ట్రైల్ బ్లాజర్ ను 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్న చెవ్రోలెట్

చేవ్రొలెట్ ట్రైల్ కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 05, 2016 11:23 am ప్రచురించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెవ్రోలెట్, ఇండియన్ ఫ్లాగ్ షిప్ ఉత్పత్తి అయిన ట్రైల్ బ్లాజర్ ను జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించనుంది. గత సంవత్సరం అక్టోబర్ లో ఈ ఎస్యువి ను, రూ 26.4 లక్షల వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. ట్రెయిల్ బ్లాజర్ అనునది ప్రీమియం ఎస్యువి మార్కెట్ లో కాప్టివా తరువాత చెవ్రోలెట్ యొక్క రెండవ వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనం, దేశంలో సిబియూ మార్గం ద్వారా అమ్ముడుపోతుంది. భారతదేశంలో, ఈ వాహనం ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే అందుబాటులో ఉంది. బాదాకరమైన విషయం ఏమిటంటే, ఈ వేరియంట్ కూడా 2డబ్ల్యూడి తో రావడం. అంతేకాకుండా ఈ వాహనం, ముందు రెండు ఎయిర్బాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ అలాగే ఈబిడి వంటి అంశాలు అందుబాటులో ఉన్నాయి. 

యాంత్రికంగా చెప్పాలంటే ఈ వాహనం, డ్యురామేక్స్ 2.8 లీటర్ 4 సిలండర్ల ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, 3600 ఆర్ పి ఎం వద్ద 197 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 500 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజన్, 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క బాహ్య కొలతలను గనుక గమనించినట్లైతే, ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4878 మిల్లీ మీటర్లు, వెడల్పు 1902 మిల్లీ మీటర్లు మరియు ఎత్తు 1847 మిల్లీ మీటర్లు. మరోవైపు ఈ వాహనం యొక్క బరువు 2068 కిలోలు అలాగే 231 మిల్లీ మీటర్ల బారీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది.

ఈ ఎస్యువి యొక్క డిజైన్, కటినమైన చెవ్రోలెట్ అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క బాహ్య భాగ అంశాల విషయానికి వస్తే, చెవీ డ్యూయల్ పోర్ట్ గ్రిల్, స్వెప్ట్ బేక్ ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్లు మరియు ఫాగ్ ల్యాంప్లు అలాగే లోపలి భాగం మొత్తం క్రోం తో అలంకరించబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్ క్లస్టర్ మరియు కొన్ని క్రోం చేరికలు వంటి అంశాలు అందించబడతాయి. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, బారీ విండోలు, ర్యాప్ రౌండ్ వెనుక విండ్ స్క్రీన్ మరియు మంచి ఆకృతి కలిగిన వీల్ ఆర్చులు వంటి అంశాలు అందించబడతాయి. 

ఈ ట్రైల్ బ్లాజర్ లోపలి భాగం విషయానికి వస్తే, చెవ్రోలెట్ యొక్క మై లింక్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో రాబోతుంది. ఈ సమాచార వ్యవస్థ, ఇన్ బిల్ట్ సాటిలైట్ నావిగేషన్, కనెక్టివిటీ ఆప్షన్లు, సెన్సార్లతో కూడిన వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలు అందించబడతాయి. ఈ ట్రైల్ బ్లాజర్ వాహనం, ఇదే విభాగం లో ఉండే టయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పజీరో స్పోర్ట్, హ్యుందాయ్ సాంట ఫీ, ఇసుజు ఎం యూ7, హోండా సి ఆర్ వి మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. మీరు గనుక 4X4 ఎస్యువి కోసం చూస్తున్నట్లైతే, ట్రైల్ బ్లాజర్ కొంచెం కొనుగోలుదారులను నిరాశ పరుస్తుంది ఎందుకంటే, ఈ వాహనం 4X2 సెట్ అప్ తో మాత్రమే వస్తుంది. ఈ ఎండీవర్, ఫార్చ్యూనర్ మరియు పజీరో వంటి అన్ని వాహనాలు 4X4 సెట్ అప్ తో వస్తున్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన చేవ్రొలెట్ ట్రైల్

Read Full News

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience