ఇన్నోవా క్రిస్టా టాప్-ఎండ్ వేరియెంట్ ధరలను వెల్లడించిన టయోటా
వీటి ధరలు హైక్రాస్ ఎంట్రీ-లెవెల్ హైబ్రిడ్ వేరియెంట్ ధరలకు సమానంగా ఉన్నాయి
-
ఇన్నోవా క్రిస్టా VX మరియు ZX వేరియెంట్ ధరలను టయోటా వెల్లడించింది; MPV ధరలు రూ. 19.13 లక్షల నుండి రూ.25.43 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
-
ఈ MPV G, GX, VX మరియు ZX అనే నాలుగు వేరియెంట్ؚలలో అందిస్తున్నారు.
-
8-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఏడు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు ఉంటాయి.
-
కేవలం 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్‌తో 150PS 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ؚను పొందుతుంది.
టాప్-ఎండ్ టయోటా ఇన్నోవా క్రిస్టా VX మరియు ZX వేరియెంట్‌ల ధరలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. ముందు భాగంలో తేలికపాటి అప్‌డేట్‌తో పాత జనరేషన్ MPVని G, GX, VX మరియు ZX అవే నాలుగు వేరియెంట్ؚలలో పొందవచ్చు. పూర్తి ధరల జాబితా ఇక్కడ అందించబడింది:
వేరియెంట్ |
ధరలు |
G 7-సీటర్ |
రూ. 19.13 లక్షలు |
G 8-సీటర్ |
రూ. 19.18 లక్షలు |
GX 7- మరియు 8-సీటర్ |
రూ. 19.99 లక్షలు |
VX 7-సీటర్ (కొత్తది) |
రూ. 23.79 లక్షలు |
VX 8-సీటర్ (కొత్తది) |
రూ. 23.84 లక్షలు |
ZX 7-సీటర్ (కొత్తది) |
రూ. 25.43 లక్షలు |
VX వేరియెంట్ GX వేరియెంట్‌తో పోలిస్తే రూ.3.79 లక్షలు ఖరిదైనది. ZX వేరియెంట్, VX వేరియెంట్ కంటే సుమారుగా రూ.1.5 లక్షలు ఎక్కువ ధరకు వస్తుంది. క్రిస్టా ధర ప్రస్తుతం రూ.19.13 నుండి రూ.25.43 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది, ఈ ధర 2022లో దీన్ని నిలిపివేసినప్పుడు ఉన్న ధరకు దగ్గరగా ఉంది. క్రిస్టా VX వేరియెంట్, ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ధర కంటే సుమారుగా ఒక లక్ష తక్కువ. అయితే, క్రిస్టా ZX వేరియెంట్, హైక్రాస్ VX హైబ్రిడ్ కంటే సుమారు రూ. 60,000 ఎక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : జూలై నాటికి విడుదల కానున్న ‘మారుతి’ ఇన్నోవా హైక్రాస్
టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఆటోమ్యాటిక్ AC, 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెదర్ సీట్‌లు, వన్-టచ్ టంబుల్ రెండవ-వరుస సీట్‌లు మరియు అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ؚలు భద్రతను కవర్ చేస్తాయి.
MPVకి శక్తిని అందించేది మునపటి 150PS/343Nm 2.4-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది సరికొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడింది, 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది. హైక్రాస్ కేవలం ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే వస్తుంది, పాత ఇన్నోవాలో ఈ సౌకర్యం లేదు.
ఇది కూడా చదవండి: టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ Vs హైబ్రిడ్: ఎలక్ట్రిఫైడ్ MPV ఎంత పొదుపు చేస్తుంది?
డీజిల్ؚ ఆధారిత ఇన్నోవా క్రిస్టా ఇన్నోవా హైక్రాస్ؚకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది, ఇది పూర్తిగా కొత్త ఉత్పత్తి. ఇందులో 2-లీటర్‌ల పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, 21.1kmpl క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యాన్ని పొందేందుకు దీన్ని హైబ్రిడైజేషన్‌తో ఎంచుకోవచ్చు. ఇది క్రిస్టా కంటే మరింత ప్రీమియం మరియు ఆధునికమైనది, దీనిలో రాడార్-ఆధారిత ADAS అదనపు భద్రత జోడించబడింది. హైక్రాస్ ధర రూ.18.55 లక్షల నుండి రూ. 29.72 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ఇక్కడ మరింత చదవండి : ఇన్నోవా క్రిస్టా డీజిల్