• English
  • Login / Register

10.25 అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేలు మరియు అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్‌ను పొందనున్న Tata Punch EV

టాటా పంచ్ EV కోసం anonymous ద్వారా జనవరి 12, 2024 12:38 pm ప్రచురించబడింది

  • 3.8K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నెక్సాన్ EV నుండి కొన్ని ఫీచర్లను పొందిన పంచ్ EV

Tata Punch EV Interior

టాటా పంచ్ EV  ఇప్పటికే ఆవిష్కరించబడింది, ఇప్పుడు కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క కొన్ని కొత్త చిత్రాలను విడుదల చేశారు, ఈ చిత్రాల ద్వారా క్యాబిన్ కు సంబంధించిన కొత్త సమాచారాన్ని అందించారు.

కంపెనీ విడుదల చేసిన పంచ్ EV ఫోటోలో కొత్త డ్యాష్ బోర్డు, 10.25 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది కాకుండా, నవీకరించబడిన సెంటర్ కన్సోల్ తో కొత్త టచ్-సెన్సిటివ్ AC కంట్రోల్ ప్యానెల్ చిత్రంలో కనిపించాయి. ఇది ఫేస్ లిఫ్ట్ టాటా నెక్సాన్ EV వంటి ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు కొన్ని ఫంక్షన్ల కోసం టచ్-ఆధారిత నియంత్రణలతో అందించబడుతుంది.

Tata Punch EV Upholstery

ఈ చిత్రాలలో, పంచ్ EV యొక్క కొత్త డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ కూడా కనిపిస్తుంది. అయితే, నెక్సాన్ మాదిరిగానే టాటా ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా విభిన్న ఇంటీరియర్ థీమ్ లను అందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కొత్త డ్యాష్బోర్డ్ మరియు పెద్ద టచ్స్క్రీన్ లతో విడుదల కానున్న మహీంద్రా XUV400 ప్రో వేరియంట్లు, ధర రూ.15.49 లక్షల నుండి ప్రారంభం

Tata Punch EV

పంచ్ EV స్పెసిఫికేషన్లు అధికారికంగా వెల్లడించబడలేదు, అయినప్పటికీ ఇది కొత్త యాక్టి.EV ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటుందని మనకి తెలుసు. ఈ కొత్త ప్లాట్ ఫామ్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

టాటా పంచ్ EV జనవరి 2024 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది, దీని ధర సుమారు రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది పంచ్ ఎలక్ట్రిక్ సిట్రోయెన్ eC3తో పోటీ పడనుంది. అలాగే దీన్ని టాటా టిగోర్/టియాగో EVలకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.

మరింత చదవండి : టాటా పంచ్ AMT

was this article helpful ?

Write your Comment on Tata పంచ్ EV

explore మరిన్ని on టాటా పంచ్ ఈవి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience