ్యతను కూడా దృష్టిలో పెట్టుకుని దీనికి మెరుగైన స్పందన లభిస్తుంది అనే అనిపిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి S-Cross 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience