టాటా టియాగో: తెలుసుకోవలసిన 8 విషయాలు
టాటా టియాగో 2015-2019 కోసం konark ద్వారా మే 08, 2019 11:09 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా మోటార్స్ తాజాగా హాచ్బ్యాక్ సెగ్మెంట్ లో టియాగో 2016 నాటికి అత్యంత ఎదురుచూస్తున్న హాచ్బాక్లలో ఒకటిగా నిలిచింది. టాటా టియాగో ధర రూ. 3.2 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)వద్ద మొదలవుతుంది. ఈ హ్యాచ్బ్యాక్ ముందుగా 'జికా' అని పేరు ని కలిగి ఉండేది మరియు టాటా దీనికి 'టియాగో' అని పేరు మార్చింది. దీనికి కారణం జికా అనే పేరు ‘జికా వైరస్’ పేరు లా ఉంది, అందువలన దీనికి పేరు మార్చడం జరిగింది.
టాటా టియాగో గురించి మీరు తెలుసుకోవలసిన ఎనిమిది వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి:
1. కొత్త ఇంజన్లు:
ఈ వాహనం కోసం రూపొందించిన రెండు బ్రాండ్-న్యూ ఇంజిన్ల ఎంపికతో టియాగోకు శక్తినివ్వబడుతుంది. 1.2 లీటర్ రెవోట్రాన్, మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి, 84bhp పవర్ ను మరియు 114Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 1.05 లీటర్ రెవోటార్క్ మూడు సిలిండర్ డీజిల్ ఇంజిన్ 69bhp శక్తి మరియు 140Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
2. సౌకర్యవంతమైన ఫీచర్లు:
టియాగో హర్మాన్-కర్డాన్ తో అభివృద్ధి చేయబడిన మ్యూజిక్ వ్యవస్థని కలిగి ఉంది, ఇది ఎనిమిది స్పీకర్లు కలిగి ఉంది. ఇది GPS-నావిగేషన్ మరియు జూక్ కార్ యాప్ ని కలిగి ఉంటుంది, దీని కార్లో ఒక Wi-Fi హాట్ స్పాట్ ని సృష్టిస్తుంది, ఇది ఒక సాధారణ మ్యూజిక్ ప్లేజాబితాను పంచుకోవడానికి 10 మొబైల్ ఫోన్లను అనుమతిస్తుంది. ఇది రేర్ పార్కింగ్ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది, ఇది కఠినమైన ప్రదేశాల్లో కారును పార్కింగ్ చేయాల్సి వచ్చినపుడు బాగా ఉపయోగపడుతుంది.
3.పవర్ :
డీజిల్ 1.05-లీటరు, 3-సిలిండర్ ఇంజన్ కొంచెం నిదానంగా ఉంటుంది, ఎందుకంటే మీరు డీజిల్ ఇంజిన్ నుండి ఆశించినంత టార్క్ దీనిలో ఉత్పత్తి అవ్వకపోవడం వలన పవర్ అనేది నెమ్మదిగా ఉంటుంది. మరొక వైపు, పెట్రోల్ మోటార్ మంచి సిటీ డ్రైవబిలిటీ కలిగి ఉంటుంది. గత సంవత్సరం గోవాలో మేము టాటా టియాగోను నడిపించాము. ఇప్పుడు చూద్దాము.
4.డిజైన్ మరియు భద్రత:
టాటా డిజైన్ డిపార్ట్మెంట్ లో కష్టపడి పనిచేసింది మరియు పూణే, UK మరియు ఇటాలియన్ స్టూడియోల నుండి ఇన్పుట్లను ఉపయోగించింది. దీని బిల్డ్ మరియు రైడ్ క్వాలిటీ ఈ సెగ్మెంట్ లో మునుపెన్నడూ లేని విధంగా ఉంటాయి. ఈ కారు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు 9 వ తరం EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో ABS(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం) మరియు కార్నింగ్ స్టిబిలిటీ కంట్రోల్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇది వాహనం కార్నర్స్ లో తిరిగేటప్పుడు కంట్రోల్ తప్పకుండా చూసుకుంటుంది.
5. బరువు:
టియాగో 1050 కిలోల బరువును కలిగి ఉంటుంది, ఇది భారీగా ఉంటూ మరియు త్వరిత ఆక్సిలరేషన్ ని తగ్గిస్తుంది. అయినప్పటికీ, అదనపు బరువు కారణంగా, టియాగో ట్రిపుల్-స్పీడ్ లో కూడా స్థిరంగా వెళుతుంది.
6.వెనుక సీట్ వెడల్పు:
వెనుక సీటులో షోల్డర్ రూం మరియు హెడ్‌రూం చాలా టైట్ గా ఉంటాయి. వెనుక సీటులో ముగ్గురు పెద్దవాళ్ళు గనుక కూర్చున్నట్లయితే దూరపు ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండవు.
7. ఎండూరెన్స్ రన్:
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో వాహన రీసెర్చ్ మరియు డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (VRDE) వద్ద టాటా మోటార్స్ ఇటీవలే "మేడ్ ఆఫ్ గ్రేట్" అని పిలవబడే ఎండూరెన్స్ రన్ ని నిర్వహించింది. టియాగో యొక్క కొత్త ఇంజన్లు ఎండురెన్స్ రన్ లో పరిశ్రమ నుండి 60 మంది కంటే ఎక్కువ ప్రొఫెషినల్ డ్రైవర్లు మరియు ఆటో నిపుణుల చేత టెస్ట్ చేయబడ్డాయి.
8. పోటీ:
టాటా టియాగో కారు మారుతి సెలెరియో, హ్యుందాయ్ గ్రాండ్ i10, చేవ్రొలెట్ బీట్ కు వ్యతిరేకంగా హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ లో పోటీ చేస్తుంది.
Also read:
Tata Tiago: Will It Change Tata Motors' Fortunes?
Battle of Hatchbacks: Tiago vs Beat vs Celerio vs i10
Read More on : Tata Tiago review
0 out of 0 found this helpful