Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టొయోటా -బ్యాడ్ తో ఉన్న మారుతి విటారా బ్రెజ్జా 2022 లో ప్రారంభించబడనున్నది

ఏప్రిల్ 17, 2019 04:17 pm raunak ద్వారా ప్రచురించబడింది
  • బ్యాడ్జ్ ఇంజినీరింగ్ అన్న ఎక్సరసైజ్ ఏదైతో ఉందో, అది టొయోటా మరియు సుజుకి యొక్క వ్యూహాత్మకమైన కలయికలో భాగంగా ఉంది.
  • టొయోటా SUV ఏదైతే 2022 లో ప్రవేశపెట్టబడుతుందో అది రెండో తరం మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పై ఆధారపడి ఉంటుంది.
  • విటారా బ్రజ్జా యొక్క టొయోటా వెర్షన్ బెంగళూరులో దాని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయబడుతుంది.
  • రెండు SUV లు కూడా ఒకేలాంటి ఇంజన్లను పంచుకుంటాయి.

టొయోటా మరియు సుజుకి తమ కొత్త కూటమి గురించి కొత్త వివరాలను వెల్లడించాయి, వీటిలో ఇద్దరు తయారీదారులు భారతదేశంలో మరియు ఇతర గ్లోబల్ మార్కెట్లలో తమ కార్ల యొక్క సరికొత్త బాడ్జెడ్ వెర్షన్ లను ప్రారంభించాలని ప్రణాళిక వేశారు. ఈ టైఅప్ అనేది 6 ఫిబ్రవరి 2017 లో సంతఖం చేసిన (MoU) పై ఆధారపడి ఉంది. టొయోటా 2022 నుంచి బెంగళూరులో తన కర్మాగారంలో విటారా బ్రజ్జాను తయారు చేయనున్నట్లు తాజా వెల్లడింపులు సూచిస్తున్నాయి. ప్రముఖ సబ్ -4m SUV యొక్క సరికొత్త బ్యాడ్జెడ్ వెర్షన్ త్వరలోనే భారతదేశంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

చిత్రపటం: ప్రస్తుత మొదటి తరం సుజుకి విటారా బ్రజ్జా

అయితే, విటారా బ్రజ్జా ఏదైతే 2022 నుండి టొయోటా తన ప్లాంటు నుంచి తయారు చేయబోతుందో అది SUV యొక్క ప్రస్తుత వెర్షన్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది రెండు నుంచి మూడు సంవత్సరాలు తరువాత పాతబడిపోయినట్టు ఉంటుంది. అలాగే, కారు తయారీదారులచే వెల్లడి చేయబడిన వివరాల ప్రకారం టొయోటా కొరకు సుజుకి విటారా బ్రజ్జాను ఇంకా అభివృద్ధి చేస్తుంది. సుజుకి త్వరలోనే SUV యొక్క తరువాతి తరం వెర్షన్ మీద పనిచేయగలదని సూచించింది. విటారా బ్రజ్జా ప్రస్తుత వెర్షన్ మార్చి 2016 లో ప్రారంభమైంది మరియు 2022 నాటికి ఆరు సంవత్సరాలకు పైగా ఉంటుంది, పాతబడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మారుతి సుజుకి కార్ల యొక్క లైఫ్ 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి.

చిత్రపటం: ప్రస్తుత మొదటి తరం సుజుకి విటారా బ్రజ్జా

SUV యొక్క స్టైలింగ్ గురించి చెప్పాలంటే చాలా ముందుగానే చెప్తున్నట్టు అవుతుంది , రెండు నమూనాలు ప్రత్యేకమైన ఫ్రంట్ మరియు వెనుక ప్రొఫైల్స్ ని కలిగి ఉన్నాయి లేదా పూర్తిగా వేర్వేరు విధంగా ఉన్నాయని అనవచ్చు. మారుతి సుజుకి విటారా బ్రజ్జా యొక్క తరువాత తరం గురించి మాట్లాడుకుంటే స్వదేశీ కార్ల తయారీదారుడు తటస్థ స్టైలింగ్ లో బాక్సింగ్ సిల్హౌట్ తో కొనసాగిస్తారని భావించవచ్చు.

సుజుకి తయారు చేస్తున్న కొత్త బ్రెజ్జా ఏదైతే ఉందో దాని ఇంజన్లు మారుతి మరియు టొయోటా యొక్క సబ్-4m తో పంచుకుంటుంది. ద్వితీయ శ్రేణి మారుతి SUV ని 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించనుందని ఊహిస్తున్నాము, దానితో పాటు కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ను అభివృద్ధి చేసింది. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రస్తుతం బలేనో RS తో లభిస్తుంది, అయితే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఈ సంవత్సరం సియాజ్ మరియు ఎర్టిగాలో ప్రారంభమవుతుంది. యారిస్ లో చేసిన విధంగా, టొయోటా ఈ రీ బ్యాడ్జెడ్ విటారా బ్రజ్జాతో డీజిల్ ఇంజిన్ ను అందించకపోవచ్చు.

బ్రజ్జా-ఆధారిత SUV ఆఫర్ చేయడం వలన టొయోటా దేశంలోని రద్దీగా ఉన్న సబ్-4m SUV విభాగంలో ప్రవేశించబోతుంది. ఈ విభాగంలో తొలి తరం విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా XUV 300 వంటి కార్లు ఉన్నాయి. హ్యుందాయ్ త్వరలో QXi అనే పేరుతో సబ్-4m SUV తో ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధం చేసుకుంటుంది.

మారుతి సుజుకి తన యొక్క రెండవ తరం విటారా బ్రెజ్జా ని టొయోటా సబ్-కాంపాక్ట్ వెర్షన్ యొక్క సొంత వెర్షన్ విడుదల చేయకముందే అందిస్తుందని ఊహిస్తున్నాము. ఈ సబ్-4m టొయోటా SUV మరియు ద్వితీయ తరం మారుతి విటారా బ్రెజ్జా వెలుగు ని చూసేలోపే మనకి ఫోర్డ్ సంస్థ ఎకోస్పోర్ట్ యొక్క కొత్త తరం వెర్షన్ మరియు మహింద్రా మరియు టాటా సంస్థలు తమ యొక్క XUV300 మరియు నెక్సాన్ లను అందిస్తాయని భావిస్తున్నాము. మేము కియా కూడా దాని యొక్క సొంత వెర్షన్ అయిన హుండాయ్ QXi అందిస్తుందని కూడా మేము భావిస్తున్నాము.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 17 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర