భారతదేశంలో తయారుచేయబడిన వోక్స్వాగెన్ వెంటో మోడల్స్ కి రక్షణ కి ఎన్‌సీఏపీ వారు 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం manish ద్వారా నవంబర్ 18, 2015 12:34 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:  తాజా డీజిల్ గేట్ కుంభకోణంలో జర్మన్ తయారీదారి అయిన వోక్స్వాగెన్ ఆఖరికి కొంత మంచి పేరు సంపాదించారు. భారతదేశంలో తయారు చేయబడిన వోక్స్వాగెన్ వెంటో లాటిన్ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. వీటికి ఎన్‌సీఏపీ లాటిన్ వారు 5-స్టార్ రేటింగ్ ని అందించారు. ఈ సంస్థ కార్ల రక్షణ ఇంకా క్రాష్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షలలో 1 నుండి 5 వరకు రేటింగ్ ని అందిస్తుంది(1 అంటే అతి తక్కువ అని). రక్షణ పరంగా, కారుకి డ్యువల్ ఫ్రంట్ ఎయిర్-బ్యాగ్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, ఏబీఎస్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ మరియూ సీటు బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి. 

Volkswagen Vento Latin NCAP Crash-test

ఈ కారుకి పెద్ద వారి రక్షణ విభాగంలో 17 కి 14.73 పాయింట్స్ వచ్చాయి. చిన్న పిల్లల రక్షణ విభాగంలో 49 కి 34.06 పాయింట్లు వచ్చాయి.  ఈ కారణంగా, పెద్దల రక్షణకై 5 స్టార్ రేటింగ్ ఇంకా చిన్న పిల్లల రక్షణకై 3 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది. 5 స్టార్ రేటింగ్ కేవలం సైడ్ ఇంపాక్ట్ బార్స్ ఉన్న కార్లకు మాత్రమే ఇవ్వబడింది. పైగా, రక్షణకీ  వెంటో 'స్టేబల్' సర్టిఫికేట్ పొందింది.  

ఇంజిను విషయంలో, భారతీయ వోక్స్వాగెన్ వెంటో కి మూడు ఇంజిను ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఒక 1.6-లీటర్ ఎంపీఐ పెట్రోల్, ఒక 1.5-లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిను మరియూ ఒక 1.2-లీటర్ టీఎసై పెట్రోల్ ఇంజిను గా ఉన్నాయి. అన్ని ఇంజిన్లు 103.5bhp శక్తి విడుదల చేయగలవు. టార్క్ విషయంలో 1.6-లీటర్ ఇంజిను 153Nm ఉత్పత్తి చేయగా, 1.5-లీటర్ ఇంజిను 250Nm మరియూ 1.2-లీటర్ 175Nm టార్క్ లు విడుదల చేయగలవు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన వోక్స్వాగన్ వెంటో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience