ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కారు బ్రాండ్‌లు
మే 14, 2023 02:37 pm shreyash ద్వారా సవరించబడింది
- 34 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సుజుకి, టాటా మరియు కియాను మినహహించి, అన్ని బ్రాండ్ؚలు ఏప్రిల్ 2023లో ఋణాత్మక మంత్-ఆన్-మంత్ వృద్ధిని ప్రదర్శించాయి
ఏప్రిల్ 2023లో, కొత్త BS6 ఫేజ్ 2 ఉద్గార నియమాలు అమలులోకి వచ్చాయి, దీని కారణంగా కొన్ని బ్రాండ్‌ల కారు తయారీదారులు వాహనాల ధరలను పెంచారు. అయితే, విక్రయాల విషయానికి వస్తే, కేవలం మూడు కారు తయారీదారులు మారుతి, టాటా మరియు కియాలు మాత్రమే ఏప్రిల్ؚలో ధనాత్మక మంత్-ఆన్-మంత్ వృద్ధిని నమోదు చేయగలిగాయి.
\ఏప్రిల్ 2023లో మొదటి 10 బ్రాండ్ؚల ప్రదర్శన ఈ విధంగా ఉంది:
బ్రాండ్ؚలు |
ఏప్రిల్ 2023 |
మార్చి 2023 |
MoM వృద్ధి (%) |
ఏప్రిల్ 2022 |
YoY వృద్ధి (%) |
మారుతి సుజుకి |
1,37,320 |
1,32,763 |
3.4% |
1,21,995 |
12.6% |
హ్యుందాయ్ |
49,701 |
50,600 |
-1.8% |
44,001 |
13% |
టాటా |
47,010 |
44,047 |
6.7% |
41,590 |
13% |
మహీంద్రా |
34,694 |
35,796 |
-3.6% |
22,122 |
56.8% |
కియా |
23,216 |
21,501 |
8% |
19,019 |
22.1% |
టయోటా |
14,162 |
18,670 |
-24.1% |
15,085 |
-6.1% |
హోండా |
5,313 |
6,692 |
-20.6% |
7,874 |
-32.5% |
MG |
4,551 |
6,051 |
-24.8% |
2,008 |
126.6% |
రెనాల్ట్ |
4,323 |
5,389 |
-19.8% |
7,594 |
-43.1% |
స్కోడా |
4,009 |
4,432 |
-9.5% |
5,152 |
-22.1 |
ముఖ్యాంశాలు:
- విక్రయాల జాబితాలో మారుతి మొదటి స్థానంలో నిలిచింది. ఇది హ్యుందాయ్, టాటా మరియు మహీంద్రాల మొత్తం అమ్మకాల కంటే ఎక్కువ మోడల్‌లను విక్రయించింది. ఈ కారు తయారీదారు 3 శాతం కంటే ఎక్కువ మంత్-ఆన్-మంత్ (MoM), ఇయర్-ఆన్-ఇయర్ (YoY) లో 12.5 శాతం కంటే ఎక్కువ వృద్ధిని కనపరిచింది.
-
ఈ జాబితాలో రెండవ స్థానంలో హ్యుందాయ్ నిలవగా, దీని MoM విక్రయాలలో దాదాపు 2 శాతం తగ్గుదలను చూసింది. అయితే, ఇదే నెలలో గత సంవత్సరం అమ్మకాలతో తో పోలిస్తే 13 శాతం వృద్ధి కనపరిచింది.
ఇది కూడా చదవండి: అధిక మొత్తంలో భారతదేశ లిథియం రిజర్వ్ؚలు
- టాటా మరొకసారి హ్యుందాయ్ؚ క్రింది స్థానంలో నిలిచింది, MoM అమ్మకాలలో 6.5 శాతం మరియు YoY అమ్మకాలలో 13 శాతం కంటే ఎక్కువ వృద్ధిని కనపరిచింది.
- MoM అమ్మకాలలో 3.5 శాతం కంటే కొంత తగ్గుదలతో మహీంద్రా నాలుగవ స్థానంలో ఉన్నప్పటికీ, ఇది 50 శాతం కంటే ఎక్కువ YoY వృద్ధిని నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు 6 ఎయిర్ బ్యాగ్ؚలను అందిస్తున్న 5 కార్‌లు
- గత నెల అమ్మకాలతో పోలిస్తే కియా ప్రదర్శన మెరుగ్గా ఉన్నపటికి, దీని MoM వృద్ధి 8 శాతంగా ఉంది. మారుతి, టాటా మరియు కీయా కాకుండా MoM మరియు YoY గణాంకాలలో ధనాత్మక వృద్ధిని నమోదు చేసిన ఏకైక కారు తయారీదారు ఇది.
- మార్చి నెలతో పోలిస్తే టయోటా ఏప్రిల్ 2023లో 4,500 యూనిట్‌ల వరకు తక్కువ అమ్మకాలను చేసింది, దీని వార్షిక అమ్మకాలు (ఇదే నెలకు) 900 యూనిట్‌ల కంటే ఎక్కువగా తగ్గాయి.
- హోండా కూడా రెండు అమ్మకాల గణాంకాలలో తగ్గుదలను చూసింది. MoM అమ్మకాలలో 20.5 శాతం కంటే ఎక్కువ మరియు YoY అమ్మకాలలో 32.5 శాతం నష్టాలను చూసింది.
- MG MoM విక్రయాలు దాదాపు 25 శాతం తగ్గిన, ఇదే సమయానికి దీని YoY అమ్మకాలు భారీగా 126.5 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.
- 1000 యూనిట్ ల కంటే తక్కువ అమ్మకాలతో రెనాల్ట్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. దీని MoM గణాంకాలు పడిపోగా, దీని YoY గణాంకాలు 43 శాతం కంటే ఎక్కువగా భారీగా పడిపోయాయి. గత సంవత్సర అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుత అమ్మకాలు సుమారు 3,000 కంటే ఎక్కువ యూనిట్‌లు తగ్గాయి.
-
జాబితాలో స్కోడా పదవ స్థానంలో నిలిచింది. దీని MoM అమ్మకాలు 9.5 శాతం పడిపోగా, వార్షిక అమ్మకాలు 22 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి.