హోండా ఎలివేట్‌లో కనిపించని ఈ టాప్ 5 ఫీచర్లు
ఈ కాంపాక్ట్ SUV ప్రపంచవ్యాప్తంగా జూన్ؚలో విడుదల కానుంది మరియు కొన్ని డీలర్ؚషిప్ؚల వద్ద ఇప్పటికే ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.
భారతీయ మార్కెట్‌లో హోండా తన తదుపరి వాహనం అయిన ఎలివేట్ కాంపాక్ట్ SUVని జూన్ 6న విడుదల చేయనుంది, చాలా కాలం ఎదురుచూపు తరువాత హోండా నుండి వస్తున్న ఈ భారీ వాహనం హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి వాటితో పోటీకి సిద్దం అవుతుంది. అయితే ఇది మాస్-మార్కెట్ؚలో ఉన్న అత్యాధునిక సౌకర్యం మరియు సాంకేతిక ఫీచర్‌ల జాబితాతో అందించబడటం లేదు. హోండా ఈ వాహనాన్ని ADAS, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚలతో అందిస్తుందని అంచనా, కానీ దీని పోటీదారులు గొప్పగా చెప్పుకుంటున్న కొన్ని ఫీచర్లు ఇందులో లేవు. ఎలివేట్‌లో ఈ 5 టాప్ ఫీచర్‌లు ఉండకపోవచ్చు అని అంచనా. అవి:
పనోరమిక్ సన్ؚరూఫ్
ఇటీవల ఎలివేట్ ఆవిష్కరణ తేదీని తెలుపుతూ విడుదల చేసిన టీజర్ؚలో ఇది ధృవీకరించబడింది, ఈ టీజర్ؚలో హోండా ఎలివేట్ టాప్-వ్యూ కనిపించింది, ఇందులో కేవలం సింగిల్ పేన్ సన్ؚరూఫ్ మాత్రమే ఉంది.
ఇది కూడా చదవండి: పనోరమిక్ సన్ؚరూఫ్ ఫీచర్ లేని ఎలివేట్ SUV విడుదల తేదీని నిర్ణయించిన హోండా
చాలా మంది కొనుగోలుదారులకు పనోరమిక్ సన్ؚరూఫ్ అనేది మొదటి ప్రధాన్యతగా ఉంటుంది, కొనుగోలు నిర్ణయం దీనిపై ఆధారపడుతుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ؚలు ఈ ఫీచర్ؚను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం చివరలో రానున్న కియా సెల్టోస్ నవీకరించబడిన వర్షన్ؚలో కూడా ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు.
డీజిల్ ఇంజన్
ఇటీవల హోండా భారతదేశంలో తమ లైన్అప్ నుండి డీజిల్ ఎంపికను తొలగించింది మరియు ఎలివేట్ؚలో కూడా ఈ ఎంపిక లేదు. ఈ కాంపాక్ట్ SUV విభాగంలో డీజిల్ ఎంపికలు దాదాపుగా లేవు కానీ దీని పోటీదారులలో కొందరు ఇప్పటికీ తమ కస్టమర్‌లకు అధిక టార్క్‌ను అందించే పవర్ؚట్రెయిన్ ఎంపికను అందిస్తున్నారు.
టర్బో-పెట్రోల్ ఇంజన్
ఎలివేట్ డీజిల్ ఇంజన్ؚను అందించకపోవడం మాత్రమే కాదు, టర్బో-పెట్రోల్ యూనిట్ ఎంపికను కూడా పొందకపోవచ్చు. హోండా భారతదేశంలో పర్ఫార్మెన్స్-ఆధారిత పవర్ؚట్రెయిన్ؚలను అందించడం లేదు, బదులుగా అధిక ఇంధన సామర్ధ్యాన్ని అందించే హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚలను జోడించడానికి ప్రాధాన్యతను ఇస్తుంది. కాంపాక్ట్ SUV విభాగంలో దాదాపు అనేక మోడల్‌లు టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలతో వస్తుండగా హోండా ఎలివేట్ ఒక్కటే భిన్నంగా నిలుస్తుంది.
ఆకర్షణీయమైన డిస్ؚప్లే
పరిమాణ పరంగా ప్రజాదరణ పొందిన డిస్ప్లేؚ సైజ్‌లను హోండా మొదటి నుండే తన భారతదేశ లైన్‌అప్‌లో అందించడం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో నవీకరణ పొందిన సిటీలో కూడా 8-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ స్క్రీన్ؚను కొనసాగించింది, ఇది తన పోటీదారులు అందిస్తున్న దాని కంటే చిన్నది.
ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ SUV నుండి ఆశించగలిగిన 5 విషయాలు
సిటీలో అందించిన స్క్రీన్ కంటే పెద్ద స్క్రీన్‌తో ఎలివేట్ వస్తుందని ఆశిస్తున్నపటికి తన పోటీదారులు అందిస్తున్న స్క్రీన్ కంటే ఇది పెద్దదిగా ఉండకపోవచ్చు. చెప్పాలంటే, ఇది 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్ؚతో రావచ్చు, ఈ సైజ్‌ను ప్రస్తుతం ప్రామాణికంగా అన్నీ కారు తయారీదారులు అందిస్తున్నారు. అంతేకాకుండా, రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధరలో దీని పోటీదారులు డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సెట్అప్ؚను తమ SUVలలో అందిస్తున్నారు, కానీ ఇది ఎలివేట్ؚలో ఉండకపోవచ్చు.
ఆల్-వీల్ డ్రైవ్
అనేక అర్బన్ కాంపాక్ట్ SUVలలో, ఆల్-వీల్ డ్రైవ్ సాధారణంగా ఉండకపోయిన ఖచ్చితంగా ఇది ఆకర్షణీయమైనది, ఇది మారుతి-టయోటా జంట గ్రాండ్ విటారా మరియు హైరైడర్ؚలో మాత్రమే అందిస్తున్నారు. పైన పేర్కొన్న ఫీచర్‌ల విషయంలో హోండా ఎలివేట్ వెనుక పడినప్పటికీ, ప్రత్యేకంగా ఉండటానికి డ్రైవ్ؚట్రెయిన్ ఎంపికను అందించవలసింది, కానీ తప్పకుండా ఇది కూడా ఉండకపోవచ్చు.