తదుపరి తరం ఇన్నోవా క్రిస్టా ను ఆటో ఎక్స్పో 2016 వద్ద ప్రదర్శించనున్న టయోట

టయోటా ఇనోవా కోసం saad ద్వారా ఫిబ్రవరి 04, 2016 06:58 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా, ఇన్నోవా క్రిస్టా అను పేరు గల తదుపరి తరం ఇన్నోవా ను రానున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది. భారతదేశంలో బహిర్గతం కాక ముందు, టయోటా ఈ తదుపరి తరం ఇన్నోవాను ఇండోనేషియా లో గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ప్రస్తుత తరం ఇన్నోవా, పది సంవత్సరాల క్రితం నుండే భారత మార్కెట్ లో అందుబాటులో ఉంది మరియు ఈ వాహనం పోటీ వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.

ఈ కొత్త ఇన్నోవా, బారీ షట్కోణ ఆకృతి కలిగిన గ్రిల్ మరియు క్రోం తో రెండు స్లాట్లు, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్లు తో పాటు ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు, కొత్త ఫాగ్ ల్యాంప్లు మరియు కొత్త బంపర్ వంటి కొత్త సౌందర్య అంశాలతో నవీకరించబడింది. మునుపటి వెర్షన్ కంటే ఈ వాహనం యొక్క లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది. ఈ కొత్త ఇన్నోవా వాహనం యొక్క కొలతలను చూసినట్లైతే, ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4735 మిల్లీ మీటర్లు అంటే, మునుపటి వెర్షన్ కంటే ఈ వాహనం 150 మిల్లీ మీటర్లు పొడవైనది అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క ఎత్తు, మునుపటి వెర్షన్ కంటే 35 మిల్లీ మీటర్లు ఎక్కువ అంటే, 1795 మిల్లీ మీటర్లు. ఈ వాహనం యొక్క వెడల్పు విషయానికి వస్తే, మునుపటి వెర్షన్ తో పోలిస్తే 65 మిల్లీ మీటర్ల ఎక్కువ వెడల్పు అంటే, 1830 మిల్లీ మీటర్లు ఎక్కువ వెడల్పు. కానీ వీల్బేస్ విషయానికి వస్తే, మునుపటి వెర్షన్ మరియు కొత్త వెర్షన్ యొక్క వీల్బేస్లు సమానం అంటే, 2750 మిల్లీ మీటర్లు. దీనిని బట్టి ఈ వాహనానికి బారీ వీల్బేస్ అందించబడింది.

ఇన్నోవా ఎల్లప్పుడూ, ఈ విభాగంలో అంతర్గత నాణ్యత పరంగా మరియు ఫినిషింగ్ పరంగా ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. అంతేకాకుండా అంతర్గత నాణ్యత పరంగా ఒక విజయాన్ని సాదించింది. ఇదే పరిస్థితి మునుపటి వెర్షన్ మరియు ప్రస్తుత వెర్షన్ సమం అని చెప్పవచ్చు. క్యాబిన్ లో ఉండే డాష్బోర్డ్ చెక్క చేరికలతో అలంకరించబడి ఉంది. దీనితో పాటు నవీన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఒక అదునాతన 8 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ వంటి అంశాలు గట్టి పోటీ ను ఇస్తాయి. ఈ సమాచార వ్యవస్థ, డి ఎల్ ఎన్ ఏ, వెబ్ బ్రౌజర్, స్మార్ట్ ఫోన్, ఎయిర్ గస్టర్ మరియు మిరాకాస్ట్ వంటి అంశాలకు మద్దతిస్తుంది. ఇవే కాకుండా, ఈ వాహనానికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోలు మరియు ప్రకాశవంతమైన ల్యాంప్లు వంటి అంశాలు అందించబడ్డాయి.

తదుపరి తరం ఇన్నోవా, అన్ని కొత్త 2.4 లీటర్ 2 జిడి ఎఫ్ టివి నాలుగు సిలండర్ల డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 149 పి ఎస్ పవర్ ను అదే విధంగా 342 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజన్, వేరియంట్ రకాన్ని బట్టి, 5- స్పీడ్ మాన్యువల్ లేదా అన్ని కొత్త 6- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఆప్షనల్ గా జత చేయబడి ఉంటుంది. ముందు భాగం భద్రతా విభాగం విషయానికి వస్తే, కొత్త ఇన్నోవా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ కు ఏడు ఎయిర్బాగ్లు అందించబడతాయి. ఈ వాహనానికి, ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్ మరియు డ్యూయల్ ఎయిర్బాగ్లు వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి.

ఇన్నోవా వాహనం యొక్క బలమైన విషయాలు అయినటువంటి నమ్మకమైన దూరప్రాంత ప్రజల రవాణా, టయోట యొక్క రచ్చ లేని యాజమాన్యపు అనుభవం మరియు ఏడు లేదా ఎనిమిది మంది ప్రయాణీకులు కోసం దాని సౌకర్యవంతమైన సీటింగ్ దీని యొక్క పరపతి వంటి అంశాలతో ఈ వాహనం కొనసాగుతుంది. ఇది తప్పనిసరిగా ఎమ్యూవి శ్రేణిలో జపనీస్ ఆటో సంస్థ నుంచి మరో పెద్ద వాహనంగా ఉంటుంది మరియు దేశీయ మార్కెట్లో కంపెనీ స్థానం బలోపేతం అవుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టయోటా ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience