వోక్స్వ్యాగన్ యొక్క T-ROC మార్చి నెలలో భారతదేశంలో షోరూమ్‌లకు వెళ్తుంది
వోక్స్వాగన్ టి- ఆర్ ఓ సి కోసం dhruv ద్వారా ఫిబ్రవరి 28, 2020 12:57 pm ప్రచురించబడింది
- 49 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వోక్స్వ్యాగన్ యొక్క జీప్ కంపాస్ ప్రత్యర్థి CBU- మార్గం ద్వారా దేశంలోకి తీసుకురాబడుతుంది
- 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో T-ROC 150Ps లను మాత్రమే అందిస్తుంది.
- ట్రాన్స్మిషన్ దీనిలో 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ అందుబాటులో ఉంది.
- ఇది డ్యూయల్-ఛాంబర్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.
- దీని ధరలు రూ .18 లక్షల నుంచి ప్రారంభమవుతాయని మేము ఆశిస్తున్నాము.
మార్చి 18 న T-ROC భారతదేశంలో లాంచ్ అవుతుందని వోక్స్వ్యాగన్ వెల్లడించింది. VW నుండి కాంపాక్ట్ SUV ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించబడింది. VW యొక్క పెద్ద టిగువాన్ ఆల్ స్పేస్ కూడా అదే నెలలో లాంచ్ అవుతుంది.
T-ROC కాంపాక్ట్ SUV, ఇది కియా సెల్టోస్ కు దగ్గరగా ఉంటుంది. ఇది CBU మార్గం ద్వారా తీసుకురాబడుతుంది కాబట్టి, దాని ధరలు జీప్ కంపాస్ యొక్క ధరలకు దగ్గరగా ఉంటాయి.
వోక్స్వ్యాగన్ భారతదేశంలో గత డీజిల్ ఇంజిన్లను నిలిపివేద్దామని నిర్ణయించింది మరియు అందువల్ల, T-ROC కి 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంది,150Ps లను ఉత్పత్తి చేస్తుంది. టార్క్ ఫిగర్ ని వోక్స్వ్యాగన్ ఇంకా వెల్లడించలేదు. దీనిలో ఉండే గేర్‌బాక్స్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ మాత్రమే.
ముందు భాగంలో డిజైన్ విషయానికి వస్తే, T-ROC లో డ్యూయల్-ఛాంబర్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRL తో ఉంటాయి. ఇదిలా ఉండగా, ఫాగ్ ల్యాంప్స్ ముందు బంపర్‌పై మరింత క్రింద ఉంటాయి. విండ్‌షీల్డ్ ర్యాక్ చేయబడింది మరియు రూఫ్‌లైన్ కూడా వెనుక వైపుకు వాలుగా ఉంటుంది, ఇక్కడ వెనుక విండ్‌షీల్డ్ కూడా చాలా ర్యాక్ చేయబడిందని మీరు కనుగొంటారు. ఇది T-ROC కు కూపే-ఎస్క్యూ సైడ్ ప్రొఫైల్ ను ఇస్తుంది.
వోక్స్వ్యాగన్ పనోరమిక్ సన్‌రూఫ్, 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌తో T-ROC ని అందిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం ద్వారా భద్రతని కలిగి ఉంటుంది.
భారతదేశంలో T-ROC ప్రారంభించినప్పుడు, దాని ధరలు రూ .18 లక్షల నుండి ప్రారంభమవుతాయని మేము ఆశిస్తున్నాము. ఆ ధర వద్ద, ఇది జీప్ కంపాస్ మరియు రాబోయే స్కోడా కరోక్ తో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful