ఈ నవంబర్ లో రెనాల్ట్ క్విడ్‌లో రూ .50 వేల వరకు తగ్గింపు! డస్టర్ & క్యాప్టూర్ కూడా భారీ తగ్గింపు
రెనాల్ట్ క్యాప్చర్ కోసం rohit ద్వారా నవంబర్ 27, 2019 03:22 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్తగా ప్రారంభించిన ట్రైబర్ మినహా, రెనాల్ట్ తన అన్ని మోడళ్లపై బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ ని అందిస్తోంది
- డస్టర్ యొక్క ప్రీ-ఫేస్ లిఫ్ట్ మరియు ఫేస్ లిఫ్ట్ మోడల్స్ రూ .1.25 లక్షల వరకు బెనిఫిట్స్ ని పొందుతాయి.
- ప్రీ-ఫేస్‌లిఫ్ట్ క్విడ్ ను రూ .50,000 విలువైన బెనిఫిట్స్ తో అందిస్తున్నారు.
- రెనాల్ట్ క్యాప్టూర్ కు గరిష్టంగా రూ .3 లక్షల వరకు లాభం లభిస్తుంది.
- లాడ్జీ యొక్క అన్ని వేరియంట్లలో రెనాల్ట్ బెనిఫిట్స్ ని అందిస్తోంది.
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ నవంబర్ నెలలో కూడా తన వినియోగదారులకు బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ ని అందించడాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. కాబట్టి మీరు రెనాల్ట్ మోడల్ ను కొనాలని యోచిస్తున్నట్లయితే, మోడల్ వారీగా డిస్కౌంట్స్ ల జాబితాను ఇక్కడ చూడండి:
రెనాల్ట్ డస్టర్:
మీరు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను ఎంచుకున్నారా లేదా ఫేస్‌లిఫ్ట్ ను ఎంచుకున్నారా అనే దానిబట్టి డస్టర్ ఆఫర్‌లు రెండు రకాలుగా విభజించబడ్డాయి. ఒకవేళ మీరు డస్టర్ యొక్క ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ఎంచుకుంటే, మీరు మొత్తం బెనిఫిట్స్ ని రూ .1.25 లక్షల వరకు పొందవచ్చు. డస్టర్ యొక్క డీజిల్ RxS AMT వేరియంట్ ను రూ .9.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద రెనాల్ట్ అందిస్తోంది. ఇంకా, ఫ్రెంచ్ కార్ల తయారీదారు ఎంచుకున్న కార్పొరేట్ ఉద్యోగుల కోసం రూ .5 వేల కార్పొరేట్ బోనస్ ని అందిస్తుంది.
మీరు ఫేస్‌లిఫ్టెడ్ డస్టర్ ను కొనుగోలు చేస్తే, మీరు రూ .50 వేల వరకు మొత్తం బెనిఫిట్స్ ని పొందవచ్చు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న రెనాల్ట్ కస్టమర్లకు రూ .10,000 క్యాష్ డిస్కౌంట్ లేదా రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో లాయల్టీ బోనస్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్లతో పాటు, ప్రస్తుత రెనాల్ట్ కస్టమర్లు మరియు రెనాల్ట్ ఫైనాన్స్ కస్టమర్లు కూడా 8.99 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.
రెనాల్ట్ క్విడ్:
డస్టర్ మాదిరిగానే, రెనాల్ట్ ప్రీ-ఫేస్ లిఫ్ట్ మరియు ఫేస్ లిఫ్ట్ క్విడ్ లపై ప్రత్యేక బెనిఫిట్స్ ని మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రీ-ఫేస్ లిఫ్ట్ క్విడ్ ఇప్పుడు రూ .50,000 వరకు మొత్తం బెనిఫిట్స్ ని పొందుతుంది.
ఫేస్‌లిఫ్టెడ్ క్విడ్, అయితే కొంత ఆఫర్‌లతో వస్తుంది. ప్రస్తుత రెనాల్ట్ కస్టమర్లు అదనపు రెనాల్ట్ మోడల్ ను కొనుగోలు చేస్తే రూ .10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ .5000 క్యాష్ డిస్కౌంట్ రూపంలో లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. ఇది 4 సంవత్సరాల వారంటీ ప్యాకేజీని కూడా పొందుతుంది, దీనిలో 2 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల తయారీదారుల వారంటీతో పాటు 2 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీ ఉంటుంది. ఆ పైన, రెనాల్ట్ క్విడ్ లో రూ .2,000 కార్పొరేట్ బోనస్ ను కూడా అందిస్తోంది.
రెనాల్ట్ లాడ్జీ:
లాడ్జీని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆఫర్లు చాలా సులభంగా ఉన్నాయి. MPV యొక్క ఏదైనా వేరియంట్ ను కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ .2 లక్షల లాభం లభిస్తుంది.
రెనాల్ట్ కాప్టూర్:
కెప్టూర్ పై రెనాల్ట్ 3 లక్షల రూపాయల క్యాష్ డిస్కౌంట్ ని అందిస్తోంది. లాడ్జీ మాదిరిగానే, కార్పొరేట్ బోనస్ 5,000 రూపాయలు కూడా ఎంపిక చేసిన ఉద్యోగుల కోసం అందిస్తోంది.
ఈ ఆఫర్లు 30 నవంబర్ 2019 వరకు వర్తిస్తాయని రెనాల్ట్ పేర్కొన్నప్పటికీ, అవి రాష్ట్రాలు మరియు వేరియంట్లలో మారవచ్చు. అందువల్ల, మరిన్ని వివరాల కోసం సమీప రెనాల్ట్ డీలర్‌షిప్‌ను సంప్రదించమని మేము సూచిస్తున్నాము.
మరింత చదవండి: కాప్టూర్ డీజిల్
0 out of 0 found this helpful