పవర్ విండో స్విచ్ యొక్క లోపం కారణంగా టొయోటా వారు 6.5 మిలియన్ వాహనాలను ఉపసమ్హరించుకున్నారు
అక్టోబర్ 23, 2015 11:43 am bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మరొక లోపం కారణంగా ఈ జపనీస్ కారు తయారీదారి దాదాపు 6.5 మిలియన్ వాహనాలను ఉపసమ్హరించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ లోపం పవర్ విండో స్విచ్ గురించి అని తెలియ వచ్చింది. ఈ స్విచ్ కి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది అని, ఇది వేడి ఎక్కువ అవడం (ఓవర్ హీట్) వలన్ అయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా భాగాలు కరిగి తద్వారా మంట రాజుకోవచ్చు అని అంచనా.
వెనక్కి పిలిపించిన కార్ల జాబితాలో జనవరీ 2005 మరియూ డిసెంబర్ 2010 లో ఉత్పత్తి చేసిన యారిస్, కరొల్లా, క్యామ్రీ మరియూ ఆరేవీ4 స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ లు ఉన్నాయి. దాదాపుగా 2.7 మిలియన్ వాహనాలను ఉత్తర అమెరికాలో, 1.2 మిలియన్ వాహనాలు యూరప్ లో మరియూ 600,000 వాహనాలు జపాన్ లో ఉన్నాయి. ఈ కారణంగా ఎటువంటి ప్రమాదాలు ఇంతవరకు జరగలేదు అని కంపెనీ వారు తెలిపారు.
టొయోటా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పెద్ద కారు తయరీదారి కానీ ఈమధ్య విరివిగా ఈ లోపాల బాట పట్టడం కారణంగా ఈ కంపెనీ పై నమ్మకం తగ్గవచ్చు.
ఇంతకు మునుపు, ఈ కంపెనీ వారు పునరుద్దరించిన ఇతియోస్ హ్యాచ్బ్యక్ ని పండుగ కాలం అమ్మకాల కోసం విడుదల చేశారు. ఈమధ్య ఈ సంఖ్య కూడా ఇతర కార్ల పోటీ వలన తగ్గుతోంది.