రెండవ వాలియో ఇన్నోవేషన్ చాలెంజ్ యొక్క విజేతలని వాలియో వారు ప్రకటించారు
అక్టోబర్ 16, 2015 06:21 pm nabeel ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫ్రాన్స్ ఆధారిత వాలియో అనే ఒక మల్టీ న్యాషనల్ ఆటోమోటివ్ సరఫరీ చేయు కంపెనీ వారు ఇంటర్‌న్యాషనల్ కాంటెస్ట్ యొక్క ఫలితాలుప్రకటించారు. ఈ కాంటెస్ట్ లో వాలియో వారు విద్యార్ధులను ఆహ్వానిస్తున్నారు. 2030 ఏడాదికి మరింత తెలివైన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఈ ఆహ్వానం ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్నారు. రెండవ ఎడిషన్ లో 40% పాల్గొన్న వారు 1,324 టీంస్ గా 89 దేశాల నుండివచ్చారు. ప్రత్యేకంగా డ్రైవింగ్ అస్సిస్టెన్స్ సిస్టంస్, అటానమస్ డ్రైవింగ్ మరియూ రక్షణ విభాగంలో ఎక్కువ శాతం ప్రాజెక్టులను వాలియో నిపుణులు చూడటం జరిగింది.
అక్టోబర్ 14, వాలియో చీఫ్ ఎగ్జెక్యూటివ్ ఆఫీసర్, జాక్వస్ అస్‌చెన్‌బ్రాయిక్ ఇంకా ఇతర పేరున్న వాలియో గ్రూప్ సభ్యుల ద్వారా మూడు టీంలని విజేతగా ఎంపిక చేశారు.
మొదటి బహుమతి
పెకింగ్ యూనివర్సిటీ నుండి "ఫాల్కన్ వ్యూ" అనే చైనీస్ టీం
మోడల్: వారు అటానమస్ కార్లకై ఒక కొత్త పద్దతి పరిసరాలను గుర్తించే విధంగా తయారు చేశారు. లేజర్లు వాడే బదులు, ఒక క్యామెరా ఉపయోగించి మరింత చవక వీల్-ఆధారిత సిస్టముని నిర్మించారు.
రెండవ స్థానం కోసం రెండు టీములు టై అయ్యాయి:
ఇండియన్ టీం"ఎం.ఏ.డీ", శ్రీ ఆరోబిందో ఇంటర్‌న్యాషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ పాండిచెర్రీ,
మోడల్: వారు ఒక కనెక్టెడ్ సిస్టము పటిష్టమైన రక్షణ అందిస్తున్నారు. ఒక శాటిలైట్ నావిగేషన్ గుండా వాస్తవిక సమయంలో పొంచే ఆపదల గురించి హెచ్చరిక అందుతుంది.
జర్మన్ టీం "ఆటో జెన్ జీ", సార్‌ల్యాండ్ యూనివర్సిటీ నుండి
మోడల్: వారు ఒక కనెక్టెడ్ సిస్టం మరియూ పటిష్ట ట్రాఫిక్ రక్షణ అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యామ్నాయ పద్దతిలో మూడు అద్దాలను ఒకే విండ్‌స్క్రీన్ డిస్ప్లే లో అమర్చారు.
గెలిచిన టీం కి €100,000 ల క్యాష్ ప్రైజ్ ని మరియూ €10,000 ల క్యాష్ ప్రైజ్ ని రెండవ స్థానం లో వచ్చిన వారికి అందించనున్నారు.