ఆన్లైన్ లో లీకైన వోక్స్వ్యాగన్ బీటిల్ బ్రోచర్
వోక్స్వాగన్ బీటిల్ కోసం manish ద్వారా నవంబర్ 18, 2015 03:57 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
నిర్ధారణ ప్రయోజనాల కోసం కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్ యూనిట్ల ఇటీవలి దిగుమతులు తరువాత, కారు అతి త్వరలో భారతదేశంలో ప్రారంభం అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల, కారు యొక్క అధికారిక చిత్రాలను సంస్థ విడుదల చేశారు మరియు ఇప్పుడు కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్ యొక్క ఉత్పత్తి బ్రోచర్ ఆన్లైన్ లో అనధికారికంగా పెట్టబడింది. ఈ బ్రోచర్, కారు యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను మరియు నిర్దేశాల యొక్క అంతర్దృష్టి అందిస్తుంది. ఈ కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్ అసలైన పీపుల్స్ కారు నుండి క్లాసిక్ రెట్రో స్టైలింగ్ ని పోలి ఉంటుంది. ఇది అడాల్ఫ్ హిట్లర్ మరియు డాక్టర్ ఫెర్డినాండ్ పోర్స్చే చే రూపొందించబడిన,కారు మోడళ్ళ ద్వారా ప్రేరేపితమైనది.
కొత్త వోక్స్వ్యాగన్ బీటిల్ ఎల్ఇడి డీఅర్ఎల్స్ తో బై జినాన్ హెడ్ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, స్పాయిలర్, బంపర్స్ మరియు టెయిల్ లైట్ క్లస్టర్ వంటి వాటిలో నవీకరణలను పొందింది. ముందు అంతర్భాగాలలో 8 స్పీకర్లతో సమాచార వ్యవస్థ, ఆక్స్, బ్లూటూత్ మరియు యుఎస్‌బి కనెక్టివిటీ, పారానోమిక్ సన్‌రూఫ్, కొత్త స్టీరింగ్ వీల్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ, కీలెస్ ఎంట్రీ, స్ప్లిట్ ఫోల్డింగ్ రేర్ సీట్లు మరియు ఆటో డిమ్మింగ్ అంతర్గత లైట్స్ ని కలిగి ఉంది.
అలానే ఈ కారు ఇబిడి తో ఏబిఎస్, సైడ్ ఎయిర్బ్యాగ్స్, ఏఎస్ఆర్, ఇఎస్‌సి, ఇడిఎల్, ఇడిటిసి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్రేక్ ప్యాడ్ వేర్ ఇండికేటర్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా అంశాలను కలిగి ఉంటుంది.
భారతదేశంలో ఈ కారు 1.4-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ తో అమర్చబడి ఉంటుంది. ఇది 7-స్పీడ్ DSG గేర్బాక్స్ తో జతచేయబడి 147ps శక్తిని అందిస్తుంది. ఈ కారు మినీ కూపర్ ఎస్ వంటి వాటికి పోటీగా ఉంటుంది మరియు రూ.30 లక్షల ధరకి అందుబాటులో ఉండవచ్చు.
ఇంకా చదవండి
0 out of 0 found this helpful