Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టయోటా హైరైడర్ Vs స్కోడా కుషాక్ Vs హ్యుందాయ్ క్రెటా Vs మారుతి గ్రాండ్ విటారా Vs వోక్స్వ్యాగన్ టైగూన్: స్పేస్ మరియు ఆచరణాత్మక పోలిక

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం rohit ద్వారా మార్చి 22, 2023 03:04 pm ప్రచురించబడింది

మీ కుటుంబానికి సరైన SUVని ఎంచుకోవడం అంత కష్టమైన పని ఏమి కాదు. మీరు ఏది, ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ తెలియచేయబడింది

మార్కెట్‌లో ప్రవేశించినప్పటి నుండి కాంపాక్ట్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా ప్రజాదరణ పొందిన వాహనంగా నిలిచింది. దాని స్వరూప వాహనం, కియా సెల్టోస్ 2019 మధ్య కాలంలో పోటీలోకి ప్రవేశించింది, హ్యుందాయ్ తన రెండవ జనరేషన్ మోడల్ؚను తరువాతి సంవత్సరంలో విడుదల చేసింది. మార్కెట్‌లో మూడు సంవత్సరాలు కొనసాగిన సెల్టోస్‌ను, ఇప్పుడు నవీకరించబడిన వేరియెంట్ؚలతో త్వరలోనే భారతదేశంలో ప్రవేశపెట్టనున్న కియా.

హ్యుందాయ్-కియా వాహనాల జంట కొనుగోలుదారులను మరింతగా ఆకర్షిస్తుండగా, స్కోడా/VW SUVలు మరియు ఇటీవల టయోటా-మారుతి జంటలు మార్కెట్‌లో ప్రవేశించడంతో పోటీ మరింత తీవ్రంగా మారింది. మీ కుటుంబానికి సరైన వాహనం ఎంచుకోవడంలో మీకు సహాయపడటానికి, ఈ రివ్యూలో కాంపాక్ట్ SUV విభాగంలో ఉన్న ప్రముఖ వాహనాల పోలీకలను ఇక్కడ అందించాము.

లుక్స్

కొలత

టయోటా హైరైడర్

స్కోడా కుషాక్

హ్యుందాయ్ క్రెటా

మారుతి గ్రాండ్ విటారా

వోక్స్వ్యాగన్ టైగూన్

పొడవు

4,365మిమీ

4,225మిమీ

4,300మిమీ

4,345మిమీ

4,221మిమీ

వెడల్పు

1,795మిమీ

1,760మిమీ

1,790మిమీ

1,795మిమీ

1,760మిమీ

ఎత్తు

1,635మిమీ

1,612మిమీ

1,635మిమీ

1,645మిమీ

1,612మిమీ

వీల్‌బేస్

2,600మిమీ

2,651మిమీ

2,610మిమీ

2,600మిమీ

2,651మిమీ

  • ఈ అన్ని కాంపాక్ట్ SUVల పొడవు, వీల్ؚబేస్ దాదాపుగా సమానంగా ఉన్నపటికి, ప్రతి వాహనం ప్రత్యేకంగా కనిపిస్తుంది.

  • తమ SUVలు సాధారణ బాక్సీ స్టైల్ؚలో ఉండటాన్ని ఇష్టపడే వారి కోసం, స్కోడా కుషాక్ మరియు వోక్స్వ్యాగన్ టైగూన్ ఉత్తమమైన ఎంపికగా నిలుస్తాయి. ఇవి అన్నిటిలోకి చిన్న SUVలు అయినప్పటికీ, ఇవి పొడవైన వీల్ؚబేస్ؚను కలిగి ఉన్నాయి. స్టైలింగ్ మరియు గ్రిల్ సైజ్ విషయంలో సరైన విధంగా ఉండే దూకుడైన డిజైన్ తత్వం కలిగి ఉన్నాయి.

  • మిగిలిన మూడు SUVలు హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారాలు వంపు తిరిగిన విధంగా ఉంటాయి, ఇందులో టయోటా మోడల్ పొడవైనది మరియు మారుతి ఎత్తైనది. క్రెటా అన్నిటి కంటే భిన్నంగా ఉన్నపటికి, దీని వంపు తిరిగిన లుక్ అన్నిటిలో దీన్ని పెద్దదిగా కనిపించేలా చేస్తుంది.

  • 17-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు LED DRLలతో ఆటో-LED హెడ్ؚలైట్‌ వంటి ఫీచర్‌లు ఈ ఐదు SUVలలో కనిపిస్తాయి.

క్యాబిన్ నాణ్యత

  • కాంపాక్ట్ విభాగంలో ఇటీవలే విడుదలైన టయోటా హైరైడర్-మారుతి గ్రాండ్ విటారా జంట వాటి ప్రీమియం మరియు అత్యంత నాణ్యమైన ఇంటీరియర్‌ల వలన ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ రెండు SUVలు డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్ؚను పొందాయి (ఈ రెండు వాహనాలలో ఎంచుకున్న మైల్డ్ లేదా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంటీరియర్‌లపై ఆధారపడి వీటి రంగు మారుతుంది), డ్యాష్ؚబోర్డ్‌పై మెత్తగా ఉండే లెదర్ మెటీరీయల్ వీటి ప్రీమియం ఇంటీరియర్ అప్పీల్ؚను మరింతగా పెంచుతుంది.

  • తరువాత స్థానంలో నిలిచేది వోక్స్వ్యాగన్ మరియు స్కోడా కార్‌లు. టయోటా-మారుతి SUVల విధంగా ప్రీమియం మరియు అత్యంత అనుభవాన్ని అందించకపోయినా, డ్యాష్ؚబోర్డ్‌పై (ఎంచుకున్న వేరియెంట్ؚలలో కలర్-కోఆర్డినేట్ చేయబడిన) వేరియంట్ ఇన్సర్ట్ؚతో సహా, క్రోమ్ అసెంట్స్ మరియు రోటరీ డయల్స్‌తో(కుషాక్) టు-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. చెప్పాలంటే, ఈ రెండు జర్మన్ SUVలలో రూఫ్ؚలైనర్, సన్‌షేడ్స్ మరియు కొన్ని చోట్ల ప్లాస్టిక్ నాణ్యత నిరాశపరిచేలా ఉంటుంది.

  • క్యాబిన్ ఫంక్షనాలిటీ విషయంలో ప్రత్యర్ధి SUVలతో పోలిస్తే క్రెటా క్యాబిన్ అన్ని విధాలుగా సమానంగా ఉన్నపటికి, మిగిలిన నాలుగు SUVలతో పోలిస్తే డిజైన్ పరంగా ఇది ప్రీమియంగా కనిపించదు. దీని క్యాబిన్ సౌకర్యవంతంగా మరియు సమర్థవంతంగా డిజైన్ చేయబడి, మెరుగైన స్టీరింగ్ వీల్ మరియు బటన్‌లను కలిగి ఉంది, కానీ ఈ SUV ప్లాస్టిక్ మరియు నిర్మాణ నాణ్యత విషయానికి వస్తే, ఇవి మరింత మెరుగ్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: GM తలేగావ్ ప్లాంట్ؚను కొనుగోలు చేయడానికి టర్మ్ షీట్‌పై సంతకం చేసిన హ్యుందాయ్ ఇండియా

ముందు సీటు

  • హైరైడర్ మరియు గ్రాండ్ విటారా రెండు దృఢమైన మరియు మెత్తనైన (గ్రాండ్ విటారా) లెదర్ కలిగిన ముందు సీట్‌లను కలిగి ఉంటాయి. వీటి దృఢత్వం కారణంగా దూర ప్రయాణాలలో అలసటను కలగచెయ్యవు. డ్రైవర్ సీట్ మరియు స్టీరింగ్ వీల్ؚకు ఎన్నో సర్దుబాట్లు చేసుకోవచ్చు, ఇవి మీకు సరైన మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్ؚను అందిస్తాయి.

  • పెద్దవైన, అనుకూలమైన ముందు సీట్‌లు కోరుకునే వారు క్రెటాను ఎంచుకోవచ్చు. డ్రైవింగ్ చేసే వారు తమకు అనుగుణంగా మెత్తని కుషన్ కలిగిన సీట్‌ను 8-విధాలుగా సర్దుబాటు చేసుకోగల సౌకర్యం ఉంది. అయితే, స్టీరింగ్ వీల్‌కు టెలిస్కోపిక్ సర్దుబాటును హ్యుందాయ్ దీనికి అందించలేదు.

  • స్కోడా కుషాక్ మరియు వోక్స్వ్యాగన్ టైగూన్ؚ రెండిటిలో ముందు సీట్‌లు చాలా వరకు ప్రతి ఒక్కరికి సౌకర్యంగా, చక్కటి ఆకృతిలో ఉండటాన్ని గమనించవచ్చు, అయితే భారీ ఆకారం ఉన్నవాళ్ళకు ఈ ఆకృతి కొంత మేరకు ఇబ్బందిని కలిగించవచ్చు.

వెనుక సీట్

  • హైరైడర్ మరియు గ్రాండ్ విటారాలు రెండిటిలో ముగ్గురు సగటు-సైజ్ వయోజనులు కూర్చోగలరు, అయితే భారీ ఆకారం కలవారికి కొంత మేరకు ఇరుకుగా అనిపించవచ్చు. వెనుక సీట్‌లకు రిక్లైన్ ఫంక్షనాలిటీ ఉన్నప్పటికీ, ఆరు అడుగులు లేదా ఇంకా పొడవుగా ఉన్నవారికి హెడ్ؚరూమ్ కొంత మేరకు ఇరుకుగా అనిపించవచ్చు. రెండు SUVలలో వెనుక కూర్చునే ప్రయాణీకుల కోసం మూడు వ్యక్తిగత హెడ్ؚరెస్ట్ؚలు, మూడు-పాయింట్ సీట్ బెల్టులు ఉంటాయి. టయోటా మరియు మారుతి వాహనాలలో రెండు వెనుక వైపు AC వెంట్‌లను మరియు రెండు USB పోర్ట్ؚలను (టైప్ A మరియు టైప్ B) అందించింది. వీటి క్యాబిన్‌లు ముదురు రంగులో ఉన్నప్పటికీ, భారీగా ఉండే సన్‌రూఫ్‌లు మరింత కాంతిని అనుమతించి చక్కని అనుభూతిని కలిగిస్తుంది. చెప్పాలంటే, దీనికి ఉన్న క్యాబిన్ సైజ్‌కు లేత రంగు థీమ్ ఉంటే ఖచ్చితంగా మరింత చక్కని అనుభూతిని కలిగించేది.

  • వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోవడానికి ఇక్కడ ఉన్న వాటిలో ఉత్తమమైనది SUV క్రెటా, దీని ఫ్లాట్ సీట్‌ల కారణంగా ఇది సాధ్యపడుతుంది. ఈ వాహనంలో మధ్యలో కూర్చున్న ప్రయాణికుడికి కూడా సౌకర్యంగా ఉంటుంది. డ్రైవర్ నడుపుతుండగా ప్రయాణం చేయడం ఇష్టం ఉన్న వారి కోసం, వెనుక వైపు AC వెంట్‌లు మరియు USB పోర్టులతో సహా చక్కని ఫీచర్‌లు ఉన్నాయి. వెనుక సీట్ అనుభవాన్ని పెంచేలా హెడ్ؚరెస్ట్ؚల కోసం రెండు కుషన్‌లు (కానీ మధ్య ప్రయాణికుడికి హెడ్‌రెస్ట్ లేదు), సన్ؚషేడ్ؚలు, విస్తృతమైన సన్ؚరూఫ్ (వెనుక కూడా మంచి అనుభూతి కలుగుతుంది) ఉన్నాయి.

  • స్కోడా కుషాక్ మరియు VW టైగూన్ వెనుక సీట్‌లు సరైన ఆకృతిని, ధృడంగా ఉండే మెత్తదనాన్ని కలిగి ఉన్నాయి. క్యాబిన్ లోపల కదలికలు కలిగిన ఇవి ప్రయాణీకులను సీట్ؚలో పట్టి ఉంచుతాయి. ఈ జంట కార్‌లను నాలుగు-సీటర్‌గా ఉపయోగించడం మంచిది ఎందుకంటే పరిమిత క్యాబిన్ వెడల్పు మరియు సీట్‌ల ఆకృతి కారణంగా అదనపు వ్యక్తికి (మధ్య సీట్ ప్రయాణీకుడు) ఇరుకైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: మీ సన్‌రూఫ్ؚను సక్రమంగా ఉపయోగించడానికి మరియు నిర్వహించడానికి టాప్ 5 చిట్కాలు

ఫీచర్‌లు

ఉమ్మడి ఫీచర్‌లు

టయోటా హైరైడర్/మారుతి గ్రాండ్ విటారా ఫీచర్ హైలైట్‌లు

స్కోడా కుషాక్/VW టైగూన్ ఫీచర్ హైలైట్‌లు

హ్యుందాయ్ క్రెటా ఫీచర్ హైలైట్‌లు

  • కీలెస్ ఎంట్రీ
  • పుష్/బటన్ స్టార్ట్/స్టాప్
  • రేర్ AC వెంట్‌లతో ఆటో క్లైమెట్ కంట్రోల్
  • ఆటో-హెడ్ؚలైట్‌లు
  • టిల్ట్-సర్దుబాటు చేయగలిగిన స్టీరింగ్ వీల్
  • వెంటిలేటెడ్ ముందు సీట్‌లు
  • క్రూజ్ కంట్రోల్​​​​​​​
  • ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే
  • వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్
  • కనెక్టెడ్ కార్ టెక్
  • రివర్సింగ్ కెమెరా
  • టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్ వీల్
  • రైన్-సెన్సింగ్ వైపర్‌లు
  • 360-డిగ్రీ కెమెరా ​​​​​​​
  • తొమ్మిది-అంగుళాల టచ్ؚస్క్రీన్
  • హెడ్-అప్ డిస్ప్లే
  • పనరోమిక్ సన్ؚరూఫ్
  • టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్ వీల్
  • రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు
  • కూల్డ్ గ్లోవ్ؚబాక్స్
  • 10-అంగుళాల టచ్ؚస్క్రీన్
  • పనారోమిక్ సన్ؚరూఫ్
  • 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్
  • కూల్డ్ గ్లోవ్ؚబాక్స్
  • ఎయిట్-వే పవర్డ్ డ్రైవర్ సీట్
  • డ్రైవ్ మరియు ట్రాక్షన్ మోడ్ؚలు
  • రేర్ విండో సన్ؚషేడ్ؚలు

  • ఇక్కడ ఉన్న ఐదు SUVలలో మీరు కోరుకునే ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంటాయి, వీటిలో సన్ؚరూఫ్ (మూడు మోడల్‌లలో పనోరమిక్ యూనిట్), వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు ఉన్నాయి.

  • తమ ప్రత్యర్ధితో పోలిస్తే ప్రతి SUV లేదా ఇక్కడ ప్రతి SUVల జంట కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఉదాహరణకు, బలమైన-హైబ్రిడ్ వేరియెంట్‌లు టయోటా మరియు మారుతి మోడల్‌లు హెడ్స్-అప్ డిస్ప్లేను, 360-డిగ్రీల కెమెరాను కలిగి ఉన్నాయి, ఇవి ఈ విభాగానికే ప్రత్యేకమైనవి.

  • జర్మన్ జంటలో రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఉన్నాయి, ఇవి గ్రాండ్ విటారా మరియు హైరైడర్ؚలో లేవు.

  • ఇక్కడ ఉన్న వాటిలో అతి పెద్ద టచ్‌స్క్రీన్ (10.25-అంగుళాలు) క్రెటాలో ఉంది, పవర్డ్ డ్రైవర్ సీట్, వెనుక సన్ؚషేడ్‌లు మరియు డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్ؚలు ఉన్న ఒకే ఒక SUV ఇది.

భద్రత

  • స్కోడా/వోక్స్వ్యాగన్ SUVలలో ఉన్న అతి పెద్ద ప్రయోజనం గ్లోబల్ NCAP నుండి పొందిన ఫైవ్-స్టార్ భద్రతా రేటింగ్.

  • మరొక వైపు, క్రెటా టెస్ట్ ఫలితాలు ఏప్రిల్ 2022లో వెల్లడించారు, ఇందులో దీనికి సగటు త్రీ-స్టార్ రేటింగ్ؚ స్కోర్ దక్కింది. ప్రస్తుతం దీనిలో ఉన్న భద్రతా ఫీచర్‌లు టెస్ట్ చేసే సమయంలో లేవు అని గమనించండి, టెస్ట్ؚలు కూడా కఠినంగా ఉండేవి కాదు.

  • మారుతి-టయోటా మోడల్‌ల గురించి చెప్పాలంటే, వీటికి గ్లోబల్ NCAP టెస్ట్ؚలు ఇంకా చేయవలసి ఉంది.

  • ఐదు SUVలలో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉన్నాయి.

ఇది కూడా చదవండి: SUVగా వర్గీకరించడానికి ఒక కార్ؚకు ఉండవలసిన 5 అవసరాలను వివరించిన ChatGPT

బూట్ స్పేస్

  • ఐదు SUVలలో ఏది గరిష్ట బూట్ స్పేస్ؚను అందిస్తుంది అని చూడటానికి మూడు సూట్ؚకేస్ؚలు మరియు రెండు సాఫ్ట్ؚబ్యాగ్ؚలు ఉండే టెస్ట్ లగేజీని ఉపయోగించాము.

  • మారుతి గ్రాండ్ విటారా/టయోటా హైరైడర్ విషయానికి వస్తే, వీటి మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ ఎక్కువ లగేజ్ؚని స్టోర్ చేయగలుగుతుంది, భారీ బ్యాటరీ ప్యాక్ లేకపోవడమే దీనికి కారణం. మైల్డ్-హైబ్రిడ్ వేరియెంట్ؚలో, ఈ SUV అతి పెద్ద మరియు చిన్న ట్రాలీ బ్యాగులు, రెండు సాఫ్ట్ బ్యాగ్‌లను స్టోర్ చేయగలిగింది. మరొపక్క, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియెంట్ؚలు కేవలం ఒక సాఫ్ట్ؚబ్యాగ్ؚతో పెద్ద, చిన్న ట్రాలీ బ్యాగ్ؚలను స్టోర్ చేయగలిగాయి.

  • మిగిలిన మూడు SUVలలో, హ్యుందాయ్ క్రెటా కొలతల పరంగా ఎక్కువ బూట్ స్పేస్ؚను (433 లీటర్‌లు) కలిగి ఉంది, యూరోపియన్ SUVలు ప్రతి దానిలో 385 లీటర్‌ల బూట్ స్పేస్ ఉంది. వాస్తవంగా చూస్తే, కుషాక్ మరియు టైగూన్ ఒక సాఫ్ట్‌బ్యాగ్ؚతో సహా మూడు సూట్ؚకేసులను స్టోర్ చేయగలిగాయి. ఇది ఎందుకంటే, కుషాక్ మరియు టైగూన్‌లలో బూట్ చక్కని ఆకృతిని కలిగి ఉంది మరియు క్రెటా కంటే లోతు ఎక్కువగా ఉంది. హ్యుందాయ్ SUVలో పార్సిల్ ట్రేను తొలగించినప్పుడు మాత్రమే పూర్తి సైజ్ మరియు చిన్న ట్రాలీ బ్యాగ్ؚలు, రెండు సాఫ్ట్ؚబ్యాగ్ؚలను స్టోర్ చేయగలిగింది.

పవర్ؚట్రెయిన్ؚలు మరియు రైడ్ నాణ్యత

స్పెసిఫికేషన్

టయోటా హైరైడర్/మారుతి గ్రాండ్ విటారా

స్కోడా కుషాక్/VW టైగూన్

హ్యుందాయ్ క్రెటా

ఇంజన్

1.5-లీటర్ మైల్-హైబ్రిడ్ 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్

1-లీటర్ టర్బో-పెట్రోల్/ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ పెట్రోల్/ 1.4-లీటర్ టర్బో పెట్రోల్/ 1.5-లీటర్ డీజిల్

పవర్

103PS/ 116PS

115PS/ 150PS

115PS/ 140PS/ 115PS

టార్క్

137Nm/ 122Nm (ఇంజన్), 141Nm (మోటార్)

178Nm/ 250Nm

144Nm/ 242Nm/ 250Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ల MT, 6-స్పీడ్ల AT/ e-CVT

6-స్పీడ్ల MT, 6-స్పీడ్ల AT/ 6-స్పీడ్ల MT, 7-స్పీడ్ల DCT

6-స్పీడ్ల, CVT/ 7-స్పీడ్ల DCT/ 6-స్పీడ్ల MT, 6-స్పీడ్ల AT

డ్రైవ్ؚట్రెయిన్

FWD, AWD (MT మాత్రమే)/ FWD

FWD

FWD

  • పై SUVలు ఆన్నిటిలో, క్రెటాలో ఎక్కువ సంఖ్యలో ఇంజన్-గేర్ బాక్స్ కాంబినేషన్‌లు ఉన్నాయి. డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికను అందిస్తోంది కేవలం హ్యుందాయ్ కార్ తయారీదారు మాత్రమే. డీజిల్ పవర్‌ట్రెయిన్ؚ వాహనాలను నడపడం తేలిక మరియు అధిక ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ నగరాలకు సరైనది. చెప్పాలంటే, ఇది అడపాదడపా హైవే డ్రైవ్‌లకు కూడా సరిపోతుంది. మీకు క్రెటాలో శక్తివంతమైన ఇంజన్‌ను కోరుకుంటే, మీరు టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్ؚను ఎంచుకోవాలి.

  • స్కోడా మరియు వోక్స్వ్యాగన్ కార్‌లు వాటి బలమైన, దృడమైన ఇంజన్‌ల కారణంగా ఔత్సాహికులు వీటిని ఇష్టపడతారు. కుషాక్-టైగూన్ జంటలో ఉండే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే మృదువైన, మరింత రెస్పాన్సివ్ మరియు రిఫైండ్ؚగా ఉండే ఇంజన్ కోరుకునే వారికి ఇది తగినది.

  • మారుతి-టయోటా SUVల మైల్డ్-హైబ్రిడ్ యూనిట్‌లు నగరాలలో మెరుగ్గా పని చేస్తున్నపటికి, హైవే ట్రిప్ؚలలో లేదా ఎక్కువ మంది ప్రయాణికులు/లగేజీ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆటోమ్యాటిక్ వర్షన్ సరైనది కాదు. SUV నుండి అధిక ఇంధన సామర్ధ్యాన్ని కోరుకునే వారు హైబ్రిడ్ వేరియెంట్‌లను ఎంచుకోవాలి, ఇది చాలా సందర్భాలలో సుమారుగా 20kmpl సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ యాక్సెలరేషన్ؚలో బూస్ట్ؚను అందిస్తున్నప్పటికీ, హైవేలపై ఎక్కువ శక్తివంతమైన అనుభూతిని అందించదు. మీరు కోరితే, మారుతి మరియు టయోటా SUVలు కూడా ఆల్-వీల్ డ్రైవ్ ట్రెయిన్‌ను(AWD) అందిస్తాయి, కానీ మైల్డ్-హైబ్రిడ్ మరియు మాన్యువల్ గేర్ బాక్స్ కాంబోతో మాత్రమే.

తీర్పు

  • వీటన్నిటిలో క్రెటా పాత మోడల్ అయినప్పటికీ – దీనిలో అనేక బలమైన అంశాలు ఉన్నాయి, వీటిలో ఎక్కువ సంఖ్యలో పవర్‌ట్రెయిన్ ఎంపికలను కలిగిన ఒకే ఒక SUV కావడం, మరింత క్యాబిన్ స్పేస్ؚను అందించడం మరియు మెరుగైన రైడ్ నాణ్యతను అందించడం వంటివి కూడా ఉన్నాయి. దీని బూట్ స్పేస్ మరియు ఇంటీరియర్ నాణ్యత మెరుగ్గా ఉంటే, ఈ హ్యుందాయ్ కార్ వీటి అన్నిటిలో చక్కని ఆల్-రౌండర్ అయ్యేది.

  • ఈ విభాగంలో అత్యధిక ఇంధన సామర్ధ్యం మరియు ప్రీమియం క్యాబిన్ మరియు ఫీచర్‌ల జాబితా ఉన్న కాంపాక్ట్ SUV కోసం మీరు చూస్తుంటే, మారుతి గ్రాండ్ విటారా/టయోటా హైరైడర్ హైబ్రిడ్ؚల ఎంపికకు పరిమితం అవుతుంది. ఇవి రెండూ పెట్రోల్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి, కానీ రెండు పవర్ؚట్రెయిన్ ఎంపికలతో వస్తాయి మరియు ఈ విభాగంలోనే ఉత్తమ ఫీచర్‌లను కలిగి ఉంటాయి.

  • చివరిగా, జర్మన్ SUVలు ఆకర్షణీయమైన లుక్‌ను కలిగి ఉంటాయి, రైడ్‌లో సరైన అనుభూతిని అందిస్తాయి. హ్యుందాయ్, మారుతి-టయోటాలు అందిచే ఫీచర్‌లతో పోలిస్తే ఈ వాహనాలలో ఫీచర్‌లు తక్కువే అని చెప్పవచ్చు మరియు పెద్దగా కూడా ఉండవు, కానీ వీటిని విస్మరిస్తే, నిమగ్నమయ్యే డ్రైవింగ్ అనుభవాన్ని ఈ జర్మన్ SUVల ద్వారా పొందవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: క్రెటా ఆన్ؚరోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 34 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2020-2024

Read Full News

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర