• English
  • Login / Register

టాటా జైకా భవిష్యత్తులో AMT వెర్షన్ ని కలిగి ఉండబోతోంది

డిసెంబర్ 08, 2015 07:29 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Tata Zica

ఇకమీదట టాటా మోటార్ సంస్థ మార్కెట్‌లో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి సంపాదించుకోబోతుంది. జెస్ట్ మరియు బోల్ట్ ఇప్పటిదాకా మంచి ఉత్పత్తులు అయినప్పటికీ సామాన్య సగటు మానవుడిని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. కాబట్టి టాటా మనముందుకి ఒక జైకా అనే నూతన సమర్పణని తీసుకొస్తుంది. దీనికి ఉన్న కొత్త డిజైను మరియు వేదిక ఆధారంగా జైకా టాటా విభాగంలో ఒక నూతన పునరుజ్జీవనానికి ఆశ కల్పిస్తుంది. టాటా జైకా కి కొన్ని మంచి లక్షణాలని జోడించడం జరిగింది . దానిలో ఒక లక్షణంగా జైకా సమీప భవిష్యత్తులో ఒక AMT విభాగాన్ని కలిగి ఉంటుందని దృవీకరించబడింది.

Tata Zica Rear

ఒక బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం టాటా మోటార్స్, ప్రోగ్రామ్ ప్లానింగ్ మరియు మేనేజ్మెంట్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ ఇలా అన్నారు " ఈ రోజుల్లో సగం కంటే ఎక్కువగా నానో కార్లు ఏఎంటి వేరియంట్ నుండి వచ్చినవే. కనుక జైకా మోడల్ ను AMTతో మార్కెట్లోకి భవిష్యత్ అభివృద్దికోసం సంస్థ అందిస్తుంది."

Tata Zica Interiors

జైకా వాహనం హార్మాన్ అధారిత, సంస్థ యొక్క కనెక్ట్ నెక్స్ట్ లైనప్ అను కొత్త వినోద వ్యవస్థతో రాబోతోంది. ఈ వ్యవస్థ బ్లూటూత్, యుఎస్బి మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటి తో అందించబడుతుంది మరియు విభాగంలో మొదటిసారి 8 - స్పీకర్ సెటప్( 4 స్పీకర్లు మరియు 4 ట్విటర్స్ ) తో రాబోతుంది. వినియోగదారులు నావిగేషన్ మరియు జ్యూక్ కార్ యాప్ లు కుడా అంతరాయంలేని సంగీతం కోసం వినియోగించుకోవచ్చు. టాటా జైకా వాహనం టాటా సంస్థ యొక్క Revotron మరియు Revotorq కి చెందిన 3 సిలెండర్ల పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంది. దీని పెట్రోల్ యూనిట్ 1.2 లీటర్ Revotron, ౩-సిలిండర్ 4 వాల్వ్ MPFi ని కలిగి ఉండి 6000Rpm వద్ద 85PSపవర్ ని 3500rpm వద్ద 114Nmటార్క్ ని ఇస్తుంది.దీని డీజిల్ ఇంజన్ 1.05 లీటర్ Revotorq,3-సిలిండర్ ,4000rpm వద్ద 70PSపవర్ ని 1800-3000rpm వద్ద 140Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ టాటా Zica గురించి అన్ని తెలుసు

టాటా జైకా యొక్క మొదటి డ్రైవ్ ని వీక్షించండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience