రెనాల్ట్ డస్టర్ డీజిల్ దాని తక్కువ ధరకి తగ్గించబడగా, ఈ జనవరిలో లాడ్జి & క్యాప్టూర్ పై రూ .2 లక్షల ఆఫ్ ఉంది!
రెనాల్ట్ డస్టర్ కోసం rohit ద్వారా జనవరి 18, 2020 04:53 pm ప్రచురించబడింది
- 74 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ట్రైబర్ ఈసారి కూడా ఆఫర్ జాబితా నుండి ప్రక్కకి తప్పుకుంది
- కొనుగోలుదారులు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ క్విడ్ లో వేర్వేరు ఆఫర్లను పొందవచ్చు.
- నిలిపివేసిన లాడ్జీ యొక్క అన్ని వేరియంట్ల పై రెనాల్ట్ గరిష్టంగా రూ .2 లక్షల వరకూ డిస్కౌంట్ ని అందిస్తోంది.
- ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ వేరియంట్ల ఆధారంగా డస్టర్ లోని ఆఫర్‌లు విభజించబడ్డాయి.
- అన్ని ఆఫర్లు జనవరి 31, 2020 వరకు చెల్లుతాయి.
రెనాల్ట్ ఇండియా కొత్త సంవత్సరంలో కూడా డిస్కౌంట్ మరియు బెనిఫిట్స్ ని అందించే ట్రెండ్ ని కొనసాగిస్తోంది. ఫ్రెంచ్ కార్ల తయారీసంస్థ ఇప్పుడు తన లైనప్ లో చాలా మోడళ్లకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో మీరు ఈ రెనాల్ట్ మోడళ్లలో ఎంత వరకూ ఆదా చేయవచ్చో ఇక్కడ ఉంది:
రెనాల్ట్ క్విడ్
ఆఫర్స్ |
ప్రీ-ఫేస్ లిఫ్ట్ క్విడ్ |
క్విడ్ ఫేస్ లిఫ్ట్ |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 45,000 |
రూ. 15,000 |
4 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ |
అవును |
అవును |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 4,000 |
రూ. 4,000 |
లాయల్టీ బోనస్ |
రూ. 10,000 వరకూ |
రూ.10,000 వరకూ |
0 శాతం వడ్డీ రేటు |
అవును |
అవును |
- 4 సంవత్సరాల వారంటీ ప్యాకేజీ లో 2 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు మ్యానుఫ్యాక్చురర్ వారంటీ, అలాగే 2 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీ ఉంటుంది.
- కస్టమర్ అదనపు రెనాల్ట్ మోడల్ ను కొనుగోలు చేసుకుంటే రూ .10,000 వరకు లాయల్టీ బోనస్ రూ .10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ .5 వేల క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఉంటుంది.
- రెనాల్ట్ సంస్థ రెనాల్ట్ ఫైనాన్స్ ద్వారా మాత్రమే 18 నెలలకు రూ .2.2 లక్షల రుణంపై 0 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రెనాల్ట్ ఫైనాన్స్ అందుబాటులో లేని రాష్ట్రాల్లో ఇది రూ .5 వేల వరకూ క్యాష్ డిస్కౌంట్ ని అందిస్తోంది.
- ఈ ఆఫర్‌లన్నీ క్విడ్ యొక్క BS 4-కంప్లైంట్ వేరియంట్ లలో మాత్రమే ఉన్నాయని గమనించండి.
అన్ని తాజా ఆఫర్‌లను చెక్ చేయడానికి, ఇక్కడ చూడండి.
రెనాల్ట్ డస్టర్
రెనాల్ట్ సంస్థ ఫేస్‌లిఫ్టెడ్ డస్టర్ యొక్క డీజిల్ వేరియంట్ల ధరలను తగ్గించింది. ప్రఖ్యాత K9K డీజిల్ ఇంజిన్ ఏప్రిల్ 2020 నాటికి BS6 యుగంలో నిలిపివేయబడుతుంది అందువలన ఇది ఖచ్చితంగా ఒకదాన్ని కొనడానికి మీకు చివరి అవకాశం అని చెప్పవచ్చు. AWD మోడల్ వంటి కొన్నిటి ధరలు రూ .10.99 లక్షల వద్ద తక్కువగా ఉన్నాయి, ఇది 2014 లాంచ్ ధర 11.89 లక్షలు కంటే తక్కువ. సవరించిన ధరలను పరిశీలిద్దాం:
వేరియంట్స్ (ఫేస్‌లిఫ్టెడ్) |
కొత్త ధర |
పాత ధర |
వ్యత్యాశం |
డీజిల్ RxS 85PS |
రూ. 9.29 లక్షలు |
రూ. 9.99 లక్షలు |
రూ. 70,000 |
డీజిల్ RxS 110PS |
రూ. 9.99 లక్షలు |
రూ. 11.19 లక్షలు |
రూ. 1.2 లక్షలు |
డీజిల్ RxS 110PS AWD |
రూ. 10.99 లక్షలు |
రూ. 12.49 లక్షలు |
రూ. 1.5 లక్షలు |
ఆఫర్స్ |
ప్రీ-ఫేస్ లిఫ్ట్ డస్టర్ |
డస్టర్ ఫేస్ లిఫ్ట్ |
క్యాష్ డిస్కౌంట్ |
- |
పైన పేర్కొన్నవి మినహా మిగతా అన్ని డీజిల్ వేరియంట్లపై రూ .50,000 |
ఇతర బెనిఫిట్స్ |
రూ. 1.25 లక్షల వరకూ |
- |
కార్పొరేట్ బోనస్ |
రూ. 10,000 |
రూ. 10,000 |
లాయల్టీ బోనస్ |
రూ. 20,000 |
రూ. 20,000 |
- రెనాల్ట్ రూ .20,000 వరకు లాయల్టీ బోనస్‌ను అందిస్తోంది. అదనపు రెనాల్ట్ కారును కొనుగోలు చేస్తే ఇది రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ .10,000 క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఉంటుంది.
- డస్టర్ యొక్క ఏ పెట్రోల్ వేరియంట్లోనూ ఆఫర్లు లేవు.
- ఈ ఆఫర్‌లన్నీ డస్టర్ యొక్క BS4- కంప్లైంట్ వేరియంట్లలో మాత్రమే వర్తిస్తాయి.
రెనాల్ట్ లాడ్జీ
లాడ్జీ విషయంలో, రెనాల్ట్ విషయాలు చాలా సరళంగా ఉంచాయి. BS 6 యుగంలో MPV ని అమ్మబోమని ఇప్పటికే ప్రకటించినందున రెనాల్ట్ అన్ని వేరియంట్ల పై రూ .2 లక్షల క్యాష్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఎంచుకోబడ్డ కార్పొరేట్ ఉద్యోగులు 10,000 రూపాయల వరకు కార్పొరేట్ ఆఫర్ ను కూడా పొందవచ్చు.
రెనాల్ట్ కాప్టూర్
కాప్టూర్ కొనాలని చూస్తున్న వారికి రెనాల్ట్ గరిష్టంగా రూ .2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న రెనాల్ట్ కస్టమర్లు తమ పాత మోడల్ లో ఒక దానిని కొత్తదాని కోసం ఎక్స్‌చేంజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అదనంగా రెనాల్ట్ కారు కొనాలని చూస్తున్న వారు రూ .10,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. రెనాల్ట్ సంస్థ డస్టర్ లో అందించే అదే కార్పొరేట్ డిస్కౌంట్ ను అందిస్తోంది.
ఈ ఆఫర్లు కూడా క్యాప్టూర్ యొక్క BS4- కంప్లైంట్ వేరియంట్లలో మాత్రమే వర్తిస్తాయని గమనించండి.
మరింత చదవండి: రెనాల్ట్ డస్టర్ AMT