టాటా జైకా సెడాన్: మరిన్ని వివరాలు తెలుసుకోండి
జనవరి 05, 2016 05:31 pm nabeel ద్వారా సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా మోటార్స్ భారత ఆటోమోటివ్ మార్కెట్ మీద ప్రభావం సృష్టించడానికి చాలా కష్టపడుతోంది. గత 2014 డిసెంబర్ లో 41,734 వాహనాల అమ్మకాలతో పోలిస్తే, డిసెంబర్ 2015 లో మొత్తం ప్రయాణీకుల మరియు వాణిజ్య వాహనాల యొక్క మొత్తం 39,973 యూనిట్ల అమ్మకాలలో 4% తగ్గు మొఖం చూసింది. కానీ ఇదంతా కూడా గతించిన చరిత్ర కాబోతోంది. జైకా మరియు జైకా సెడాన్ వంటి ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్ లోనికి ప్రవేశించబోవడంతో వినియోగదారులు టాటా డీలర్ల వద్ద ఉప్పెనలా రాబోతున్నారని ఆశిస్తున్నారు.
టాటా జైకా దాని సెడాన్ తో పాటూ జైకా ని ప్రారంభించబడుతుంది. ఈ కారు సెడాన్ పైన అదనపు బూట్ కాకుండా మిగతాదంతా దాదాపు ఒకేలా ఉంటుంది. ఇది జైకా సెడాన్ అదే ఇంజిన్, లక్షణాలు మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. సెడాన్ వాహనం సబ్ జెట్ కేటగిరీ లో వస్తుందని భావిస్తున్నారు మరియు ఫిగో ఆస్పైర్ మరియు ఎక్సెంట్ వంటి సబ్ 4 మీటర్ వంటి వాహనాలతో పోటీ పడుతుంది. అయితే టాటా జైకా హ్యాచ్‌బ్యాక్ యొక్క నిపుణుల రివ్యూ బయటకి వచ్చినప్పటికీ దానిలో సెడాన్ యొక్క వివరాల గురించి చాలా తక్కువ చెప్పడం జరిగింది.
లుక్స్:
టాటా దాని పాత డిజైన్ భాషతో ఓడి కొత్త డిజైన్ నెక్స్ట్ ని ప్రవేశపెట్టింది. టాటా జైకా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండి టాటా యొక్కపోర్ట్ పోలియో లో అద్భుతంగా కనిపిస్తుంది. కొత్త హెడ్‌లైట్ క్లస్టర్ తో పాటూ కొత్త హనీ కోంబ్ గ్రిల్ క్రోమ్ లైన్ ద్వారా మార్క్ చేయబడి కారు యొక్క లుక్ ని మరింత ఆకర్షణీయంగా చేసింది. బహుశా, సెడాన్ అదే టైల్ లైట్ క్లస్టర్ ని ఉపయోగించవచ్చు. రాప్ అరౌండ్ యూనిట్ పక్క ప్రొఫైల్లో ఒక బలమైన శరీరం లైన్ కలుస్తూ సైడ్ ప్రొఫైల్ కు ఒక బోల్డ్ లుక్ ఇస్తుంది. కారు యొక్క వెడల్పు మరియు ఎత్తు అదే (వెడల్పు - 1,647mm, ఎత్తు - 1,535mm ) ఉంటుందని భావిస్తున్నారు కానీ పొడవు బహుశా 3,988mm - 3,999mm పరిధిలో ఉండవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 170mm నుండి 173mm కి పెరిగింది. అంతర్భాగాలలో జైకా సెడాన్ టాప్ ఎండ్ లో శరీరం రంగు ఏ.సి వెంట్ ప్యాలెట్లతో ఆకట్టుకుంది మరియు మధ్యలో ఒక ప్రదర్శన యూనిట్ ని కలిగి ఉంది.
లక్షణాలు:
టాటా ఈ సెడాన్ లో జెస్ట్ వలే అన్ని లక్షణాలను అందించింది. మిగతా అన్ని వివరాలు తెలుసుకునేందుకు వేచి ఉండండి. జైకా వలే, సెడాన్ హర్మాన్ ద్వారా ఆధారితం చేయబడిన టాటా ConnectNext సిస్టమ్ నుండి ఒక ఇన్పుట్ అందుకున్న ఎనిమిది స్పీకర్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. ఈ సిస్టం బ్లూటూత్, USB & ఆక్స్-ఇన్ కనెక్టివిటీ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు నుండి డేటా ప్రసారం కోసం మధ్యలో ఒక పెద్ద ప్రదర్శనతో అనుసంధానించబడింది. అంతేకాకుండా జైకా వాహనం ఒక ఆండ్రాయిడ్ మొబైల్ హాట్స్పాట్ ద్వారా సీం లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ కి అనుమతిస్తుంది. ఇది బ్లూటూత్ పెయిరింగ్ యొక్క అవసరం మరియు ఆక్స్ తీగలు లేదా USB డ్రైవ్ యొక్క అవసరాన్ని ఎలిమినేట్ చేస్తుంది. అలానే ఈ సెడాన్ బ్లూటూత్ ద్వారా ఒక ఆండ్రాయిడ్ పరికరానికి జత చేయబడిన తరువాత కారు యొక్క సమాచార వ్యవస్థపై నావిగేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రదర్శించే నావిగేషన్ యాప్ ని కలిగి ఉంటుంది.
ఇంజిన్:
టాటా జైకా కొరకు 3-సిలిండర్ మిల్లుల కొత్త లైనప్ ప్రవేశపెట్టింది. ఇదే లాజిక్ జైకా లో కూడా కనుగొనబడవచ్చు. రెవొట్రాన్ గా నామకరణం చేయబడిన 1.2 లీటర్ 4 వాల్వ్ ఎమ్పిఎఫ్ఐ పెట్రోల్ యూనిట్ , 83 బిహెచ్పిల శక్తిని మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ని గరిష్టంగా అందిస్తుంది. రివొటార్క్ గా పిలవబడే 1.05 లీటర్ CRAIL డీజిల్ ఇంజిన్ 70బిహెచ్పిల శక్తిని మరియు 140ఎన్ఎమ్ టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ కారులో ప్రయాణ సామర్ధ్యం మరింతగా పెంచేందుకు సిటీ లేదా ఎకో డ్రైవ్ మోడ్ వంటి డ్రైవింగ్ మోడ్లు అందించడం జరిగింది. డ్రైవర్ సిటీ లేదా ఎకో డ్రైవ్ మోడ్ ఎంచుకోవచ్చు.
భద్రత:
జైకా సెడాన్ ఒక సురక్షిత డ్రైవ్ వైపు దృష్టి పెట్టేందుకు చాలా కొత్త టెక్నాలజీలను దీనిలో వినియోగించింది. పైన తెలిపిన టెక్నాలజీలలో 9 వ తరం EBDతో ABS, సమాచార వినోద వ్యవస్థ తో వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఈ అసిస్ట్లులతో పాటుగా, కారు ఎనర్జీ అబ్సార్బింగ్ శరీర నిర్మాణంతో రూపొందించబడింది. అంతేకాకుండా, కారులో ప్రయాణికులకు మరింత భద్రత అందించేందుకు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ అందించబడుతున్నాయి.
టాటా మోటార్స్ వారి ఉత్పత్తుల అభివృద్ధిపై భారీగా కృషి చేస్తుంది. ఇటీవల వారు R&D (పరిశోధన మరియు అభివృద్ధి), పెట్టుబడుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో టాప్-50 జాబితాలో చేరారు. అయితే మెజారిటీ భాగం, దాని ఊఖ్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు వెళ్ళింది. నాణ్యతను పెంపొందించే భారతీయ ఉత్పత్తులను కూడా చూడవచ్చు.
టాటా జైకా మొదటి డ్రైవ్ రివ్యూ చూడండి
ఇంకా చదవండి
క్రొత్త టాటా జైకా గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు