కియా సెల్టోస్ యొక్క ప్రత్యర్థి అయిన కొత్త స్కోడా విజన్ స్కెచ్ లు ఎక్స్టీరియర్ ని చూపిస్తున్నాయి

జనవరి 15, 2020 12:33 pm sonny ద్వారా ప్రచురించబడింది

  • 40 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కాన్సెప్ట్ SUV ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించబడుతుంది

  •  కొత్త విజన్ IN కాన్సెప్ట్ MQB A0 IN ప్లాట్‌ఫాం ఆధారంగా స్కోడా యొక్క 2021 కాంపాక్ట్ SUV ని ప్రివూ చేస్తుంది. 
  •  ఈ కాన్సెప్ట్ ఫిబ్రవరి 2020 లో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో బహిరంగ ప్రవేశం చేస్తుంది.
  •  విజన్ IN యొక్క కొత్త ఎక్స్‌టీరియర్ స్కెచ్‌లు యూరోపియన్-స్పెక్ కమిక్‌ తో పోలిస్తే ప్రత్యేకమైన, మస్క్యులర్ మరియు కఠినమైన డిజైన్‌ ను కలిగి ఉన్నాయి.  
  •  విజన్ IN యొక్క ప్రొడక్షన్ మోడల్ 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది.  
  •  ప్రొడక్షన్-స్పెక్ స్కోడా కాంపాక్ట్ SUV Q2 2021 లో భారత్‌ కు రానుంది.

New Skoda Vision IN Sketches Tease Exterior Of Kia Seltos Rival

స్కోడా భారతదేశంలో తను భవిష్యత్తులో అందించబోయే చిన్న SUV యొక్క మొదటి ఎక్స్టీరియర్ టీజర్‌ను వదిలివేసింది. విజన్ ఇన్ కాన్సెప్ట్ ఫిబ్రవరిలో ఆటో ఎక్స్‌పోలో బహిరంగ ప్రవేశం చేయనుంది.

విజన్ ఇన్ కాన్సెప్ట్ ముందు మరియు వెనుక బంపర్‌ పై కఠినమైన స్టైలింగ్ అంశాలతో, మస్క్యులర్ లుక్ తో ఉందని స్కెచ్‌లు మనకి తెలుపుతున్నాయి. భారతీయ SUV మార్కెట్‌ కు అనుకూలమైన లక్షణం అయిన హై సీటింగ్ పొజిషన్‌ ను ఇవ్వడానికి ఇది ఎత్తైన వైఖరిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

New Skoda Vision IN Sketches Tease Exterior Of Kia Seltos Rival

ఇది VW గ్రూప్ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది, ఇది MQB A0 ప్లాట్‌ఫాం యొక్క లొకలైజెడ్ వెర్షన్, ఇది గ్లోబల్-స్పెక్ స్కోడా కమిక్‌ కు మద్దతు ఇస్తుంది. విజన్ ఇన్ కామిక్ మాదిరిగానే 4.26 మీటర్ల పొడవు ఉంటూ కాంపాక్ట్ SUV విభాగంలో ఉంటుంది. ఇది బోల్డ్ గ్రిల్ డిజైన్, బోనెట్ లైన్ వెంట స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్ మరియు వెనుక వైపున L-ఆకారపు LED టైలాంప్‌లతో లైట్ బార్ కలిగి ఉంటుంది. విజన్ IN బూట్ మూత అంతటా స్కోడా అక్షరాలను కలిగి ఉంది.

Skoda’s Kia Seltos-rival’s Interior Teased Ahead Of Auto Expo 2020

స్కోడా ఇప్పటికే మునుపటి స్కెచ్‌లో విజన్ ఇన్ ఇంటీరియర్‌ను విడుదల చేసింది, ఇది ఫ్రీ-ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లే ను చూపించింది, బహుశా యూరో-స్పెక్ కమిక్ మాదిరిగానే 9.2-అంగుళాల యూనిట్.  కాన్సెప్ట్ కారు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ తో వస్తుందని కార్‌మేకర్ పేర్కొన్నారు. లోపలి భాగంలో ఉన్న ఆరెంజ్ ఆక్సెంట్స్ ఇప్పుడు విజన్ ఇన్ కాన్సెప్ట్ యొక్క ఎక్స్‌టీరియర్ స్కెచ్‌లతో సరిపోలుతాయని చెప్పవచ్చు. 

ఇంజిన్ల విషయానికొస్తే, విజన్ ఇన్ - ఆధారిత SUV 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (115PS / 200Nm) పవర్ తో ఉంటుందని భావిస్తున్నారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆప్షన్ తో అందించబడే అవకాశం ఉంది. దీనిలో  there will be no diesel డీజిల్ లేదు, కార్డులలో CNG ఎంపిక ఉంటుంది.

Skoda Kamiq

ఫిబ్రవరిలో ఆటో ఎక్స్‌పోలో విజన్ ఇన్ కాన్సెప్ట్ ప్రారంభం కానుండగా, ప్రొడక్షన్ మోడల్ 2021 మొదటి అర్ధభాగంలో భారతదేశానికి రానుంది. స్కోడా యొక్క కాంపాక్ట్ SUV హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ క్యాప్టూర్, నిస్సాన్ కిక్స్, MG హెక్టర్ మరియు టాటా హారియర్ వంటి వాటితో పోటీ పడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience