• English
    • Login / Register

    వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను రూ.7.70 లక్షల వద్ద ప్రారంబించిన వోక్స్వ్యాగన్

    జూన్ 23, 2015 01:18 pm sourabh ద్వారా సవరించబడింది

    • 11 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: వోక్స్వ్యాగన్ ఇండియా, వెంటో యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను రూ.7.70 లక్షల ఎక్స్-షోరూమ్, ముంబై వద్ద ప్రవేశపెట్టారు. ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో నవీకరణలు ఎక్కువగా కాస్మెటిక్ రూపంలో చేయబడ్డాయి. 3డి ప్రభావం కలిగిన టైల్ ల్యాంప్స్ గా పిలిచే కొత్త ఎల్ ఈడి లుక్-అలైక్ చికిత్స రూపంలో సూక్ష్మ మార్పులు ఉన్నాయి. క్యాబిన్ లోపల, కారు లేత గోధుమరంగు యొక్క తేలికైన నీడ రూపంలో సూక్ష్మ మార్పులు లేకుండా అదే కనిపిస్తుంది; ఇది సంస్థ ప్రకారం 'వాల్నట్ డెసర్ట్ బీజ్' అని అంటారు. ఈ వాహనం కోసం, డీలర్స్ రూ .25,000 ఒక ముందస్తు చెల్లింపు తో ముందుగానే బుకింగ్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్, సి విభాగంలో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇవ్వడానికి ఇటీవల విడుదల అయ్యింది.

    ఈ  ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో కొత్త మరియు పునఃరూపకల్పన చేయబడిన బంపర్ తో వచ్చింది. ఈ సెడాన్ ఇప్పుడు, 2015 జెట్టా ఫేస్లిఫ్ట్ మరియు కొత్త పసత్ ఉండే దానిలా కొత్త త్రీ స్లాట్ క్రోమ్ గ్రిల్ ను కూడా కలిగి ఉంది. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ సెడాన్ లో న్యూ సెట్ అల్లాయ్ వీల్స్ అందించబడ్డాయి. ఈ వీల్స్ ను మనం కొత్త పోలో వాహనంలో చూడవచ్చు. ఈ వాహనాల డోర్ హ్యాండిల్స్ క్రోం చేరికలతో వచ్చింది దీనితో పాటు గా ఓఆర్ విఎం పై టర్న్ సూచికలను కూడా కలిగి ఉంది. ఈ కారు వెనుక భాగం లో 3డి ప్రభావం కలిగిన టైల్ ల్యాంప్స్ మరియు ఎల్ ఈడి లుక్ తో పాటుగా టైల్ ల్యాంప్ ధగ్గర క్రోం స్ట్రిప్ అందించబడింది. 

     

    ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, 3డి ప్రభావం కలిగిన టైల్ ల్యాంప్స్ గా పిలిచే కొత్త ఎల్ ఈడి లుక్ తో పాటు అలైక్ చికిత్స రూపంలో సూక్ష్మ మార్పులు ఉన్నాయి. ఒక క్రోమ్ స్ట్రిప్ కూడా టైల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రిఫ్రెష్ బంపర్ దిగువన అందించబడింది.

    క్యాబిన్ లోపల, కారు లేత గోధుమరంగు యొక్క తేలికైన నీడ రూపంలో సూక్ష్మ మార్పులు లేకుండా అదే కనిపిస్తుంది; ఇది సంస్థ ప్రకారం 'వాల్నట్ డెసర్ట్ బీజ్' గా పిలవబడుతుంది. ఈ సెలూన్ లో టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ లేకపోవడం మరియు చివరి నవీకరణ లో ఉండే అదే బ్లూటూత్ తో వచ్చింది.   

    ఇంజన్ విషయానికి వస్తే, చివరి నవీరణలో అందించబడిన అవే నిర్దేశాలు మరియు అదే పవర్ తో ఇటీవల విడుదల అయ్యింది. కానీ, ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, 7.5 శాతం పెరుగుదలతో వచ్చింది. ఈ వెంటో ఫేస్లిఫ్ట్ వెర్షన్ యొక్క డీజిల్ వేరియంట్లు 1.5 లీటర్ టిడి ఐ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా 4400 rpm వద్ద 103.5 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, అత్య్ధికంగా 1500 నుండి 2500 rpm వద్ద 250 Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మరియు 7-స్పీడ్ డిఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాక, ఈ వెర్షన్ యొక్క పెట్రోల్ వేరియంట్లు 1.2 లీటర్ టిఎస్ ఐ మరియు 1.6 లీటర్ ఎంపి ఐ ఇంజన్ తో అందుబాటులో ఉంది. 1.6 లీటర్ ఎంపి ఐ పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 103.5 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, అత్యధికంగా 153 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అదే 103.5bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. టార్క్ విషయం లో మాత్రం కొంచెం మార్పు తో వచ్చింది, ఇంతకి ఎంత అంటే, 175 Nm టార్క్ విడుదల అవుతుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. అయితే, 1.6 ఎంపి ఐ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.

    Complete Price List

    Fuel Variant Ex-Showroom
    Mumbai New Delhi
    Petrol 1.6 MPI TL Rs 7.70 Lac Rs 7.85 Lac
    CL Rs 8.51 Lac Rs 8.67 Lac
    HL Rs 9.24 Lac Rs 9.42 Lac
    Petrol 1.2 TSI DSG CL Rs 9.68 Lac Rs 9.87 Lac
    HL Rs 10.42 Lac Rs 10.62 Lac
    Diesel 1.5 TDI TL Rs 8.93 Lac Rs 9.10 Lac
    CL Rs 9.73 Lac Rs 9.92 Lac
    HL Rs 10.47 Lac Rs 10.67 Lac
    Diesel 1.5 TDI DSG CL Rs 10.91 Lac Rs 11.12 Lac
    HL Rs 11.64 Lac Rs 11.87 Lac
    was this article helpful ?

    Write your Comment on Volkswagen వెంటో 2015-2019

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience