టాటా వారు బోల్ట్, జెన్ఎక్స్ నానో ఇంకా సఫారీ స్టార్మ్ ని బిగ్ బాయ్స్ టాయ్స్ ఎక్స్‌పో లో ప్రదర్శించారు
అక్టోబర్ 12, 2015 11:21 am manish ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మూడు రోజులు జరిగే 2015 బిగ్ బాయ్స్ టాయ్స్ ఎక్స్పో ఈరోజు మొదలు అవుతుంది. ఇందులో సైకిళ్ళ దగ్గర నుండి కార్ల వరకు అన్నిటినీ ప్రదర్శిస్తుంది మరియూ అందరు ఆటోమోటివ్ ఔత్సాహికులకు ఇది ఒక పండుగ వంటిది. ప్రపంచ వ్యాప్తంగా అందరు వాహన తయారీదారులు ఇందులో పాలుపంచుకొంటుండగా అందులో ప్రధానమైనవారు టాటా మోటర్స్ వారు. టాటా వారు వారి పునరుద్దరించిన సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీ, బోల్ట్ మరియూ నానో హ్యాచ్‌బ్యాక్ లను ప్రదర్శించనున్నారు.
ఈ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీ కి ముందు వైపు బంపరుపై ఉన్న ఫాగ్ ల్యాంప్స్, గార్మిన్ వారి పర్సనల్ న్యావిగేషన్ డివైజ్, రూఫ్-పై అమర్చిన ఫాగ్ ల్యాంప్స్, హుడ్ స్కూప్, అల్లోయ్ తో బురదను సైతం తట్టుకోగలిగే టైర్లు, డేటైం రన్నింగ్ లైట్స్, హుడ్ డిఫ్లెక్టర్, క్రోము పూత, టెయిల్‌గేట్-మౌంటెడ్ సైకల్ క్యారియర్, లేజర్ షేడ్స్, డోర్-వైజర్, కార్ ఆనింగ్, చిల్లర్/వార్మర్, సీట్ ఆర్గనైజర్, సీట్ కవర్లు, కోటు హ్యాంగర్ ఇంకా రబ్బర్ మ్యాట్లు. ఇవి ఈ ఎస్‌యూవీ కి ఆఫ్-రోడర్ లుక్ ని అందిస్తాయి.
టాటా వారు ప్రదర్శిస్తున్న హ్యాచ్‌బ్యాక్స్ లలో ఈ జెన్ఎక్స్ ముందు వరుసలో ఉంది. కంపెనీ వారి హ్యాచ్‌బ్యాక్ లలో బోల్ట్ కూడా ఒకటి. కారుకి అల్లోయ్ వీల్స్, ర్యాలీ టైర్స్, 5 పాయింట్ సురక్షణ ఇంకా ర్యాలీ స్టిక్కర్లు కలిగి ఉంది.
ఆఖరున భారీగా హంగులు అందుకున్న జెన్ఎక్స్ నానో గురించి మట్లాడుకుందాము. కారు కి బాడీ కిట్, సన్‌రూఫ్, స్పాయిలర్, అల్లోయ్ వీల్స్, గ్రాఫిక్స్, రిమోట్ హ్యాచ్ విడుదల, లెదర్ సీట్ కవర్లు తో కుషన్స్, డోర్ వైజర్ మరియూ కార్పెట్ వంటి లక్షణాలు ఉంటాయి. పెరుగుతున్న పోటీతో టాటా వారిచే ఈ అడుగు కంపెనీకి ఎంతో దోహదం చేస్తుంది.