ఫోక్స్వాగెన్ ఇండియా వారు డీలర్లని పోలో హ్యాచ్ బ్యాక్ ని డెలివరీ చేయవద్దు అని అడిగారు
వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 08, 2015 11:54 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫోక్స్వాగెన్ వారి ద్వారా ఒక వింతైన అడుగు చోటు చేసుకుంది. ఇప్పటి నుండి పోలో హ్యాచ్ బ్యాక్ లని కస్టమర్లకు డెలివరీ చేయవద్దు అని అడిగారు. పెట్రోల్ ఇంకా డీజిల్ వేరియంట్స్ రెండిటి డెలివరీలు నిలిపివేశారు కానీ ఎందుకు? అనే దాని పై ఎటివంటి వివరణ ఇవ్వలేదు.
తయారీదారి ఒక ఉత్తర్వు జారి చేశారు. అందులో," పోలో వాహనాలను (అన్ని వేరియంట్స్) యొక్క డెలివరీలను ఫోక్స్వాగెన్ వారి నుండి తిరిగి నోటీసు వచ్చే దాకా నిలిపివేయాలి అని కోరుతున్నాము," అని ఉంది. ఆఫ్టర్ సేల్స్ కి అధినేత అయిన ఆషీష్ గుప్తా మరియూ సేల్స్ ఆపరేషన్ కి అధినేత అయిన పంకజ్ షర్మా వారి సంతకాలు ఉన్నాయి. ఈ ఉత్తరం ఫోక్స్వాగెన్ డీలర్ లను ఉద్దేశించి ఉంది మరియూ ఎటువంటి కారణం తెలుపలేదు.
ప్రస్తుతం ఎమిషన్ కుంభకోణం వివాదం ఫోక్స్వాగెన్ ని చుట్టుకుంది మరియూ ఈ పరిస్తితుల్లో ఈ ఉత్తరం వలన, ఈ విషయమై ఇది కూడా జరుగుతుంది ఏమో అనే సందేహం ప్రజల్లో నెలకొంటుంది.
ఒక నివేదిక ప్రకారం, ఫోక్స్వాగెన్ వారు దీనిని దృవీకరించారు మరియూ దీని వెనుక కారణాన్ని తరువాత తెలుపుతాము అని అన్నారు. ఎమిషన్ పరీక్ష కుంభకోణానికీ దీనికి ఎటువంటి సంబంధం లేదు అని తెలిపారు. ఈ EA189 ఇంజినుకి ఇంకా దీనికి ఎలంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చారు.