వోక్స్వ్యాగన్ ఇండియా రూ. 28.73 లక్షల ధర వద్ద 21 వ శతాబ్దం బీటిల్ ని ప్రారంభించింది
published on డిసెంబర్ 21, 2015 07:17 pm by saad కోసం వోక్స్వాగన్ బీటిల్
- 8 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వోక్స్వ్యాగన్ ఎంతగానో ఎదురుచూస్తున్న బీటిల్ ని దేశంలో రూ. 28.73 లక్షల ధర వద్ద (ఎక్స్-షోరూమ్, ముంబై) లో ప్రారంభించింది. 21 వ శతాబ్దం బీటిల్ కోసం బుకింగ్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నిలిపివేత తరువాత జర్మన్ కార్ల తయారీసంస్థ కొత్త స్టైలింగ్, నవీకరించబడిన అంతర్భాగాలు మరియు శక్తివంతమైన ఇంజిన్ తో బీటిల్ ని తిరిగి ప్రారంభిస్తున్నారు.
వోక్స్వ్యాగన్ బీటిల్ ఓరిక్స్ వైట్, Habanero ఆరెంజ్, బ్లూ సిల్క్ మరియు టొరానడో రెడ్ అను 4 రంగు ఎంపికలలో ప్రారంభించబడింది. కొత్త బీటిల్ 1.4 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉండి 150ps శక్తిని మరియు 250Nm టార్క్ ని అందిస్తుంది మరియు 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఈ కారు LED పగటిపూట నడుస్తున్న లైట్లు తో పాటు B-జినాన్ హెడ్లైట్లు వంటి లక్షణాలతో వస్తుంది మరియు స్టాటిక్ కార్నరింగ్ లైట్లను కలిగియున్న ఫాగ్ ల్యాంప్స్ తో వస్తుంది. అలానే దీని వెనుక భాగం LED టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. కారు యొక్క అంతర్భాగాలు సమకాలీన రూపకల్పన మరియు సాంకేతికతలతో అందించబడుతున్నాయి. కొత్త బీటిల్ కంపోజిషన్ మీడియా టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, 8 స్పీకర్లు, లెథర్ అప్హోల్స్టర్ సీటు, కంట్రోల్స్ తో అమర్చబడియున్న స్టీరింగ్ వీల్, మూడు పరిసర లైటింగ్ ఎంపికలు, రెయిన్ సెన్సార్లు, ఆటో హెడ్ల్యాంప్ ఆక్టివేషన్, పునరుత్పాదక బ్రేకింగ్ తో ఆటో స్టార్ట్/స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాలతో వస్తుంది.
భద్రత విభాగంలో, ఈ కారు ABS, ESC, హిల్ హోల్డ్ కంట్రోల్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఇమ్మొబలైజర్ తో పాటూ వేరియంట్ల అంతటా 6 ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా అందిస్తుంది. వోక్స్వ్యాగన్ బీటిల్ ఈ విభాగంలో మినీ కూపర్ ఎస్, BMW 1 సీరీస్ మరియు మెర్సెడెజ్-బెంజ్ A క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.
ఇంకా చదవండి
- భారతదేశం యొక్క మొదటి డీజిల్ ద్వంద్వ-క్లచ్ ఆటోమేటిక్ తో వోక్స్వాగన్ కాంపాక్ట్ సెడాన్
- వోక్స్వ్యాగన్ వారు బుగాటి, లాంబోర్ఘిని, డ్యుగాటి లేదా బెంట్లీ వదులుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి
- Renew Volkswagen Beetle Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful