Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ Vs హైబ్రిడ్: ఎలక్ట్రిఫైడ్ MPV ఎంత ఎక్కువ పొదుపైనది?

మార్చి 30, 2023 02:46 pm rohit ద్వారా ప్రచురించబడింది
48 Views

ఇటీవల టయోటా ఇనోవా హైక్రాస్ ప్రామాణిక పెట్రోల్ మరియు హైబ్రిడ్ వేరియెంట్ؚలను వాస్తవ పరిస్థితులలో పరీక్షించాము.

మూడవ-జనరేషన్ ఇన్నోవా కోసం టయోటా ఒక విప్లవాత్మక విధానాన్ని అనుసరించింది. రేర్-వీల్ డ్రైవ్‌కు(RWD) బదులుగా దీన్ని ఫ్రంట్-వీల్-డ్రైవ్‌గా(FWD) చేయడం, డీజిల్‌కు బదులుగా కేవలం పెట్రోల్ؚ వేరియంట్‌ను అందించడం వంటివి ఇందులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్‌కు మారడం వలన, మొదటిసారిగా MPVలో- స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ ఎంపిక అందుబాటులోకి వచ్చింది – ఫుల్ ట్యాంక్ؚతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యాన్ని కలిగిస్తుంది.

అందించిన స్పెసిఫికేషన్ ప్రకారం, రెండిటి ఇంధన సామర్ధ్యాలలో భారీ తేడాలు ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులలో, ఈ తేడా అనుకున్న దానికంటే తక్కువ ఉండవచ్చు. కాబట్టి, ఇక్కడ ఇన్నోవా హైక్రాస్ ప్రామాణిక పెట్రోల్ వేరియెంట్ వాస్తవ-పరిస్థితులలో పరీక్షించిన గణాంకాలను హైబ్రిడ్ వేరియెంట్ؚతో సరిపోల్చాము.

సాంకేతిక స్పెసిఫికేషన్ ల వివరాలు

స్పెసిఫికేషన్

ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్

ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్-హైబ్రిడ్

ఇంజన్

2-లీటర్ పెట్రోల్

2-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్

పవర్

174PS

186PS (సిస్టమ్), 152PS (ఇంజన్) మరియు 113PS (మోటార్)

టార్క్

205Nm

187Nm (ఇన్) and 206Nm (motor)

ట్రాన్స్ؚమిషన్

CVT

e-CVT

క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం

16.13kmpl

23.24kmpl

క్లెయిమ్ చేసిన గణాంకాల ప్రకారం, మైలేజ్ గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి, హైబ్రిడ్ వేరియెంట్ؚలు 20kmpl కంటే ఎక్కువ మరియు ప్రామాణిక వేరియెంట్ؚలు 15kmpl కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయని ఆశించవచ్చు. రెండూ ఒకే స్థాయి పనితీరును కనపరుస్తాయి. ధృవీకరించిన క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్య గణాంకాల కంటే ముందు, టయోటా పూర్తి ట్యాంక్ؚ సామర్ధ్యాన్ని 1,100kmగా, ఇంధన సామర్ధ్యాన్ని 21.1kmplగా అంచనా వేసింది.

సంబంధించినది: టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఫస్ట్ డ్రైవ్ | సురక్షిత కవర్ డ్రైవా లేదా హిట్ అవుట్ ఆఫ్ ది పార్కా?

వాస్తవ-పరిస్థితులలో ఫలితాలు

పరీక్షించిన మైలేజీ గణాంకాలు

ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్

ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్-హైబ్రిడ్

ఖాళీ అయ్యే దూరం

721.5km

971.71km

పరీక్షించిన ఇంధన సామర్ధ్యం

13.87kmpl

18.68kmpl

టెస్ట్ చేసిన గణాంకాలు, టయోటా క్లెయిమ్ చేసిన సామర్ధ్య గణాంకాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ హైబ్రిడ్ విషయంలో టయోటా వాస్తవంగా ప్రకటించిన ఇంధన సామర్ధ్యంతో పోలిస్తే, ఇన్నోవా హైక్రాస్ రెండు వెర్షన్‌లు సుమారు 2.5kmpl తక్కువగా ఉంది. అయితే, ధృవీకరించిన టెస్టింగ్ ఎకానమీని ప్రకారం, ఈ హైబ్రిడ్ వాస్తవ ప్రపంచంలో ఒక లీటర్ؚకు సుమారు 4.5km తక్కువ సామర్ధ్యాన్ని అందించింది.

వీటి మధ్య, ఎలక్ట్రిఫైడ్ ఇన్నోవా హైక్రాస్ؚ సుమారుగా 5kmpl ఇంధన సామర్ధ్య ప్రయోజనం ఉంది. ఫలితంగా, ఇది పూర్తి ట్యాంక్ؚతో 250km అదనపు దూరాన్ని కవర్ చేయగలదు, దీని అర్ధం ఇంధనం కోసం తరచుగా ఆగవలసిన అవసరం ఉండదు. నిజానికి, సరైన పరిస్థితులలో, సున్నితంగా డ్రైవ్ చేస్తే, బహుశా మీ ఇంధన రీఫిల్స్ మధ్య 1,000km దూరం ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: అధికారిక SUV భాగస్వామిగా 4 IPL T20 టీమ్ؚలతో కలసి పని చేయనున్న మహీంద్రా

ఎల్లప్పుడూ చెడ్డ విషయం కాదు

క్లెయిమ్ చేసిన గణాంకాల కంటే టెస్ట్ చేసిన మైలేజ్ గణాంకాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి, అయితే సాధారణ పెట్రోల్ వర్షన్ؚల కంటే స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚలు కలిగిన కార్‌లు గణనీయంగా మరింత సామర్ధ్యాన్ని కలిగి ఉండి, మరింత పనితీరును ప్రదర్శిస్తాయి. స్వచ్చమైన EV మోడ్ మరియు రీజనరేటింగ్ బ్రేకింగ్ కారణంగా సాధారణ పెట్రోల్ మరియు డీజిల్ కార్‌ల కంటే నగరంలో స్ట్రాంగ్-హైబ్రిడ్ వాహనాల సమర్ధత చాలా మెరుగ్గా ఉంటుందని వీటితో మునుపటి అనుభవాలు రుజువు చేశాయి.

అంతేకాకుండా, హైక్రాస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚను నవీకరించినప్పటికంటే ముందు (నగరంలో 11.29kmpl మరియు హైవేపై 14.25kmpl) డీజిల్-ఆటోమ్యాటిక్ వేరియెంట్ ఇన్నోవా క్రిస్టా వేరియెంట్ؚతో పోలిస్తే, వాస్తవ పరిస్థితిలో ఇది మరింత పొదుపైనది.

వేరియెంట్ؚలు, ధర మరియు పోటీ

టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను ఆరు విస్తృతమైన వేరియెంట్‌లలో విక్రయిస్తుంది - G, GX, VX, VX(O), ZX మరియు ZX(O) – వీటి ధరలు రూ.18.55 లక్షల నుండి రూ.29.72 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటాయి. ఇది కియా క్యారెన్స్ؚకు ఖరీదైన ప్రత్యామ్నాయంగా మరియు కియా కార్నివాల్ కంటే చవకైన ఎంపికగా ఉంటుంది.

ఇక్కడ మరింత చదవండి: ఇన్నోవా హైక్రాస్ ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on Toyota ఇనోవా Hycross

M
madhurima
Mar 31, 2023, 6:21:53 AM

It's a just over priced car. Toyota increased it's price further by around one lac the 1st of March, 2023. They are trying to gain the advantage of their brand value nothing else.

M
madhurima
Mar 31, 2023, 6:21:53 AM

It's a just over priced car. Toyota increased it's price further by around one lac the 1st of March, 2023. They are trying to gain the advantage of their brand value nothing else.

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.10 - 8.97 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.26.90 - 29.90 లక్షలు*
Rs.63.91 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.10.60 - 19.70 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర