ప్రపంచవ్యాప్తంగా మోడల్ S ని రీకాల్ చేసిన టెస్లా సంస్థ

published on డిసెంబర్ 02, 2015 03:16 pm by sumit for టెస్లా మోడల్ ఎస్

  • 15 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

అమెరికన్ వాహన తయారీసంస్థ టెస్లా సీటు బెల్ట్ తో ఒక చిన్న సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా "S" ప్రతి మోడల్ ని ఉపసంహరించింది. రీకాల్ ప్రపంచవ్యాప్తంగా 90,000 వాహనాలను ప్రభావితం చేస్తుంది. ఒక ప్రయాణికుడు మోడల్ S వాహనంలో ముందరి సీటులో కూర్చొని ఉండగా, వెనుక సీట్ లో కూర్చున్న ప్రయాణికుడి తో మాట్లాడుట కొరకు వెనక్కి తిరగ్గానే సీటు బెల్ట్ విరిగిపోయింది. వినియోగదారుడు చేసిన ఈ ఫిర్యాదు ఫలితంగా మోడల్ S ని రీకాల్ చేయడం జరిగింది.    

సంభందిత స్టోరీ : టెస్లా మోటర్స్ - ఒక తరం ముందుకు

కంపెనీ ప్రతినిధి  "ప్రపంచవ్యాప్తంగా రీకాల్ ఖరీదు ఎంతైనా సరే సంబందం లేకుండా సమస్యను పరిష్కరిస్తాను.  ఈ సమస్యకు సంభందించి వాడుకదారులకు ఎటువంటి ప్రమాదాలు లేదా గాయాలు కలగలేదు. మేము దర్యాప్తు చేసినా ఒక్క ఆధారం కూడా కనిపించలేదు. కారులో ఉన్న లోపాన్ని సాద్ధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తానని టెస్లా వినియోగదారులకు హామీ ఇస్తున్నాను." అని వివరించారు. కంపెనీ అధికారులు కూడా దీనిపై స్పందిస్తూ వినియోగదారులు ఈ సీట్‌బెల్ట్ ని గట్టిగా నొక్కి మరియు  80 పౌండ్ల పైన బరువుని ఉంచి చెక్ చేసుకోవచ్చు. ఈ సమస్యని పరిష్కరించేందుకు సంస్థ కి   6 నిమిషాల సమయం పడుతుందని వివరించారు.   

మోడల్ Sఇటీవలే యూరోపియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (యూరో NCAP) నుండి గరిష్టంగా 5-స్టార్ భద్రత రేటింగ్ అందుకుంది మరియు యూరో NCAP మరియు U.S నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) రెండిటి నుండి రేటింగ్ అందుకున్న కొద్ది కార్లలో ఇది ఒకటి.       

ఇది కూడా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టెస్లా మోడల్ ఎస్

Read Full News

trendingసెడాన్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience