• English
  • Login / Register

రాబోయే మారుతి సుజుకి YBA భారతదేశంలో కనిపించింది

మారుతి వైఆరే కోసం raunak ద్వారా నవంబర్ 24, 2015 07:29 pm ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫోర్డ్ ఈకొస్పోర్ట్ మరియు మహీంద్రా TUV 300 వాహనాలకు పోటీగా అతి త్వరలో భారతదేశానికి తమ వాహనంతో రానున్న మారుతి సుజికి

మారుతి యొక్క రాబోయే సబ్-4m ఎస్యువి ఇటీవలే అనధికారికంగా కనిపించింది. ఇది దాదాపు గత ఒక సంవత్సరంగా పరీక్షలో ఉన్న వాహనం. ఈ వాహనం 2016 ఇండియన్ ఆటో ఎక్స్పో ఫిబ్రవరిలో భారత ప్రజల ముందుకు రానున్నది. ఈ వాహనం YBA(కోడ్ నేం) తో ప్రవేశపెట్టబడుతుంది. అయితే, దీనిని అధికారిక నామం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి సమాచారం ప్రకారం ఈ వాహనం ప్రపంచ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడిన భారతీయ వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహన తయారీదారులు ఇటీవలి కాలంలో ఎన్నో క్రాసోవర్ వాహనాలను ఈ వైబిఎ కాకుండా మార్కెట్లో ప్రవేశపెడుతుంది. ఉదాహరణకు ఇటీవలే విడుదలైన స్-క్రాస్ మరియు కొత్త ఇగ్నీస్ ఈ ఎక్స్పో ప్రదర్శనలో పాలు పంచుకొనే అవకాశం ఉంది.

YBA గురించి మాట్లాడుకుంటే, వాహన తయారీసంస్థ 2012 ఆటో ఎక్స్పోలో వెల్లడించిన XA-ఆల్ఫా కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ లా కనిపిస్తుంది. యాంత్రికంగా, ఈ వాహనం యొక్క ఇంజిన్ ఎంపికలు ప్రస్తుత లైనప్ 1.2 లీటర్ VVT పెట్రోల్ తో పాటు SHVS తో 1.3 లీటర్ DDiS200 డీజల్ నుండి తీసుకోబడినవి. ట్రాన్స్మిషన్ ఎంపికలు ప్రామాణిక 5-స్పీడ్ MT, బాలెనో నుండి CVT కూడా YBA లోకి రావచ్చు.

లక్షణాలు పరంగా, ఈ వాహనం సుజికి యొక్క 7-అంగుళాల స్మార్ట్‌ప్లే సమాచార వినోద వ్యవస్థ బహుశా ఆపిల్ కార్‌ప్లే తో ఉండవచ్చు. ఇది సంస్థ యొక్క ఇతర ఇటీవలి ఉత్పత్తుల వలే ప్రీమియం Nexa డీలర్షిప్ల నుండి అమ్మకాలు చేయబడుతుందని ఆశిస్తున్నారు. అంతేకాక, YBA కూడా బాలెనో మరియు ఎస్-క్రాస్ వలే ABS మరియు EBD తో ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉంటుంది.  

ఇంకా చదవండి : మారుతి బాలెనో ప్రీమియం హాచ్బాక్స్ శ్రేణి కార్లలో తమ ఆధిక్యతను పెంచుకుంటోంది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti వైఆరే

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience