Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వోక్స్వ్యాగన్ తన SUV కార్లని ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శిస్తుంది

జనవరి 18, 2020 01:56 pm sonny ద్వారా ప్రచురించబడింది

జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఇప్పటి నుంచి భారత్‌కు పెట్రోల్ తో మాత్రమే సమర్పణలను తీసుకురాబోతోంది

వోక్స్వ్యాగన్ భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇప్పటి వరకూ కొంచెం వెనుకడుగు వేసింది, కాని జర్మన్ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు కొంచెం సరికొత్తగా తిరిగి రావడానికి సిద్ధమవుతుంది. ఆటో ఎక్స్‌పో 2020 లో, వోక్స్వ్యాగన్ కొన్ని BS 6 అప్‌డేటెడ్ మోడళ్లతో పాటు నాలుగు కొత్త SUV ఆఫర్‌లను ప్రదర్శించనుంది. దేశంలో తనను తాను SUV బ్రాండ్‌గా మార్చుకునే ప్రణాళికలను కార్‌మేకర్ ఇప్పటికే ధృవీకరించింది. ఇది ఏప్రిల్ 2020 తరువాత BS 6 శకం కోసం దాని డీజిల్ ఇంజన్లను కూడా తొలగించనుంది.

భారతదేశంలో ప్రారంభించటానికి ముందు ఎక్స్పోకు తీసుకురాబోయే వోక్స్వ్యాగన్ యొక్క నాలుగు కొత్త SUV లు ఇవి:

వోక్స్వ్యాగన్ T-క్రాస్

T-క్రాస్ అనేది వోక్స్వ్యాగన్ యొక్క అతి చిన్న SUV కారు, కానీ ఇది ఎక్స్పోలో జర్మన్ కార్ల తయారీదారుల యొక్క పెద్ద టికెట్ అవుతుంది. ఇది స్కోడా కౌంటర్, విజన్ IN మాదిరిగానే MQB A0 IN ప్లాట్‌ఫాం ఆధారంగా స్థానికంగా నిర్మించబడుతుంది. గ్లోబల్ మోడల్ గ్లోబల్-స్పెక్ MQB A0 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. 2021 ప్రారంభంలో లాంచ్ అయినప్పుడు ఇది కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని పొందుతుందని ఆశిస్తున్నాము. T-క్రాస్ భారతదేశంలో వోక్స్వ్యాగన్ యొక్క సరసమైన కాంపాక్ట్ SUV సమర్పణ.ఇది T-రోక్ మరియు కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ప్రత్యర్థి SUV ల క్రింద ఉంచబడుతుంది.

వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్స్పేస్

టిగువాన్ ఆల్స్పేస్ అనేది టిగువాన్ SUV యొక్క పెద్దగా ఉండే వీల్‌బేస్ వెర్షన్ అని చెప్పవచ్చు, ఇది 2017 నుండి భారతదేశంలో అమ్మకానికి ఉంది. ఇది ఇప్పుడు మూడవ వరుసకు రెండు అదనపు సీట్లను పొందుతుంది, ఇది 7-సీట్ల SUV మోడల్‌ గా మారింది. ప్రస్తుత టిగువాన్ యొక్క 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ స్థానంలో BS 6-కంప్లైంట్ 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 190Ps పవర్ మరియు 230 Nm టార్క్ అవుట్పుట్ ని కలిగి ఉంటూ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ తో ఉంటుంది. ఆల్స్పేస్ ప్రస్తుత టిగువాన్ మోడల్‌ పై గణనీయమైన అంతర్గత అప్‌డేట్స్ ని కలిగి ఉండదు. వోక్స్వ్యాగన్ దీనిని ఏప్రిల్ 2020 యొక్క BS 6 గడువులో భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉంది.

వోక్స్వ్యాగన్ T-రోక్

వోక్స్‌వ్యాగన్ T-రోక్ కాంపాక్ట్ SUV ని CBU మార్గం ద్వారా భారత్‌ కు తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిబట్టి, ఇది జీప్ కంపాస్ మిడ్-సైజ్ SUV మాదిరిగానే ఉంటుందని అర్ధం అవుతుంది. ఖచ్చితమైన నిష్పత్తిలో, T-రోక్ కియా సెల్టోస్ కంటే చిన్నది కాని స్పోర్టియర్ కూపే లాంటి రూఫ్ ను కలిగి ఉంది. 12.3- ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంబెడెడ్ ఇసిమ్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ, పార్కింగ్ అసిస్ట్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లక్షణాలతో కూడిన క్యాబిన్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. T-రోక్ 2020 మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

వోక్స్వ్యాగన్ I.D. క్రోజ్ II కాన్సెప్ట్

వోక్స్వ్యాగన్ తన ఆల్-ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ కాన్సెప్ట్‌ ను ఆటో ఎక్స్‌పో 2020 కి తీసుకువస్తుంది. క్రోజ్ II లో SUP- వంటి గ్రౌండ్ క్లియరెన్స్‌తో కూపే లాంటి రూఫ్ ని కలిగి ఉంటుంది. వోక్స్వ్యాగన్ ప్రొడక్షన్-స్పెక్ క్రోజ్ II ను గ్లోబల్ మార్కెట్లలో ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు, కాని కాన్సెప్ట్ మోడల్ ఎక్స్పోలో ప్రదర్శనలో ఉంటుంది. కాన్సెప్ట్ యొక్క AWD ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు 83 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటూ 500 కిలోమీటర్ల అంచనా రేంజ్ ని ఉపయోగిస్తుంది.

SUV లతో పాటు, వోక్స్‌వ్యాగన్ కొత్త BS 6 పెట్రోల్-శక్తితో కూడిన పోలో, అమియో మరియు వెంటోలతో పాట స్థానికంగా తయారుచేసిన 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లను కూడా ప్రదర్శించనుంది. జర్మన్ కార్ల తయారీసంస్థ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ నిలిపివేయబడినందున ఫేస్‌లిఫ్టెడ్ పాసాట్‌ను కూడా ప్రదర్శించవచ్చు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.30.40 - 37.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర