లిమిటెడ్ ఎడిషన్ వెంటో మరియు పోలో ని ప్రారంభించిన వోక్స్వ్యాగన్
అక్టోబర్ 12, 2015 04:05 pm manish ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వోక్స్వ్యాగన్, ఈ పండుగ సీజన్లో ఎటువంటి ప్రారంభాలు చేయలేదు అందువలన, ఇది లిమిటెడ్ ఎడిషన్ పొలో ని మరియు వెంటో హైలైన్ ప్లస్ ఎల్ ఇ ని మార్కెట్లోనికి విడుదల చేసింది. పొలో ఎడిషన్ హైలైన్ MT 1.2-లీటర్ MPI మరియు 1.5-లీటర్ TDI ఇంజిన్లలో అందించబడి వరుసగా రూ. 5.5లక్షలు మరియు రూ. 8.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) ధరని కలిగి ఉన్నాయి. మరోవైపు, వెంటో హైలైన్ ప్లస్ ఎడిషన్ రూ. 9.7 లక్షలు(పెట్రోల్) మరియు రూ.10.98 లక్షలు(డీజిల్)(ఎక్స్-షోరూమ్, ముంబై) ధరల వద్ద 1.6-లీటర్ MPI పెట్రోల్ మరియు 1.5-లీటర్ TDI ఇంజిన్లని కలిగి ఉండి 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్స్ పై ఆధారపడి ఉన్నాయి.
పొలో లిమిటెడ్ ఎడిషన్ యొక్క సౌందర్య నవీకరణలు నల్లని రూఫ్ వ్రాప్, కార్బన్ ఫైబర్ తో చుట్టబడిన ఓఆర్విఎంఎస్, బ్లాక్ సైడ్ బాడీ మోల్డింగ్, ట్రంక్ గార్నిష్ మరియు స్కఫ్ ప్లేట్లు వంటి వాటితో కలిపి నవీకరణలను పొందింది. అంతర్గత భాగాలు కార్బన్ ఫైబర్ చేరికలతో సెంట్రల్ కన్సోల్, కొత్త సీటు కవర్లు మరియు ఫ్లోర్ మ్యాట్స్ ని కలిగి ఉన్నాయి. పరికరాలు పరంగా, పోలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఏబిఎస్ తో వస్తుంది. పండుగలు మనసులో ఉంచుకుని, వోక్స్వ్యాగన్ ఈ పరిమిత ఎడిషన్ ని రూ.10,000 విలువ గల ప్రత్యేక ప్రత్యేక ఎక్స్చేంజ్ ప్రయోజనాలతో మరియు రూ. 10,000 లాయల్టి బోనస్ తో ప్రారంభించింది.
వెంటో సెడాన్ నల్లని రూఫ్ ర్యాప్ మరియు ఓఆర్విఎంస్ కోసం కార్బన్ ఫైబర్ కవరింగ్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దీని ప్రక్క భాగాలు కూడా నల్లని మోల్డింగ్ మరియు అంతర్భాగాలలో సెంటర్ కన్సోల్ పై కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ మరియు బ్రాండ్ డోర్ సిల్స్ ని కలిగి ఉంటుంది. సామగ్రి పరంగా, వెంటో స్పెషల్ ఎడిషన్ జిపిఎస్ నావిగేషన్ తో బ్లాపంక్ట్ సమాచార వ్యవస్థ మరియు విండో షేడ్స్ ని కలిగి ఉంటుంది.