• English
  • Login / Register

నవీకరించబడిన ఈకోస్పొర్ట్ ను రహస్యంగా పరీక్షించిన ఫోర్డ్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 కోసం raunak ద్వారా జూలై 06, 2015 04:17 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోర్డ్ ఇండియా, యూరోపియన్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న 2016 ఈకోస్పోర్ట్ ను ఇటీవల పరీక్షించింది. ఈ నవీకరించబడిన ఈకోస్పోర్ట్ ను 2015 జెనీవా మోటార్ షోలో ఈ సంవత్సరం మొదటిలో ప్రదర్శించారు. ఈ కాంపాక్ట్ ఎస్యువి లో అనేక కాస్మటిక్ మార్పులు జరిగాయి. అవి ఏమిటంటే, అధనపు చక్రం లేకుండా కొత్త టైల్ గేట్ ను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా, విలువైన 1.5 లీటర్ టిడిసి ఐ ఇంజిన్ తో రాబోతుంది. దీనితో పాటు, యాంత్రిక నవీకరణలు మరియు మెరుగైన ఎన్ విహెచ్ స్థాయిలు (శబ్దం, కంపనం మరియు హార్ష్నెస్). ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనాన్ని చెన్నై ప్లాంట్ నుండి యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడం కొరకు ఈ కొత్త ఈకోస్పోర్ట్ ను ఇక్కడ పరీక్షిస్తోంది.

ఆప్షనల్ గా ఉండే ఈ విడి చక్రాన్ని మినహాయించి, ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ టిడి ఐ డీజిల్ ఇంజన్ కు పవర్ బంప్ అందించబడుతుంది. ఈ ఇంజన్ ప్రస్తుతం అత్యధికంగా 95 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, దీనితో పోలిస్తే, ఇంతకు ముందుది 90 PS పవర్ మాత్రమే అందించేది. ప్రస్తుతం ఉన్నది పాత దానికంటే, 5 PS ఎక్కువ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. యాంత్రికంగా, సవరించిన స్ప్రింగ్స్, డంపర్లను, నవీకరించబడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో పాటు రేర్ టోరిసన్ బీమ్ మరియు ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ వంటి సెట్టింగ్లతో రాబోతుంది. ఈ నవీకరించబడిన ఈకోస్పోర్ట్, డ్రైవింగ్ డైనమిక్స్ తో పాటు 'పురోభివృద్దిని' కలిగి ఉంటుందని ఫోర్డ్ సంస్థ వాగ్ధానాలు చేస్తుంది.  

నవీకరించబడిన క్యాబిన్ గురించి మాట్లాడటానికి వస్తే, 2016 ఈకోస్పోర్ట్ వాహనం లో, కొత్త స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ అసెంట్స్ మరియు (వెండికి బదులుగా) క్రోం తో పొందుపరిచారు. ఇప్పుడు నవీకరించబడిన సింక్ ప్రదర్శన తో పాటు 4-అంగుళాల ఒక పెద్ద కలర్ డిస్ప్లే తో వస్తుంది. అంతేకాక, ఈ ఎన్ విహెచ్ స్థాయిలను, కొత్త మరియు మందమైన ధ్వని మొద్దుబారిన వస్తువులతో మరింతగా తగ్గించవచ్చు. 

ఇండియా లాంచ్ విషయానికి వస్తే, ఈ ఈకోస్పోర్ట్ ను భారతదేశంలో 2013 లో ప్రవేశపెట్టినప్పటికీ, ఇది త్వరలోనే దీని నవీకరించబడిన వెర్షన్ ను ప్రవేశపెట్టబోతుంది. ఈ కొత్త గా రాబోయే ఈకోస్పోర్ట్, అనేక నవీకరణలతో పాటు ఆప్షనల్ టైల్ గేట్ తో రాబోతుంది. ఎందువలన అంటే భారతీయ కొనుగోదారులకు ఈ మోడల్ ను ఆరాధిస్తారు కాబట్టి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford ఎకోస్పోర్ట్ 2015-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience