కొత్త బీఎండబ్ల్యూ ఎం2 కూపే కేవలం 4.3 సెకనుల్లో గంటకి 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు
జైపూర్:
బీఎండబ్ల్యూ వారు కొత్త ఎం2 కూపే తో 6-సిలిండర్ ఇన్-లైన్ ఇంజిను జత చేసి, రేర్-వీల్-డ్రైవ్ అజిలిటీ, లైట్ వెయిట్ అలుమినియం ఎం స్పోర్ట్ సస్పెన్షన్ మరియూ బాహ్యపు స్టైలింగ్ అందుకుంది. కొత్త 3.0-లీటర్ ఇంజినుతో ఎం ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ కలిగి ఉండి 6,500rpm వద్ద 370bhp శక్తి మరియూ 465Nm నుండి 500Nm యొక్క టార్క్ విడుదల చేయగలదు. 7-స్పీడ్ ఎం డబల్ క్లచ్ ట్రాన్స్మిషన్ మరియూ లాంచ్ కంట్రోల్ తో ఈ ఎం2 కూపే గంటకి 0 నుండి 100 కిలోమీటర్లు కేవలం 4.3 సెకనుల్లో చేరుకోగలదు ఇంకా గరిష్ట వేగం గంటకి 250 కిలోమీటర్లు.
కొత్త బీఎండబ్ల్యూ ఎం2 కూపే కి ఎం స్టైలింగ్ తరహాలో ముందు వైపు దిగువన పెద్ద ఎయిర్ ఇంటేకులు ఉండి, ఎం డబుల్ స్పోక్ డిజైన్ లో 19-అంగుళాల అలుమినియం వీల్స్ కి మిక్స్డ్ సైజ్ టైర్లు, వెనుక వైపు ట్విన్-టెయిల్ పైప్ ఎగ్జాస్ట్ సిస్టము కలిగి ఉంది.
ఎం3 కూపే కి ముందు ఇంకా వెనుక ఆగ్జల్స్ లైట్ వెయిట్ అలుమినియం తో చేశారు, రెండు సెట్టింగ్స్ తో ఎం సర్వొట్రానిక్ స్టీరింగ్, ఎం కాంపౌండ్ బ్రేకులు, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ యాక్టివ్ ఎం డిఫరెన్షియల్ వంటివి ఉన్నాయి. డ్రిఫ్ట్ మోడ్ కోసం, ఎం2 యొక్క డైనమిక్ స్టబిలిటీ కంట్రోల్ సిస్టం తో ఎం డైనమిక్ మోడ్ (MDM) ఉండి, వీల్స్ స్లిప్ అవ్వడానికి మరియూ కంట్రోల్ ఉండేందుకు దోహద పడుతుంది.
7-స్పీడ్ ఎం డబల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (M DCT) తో డ్రైవ్ లాజిక్ మరియూ బీఎండబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ నుండి ఒక విస్తృత ఎంపిక గల డ్రైవ్ అస్సిస్టెన్స్ అందుబాటులో ఉంది. ఇది విన్నుత్న ఆప్స్, వాహన కనెక్తివిటీని అందిస్తుంది.