రేపు Punch EVని పరిచయం చేయనున్న Tata, నెల చివరిలో విడుదల
టాటా పంచ్ EV కోసం ansh ద్వారా జనవరి 05, 2024 01:55 pm ప్రచురించబడింది
- 465 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పంచ్ EV అనేకసార్లు టెస్ట్ చేయబడుతూ కనిపించింది, ఇది 500కిమీ వరకు పరిధిని అందిస్తుందని అంచనా
-
ఇది విభిన్న పరిధులు మరియు ధరల కోసం రెండు బ్యాటరీ ప్యాక్ؚలతో రావచ్చు.
-
ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ EV నుండి ప్రేరణ పొందిన ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚను కలిగి ఉంటుంది.
-
ఇతర కొత్త మోడల్ؚల వలె దీని క్యాబిన్ కూడా నవీకరణలను పొందుతుంది అని అంచనా.
-
భారీ టచ్ؚస్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు మల్టీ-లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ؚతో రావచ్చు.
-
ధరలు రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.
ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ ఆఫరింగ్ టాటా పంచ్ EV ఇప్పటివరకు అనేకసార్లు టెస్ట్ చేయబడుతూ కనిపించింది. ఈ ఎలక్టిక్ మైక్రో SUVని రేపు ఆవిష్కరిస్తున్నట్లు సూచిస్తూ తన EV-ప్రత్యేక సోషల్ మీడియా చానెల్ؚలో టాటా ఒక వీడియోను విడుదల చేసింది. పంచ్ EVని ఇప్పటివరకు అధికారికంగా విడుదల చేయకపోయినప్పటికీ, ఇప్పటివరకు కనిపించిన రహస్య చిత్రాల ప్రకారం, ఇది నవీకరించిన నెక్సాన్ EV నుండి పొందిన ఎలిమెంట్ؚలను కలిగిన కొత్త డిజైన్ؚతో రావచ్చు. పంచ్ EVలో అందించే అవకాశం ఉన్న అన్నీ ఫీచర్ల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
A post shared by TATA.ev (@tata.evofficial)
నెక్సాన్ EV నుండి ప్రేరణ పొందిన డిజైన్
తన తోటి ICE (ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్) వాహనంలో ఉన్న అదే సిల్హౌట్ؚను పంచ్ EV కలిగి ఉంటుంది, అయితే ఫేసియాలో భిన్నమైన డిజైన్ؚ ఉండవచ్చు. దీని ఫ్రంట్ ప్రొఫైల్ؚలో, నెక్సాన్ EVలో ఉన్న LED DRLలు మరియు నాజూకైన LED హెడ్ؚలైట్లు వంటి లైటింగ్ ఎలిమెంట్ؚలు ఉండవచ్చు. ICE పంచ్ؚతో పోలిస్తే గ్రిల్, అలాగే అలాయ్ వీల్స్ డిజైన్ కూడా భిన్నంగా ఉండవచ్చు.
పంచ్ EV క్యాబిన్ వివరాలు రహస్య చిత్రాలలో కనిపించలేదు, కానీ టాటా ఇతర కొత్త మోడల్ؚలలో ఉన్నట్లు భారీ సెంట్రల్ స్క్రీన్ؚను పొందవచ్చు. ఈ కారు తయారీదారు నలుపు మరియు తెలుపు క్యాబిన్ థీమ్ؚను ICE పంచ్ؚలో కొనసాగించవచ్చు, అయితే డ్యాష్ؚబోర్డు లేఅవుట్ EV-ప్రత్యేక యాక్సెంట్ؚలతో భిన్నంగా ఉంటుందని అంచనా.
500కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందా?
పంచ్ EVతో టాటా అనేక బ్యాటరీ ప్యాక్ؚలను అందించవచ్చు. ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ప్యాక్ؚలతో వస్తుందని అంచనా. ఈ కొత్త-జనరేషన్ ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ సెట్ؚఅప్ 500కిమీ వరకు క్లెయిమ్ చేసిన పరిధిని అందించవచ్చు. అలాగే, ఇది బహుశా ప్యాడిల్ షిఫ్టర్ؚలతో మల్టీ-లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ؚను కూడా పొందుతుంది.
కొత్త ఫీచర్లు
ICE మోడల్ కంటే భిన్నమైన డిజైన్ మార్పులే కాకుండా, దీని ఫీచర్ల లిస్ట్ؚలో కూడా కొన్ని అప్ؚగ్రేడ్ؚలు ఉండవచ్చు. పంచ్ EV, భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్ؚరూఫ్, మరియు క్రూయిజ్ కంట్రోల్ؚలతో రావచ్చు.
ఇది కూడా చదవండి: పంచ్ 3,00,000 యూనిట్ؚను విడుదల చేసిన టాటా
భద్రత విషయంలో, 6 ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ؚవ్యూ కెమెరా, మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ؚలను పొందవచ్చు.
ధరలు & పోటీదారులు
టాటా పంచ్ EV ధర రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు, ఇది సిట్రోయెన్ eC3తో పోటీ పడుతుంది. టాటా టియాగో EV మరియు MG కామెట్ EVలకి ప్రీమియం ప్రత్యామ్నాయం కూడా కావచ్చు, అలాగే టాటా నెక్సాన్ EVకి మరింత చవకైన ప్రత్యామ్నాయం అవుతుంది.
ఇక్కడ మరింత చదవండి: పంచ్ AMT
0 out of 0 found this helpful