• English
    • Login / Register

    మళ్ళీ టెస్ట్ చేస్తూ కనిపించిన Tata Punch, వివరాలు తెలియకుండా మరింత గోప్యం

    టాటా పంచ్ EV కోసం ansh ద్వారా నవంబర్ 07, 2023 10:02 am ప్రచురించబడింది

    • 149 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    బంపర్ కింద టెయిల్ పైప్ؚను చూడవచ్చు, ముసుగులో ఉన్న ఈ పంచ్ ఎగ్జాస్ట్ బంపర్ؚలోకి ఉన్నట్లు కనిపించింది

    Tata Punch EV Spied

    • రెగ్యులర్ మోడల్ؚతో పోలిస్తే పంచ్ EV తేలికపాటి నవీకరణలను పొందనుంది, నెక్సాన్ EV స్టైలింగ్ؚతో ఉండవచ్చు

    • దీని డ్రైవింగ్ పరిధి 500కిమీ కంటే ఎక్కువ ఉంటుందని టాటా క్లెయిమ్ చేస్తుంది, అధికారిక పవర్ؚట్రెయిన్ వివరాలు ఇంకా తెలియదు.

    • ఫీచర్లలో, పెద్ద టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 6 వరకు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు వెనుక పార్కింగ్ కెమెరా ఉంటాయి. 

    • రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ సంవత్సరం విడుదల అవుతుందని అంచనా.

    టాటా పంచ్ EVని చాలా కాలంగా అభివృద్ధి చేస్తున్నారు, దీని విడుదలకు వేచి ఉండగా, కప్పబడి ఉన్న దీని టెస్ట్ వాహనం రోడ్ల పై కనిపిస్తూనే ఉంది. తాజా రహస్య చిత్రాలలో, పంచ్ EV పక్క మరియు వెనుక ప్రొఫైల్ స్పష్టంగా కనిపించింది, వీటి ద్వారా దీని డిజైన్ తెలిసింది మరియు మనలని తప్పుదోవ కూడా పట్టించింది. ఆ రహస్య చిత్రాలను చూడండి. 

    ఇది పంచ్ EVనేనా?

    Tata Punch EV Rear

    అవును, బంపర్ కింద టెయిల్ పైప్ కనిపించింది, తద్వారా ఇది ICE (ఇంటర్నల్ కంబూషన్ ఇంజన్) టాటా పంచ్ అని మనం భావించేలా చేస్తుంది.  ఇది ఎలక్ట్రిక్ వర్షన్ అని మనం భావించడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, పంచ్ EV ఇంతకు ముందు రేర్ వీల్ డిస్ؚబ్రేక్ؚలతో కనిపించింది మరియు రెండవది, ప్రస్తుత ICE పంచ్ టెయిల్ పైప్ డిజైన్ వెనుక బంపర్ؚతో కలిసి ఉంటుంది, దాని కింద నుంచి బయటకు రాదు.

    Tata Punch EV Side

    సరికొత్త అలాయ్ వీల్స్ؚతో సహా ఇతర డిజైన్ మార్పులను కూడా పంచ్ EV పొందుతుంది, నవీకరించిన టాటా నెక్సాన్ EVలో చూసిన వీల్స్ నుండి ఇవి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కనిపించిన రహస్య చిత్రాల ఆధారంగా, పంచ్ EV రీడిజైన్ చేసిన గ్రిల్ మరియు నవీకరించిన ఎయిర్ డ్యామ్ؚలను పొందవచ్చు. ఈ మైక్రో SUV పూర్తి డిజైన్ దీని తోటి పెట్రోల్ వాహనాలను పోలి ఉంటుంది అయితే టాటా దీని చుట్టూ, టిగోర్ EV మరియు టియాగో EVలలో చూసినట్లు EVకి-ప్రత్యేకమైన నీలి రంగు ఎలిమెంట్ؚను జోడించవచ్చు.

    క్యాబిన్ & ఫీచర్లు

    Tata Punch EV

    ఎలక్ట్రిక్ స్వభావాన్ని హైలైట్ చేయడానికి క్యాబిన్ؚలో కొత్త థీమ్ రావచ్చు కానీ వివరాలు తెలియలేదు. అయితే, మునుపటి రహస్య చిత్రాలను బట్టి, దీని డ్యాష్ؚబోర్డుؚలో భారీ  టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు బ్యాక్ؚలిట్ టాటా లోగోతో టాటా కొత్త రెండు-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉంటుందని తెలుసు.

    ఇది కూడా చదవండి: టాటా అవిన్యా EV, జాగ్వార్ ల్యాండ్ రోవర్ EMA ప్లాట్ؚఫార్మ్ పై ఆధారపడి ఉంటుంది

    మిగిలిన ఫీచర్లలో, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రేర్ వ్యూ కెమెరా ఉండవచ్చు. 

    బ్యాటరీ ప్యాక్ & పరిధి 

    పంచ్ EVలో, టిగోర్ EV మరియు టియాగో EVలో ఉండే అదే బ్యాటరీ ప్యాక్ؚలు ఉంటాయని, దీని క్లెయిమ్ చేసిన పరిధి 300కిమీ నుండి 350కిమీ మధ్య ఉంటుందని ఆశించినప్పటికీ, పంచ్ EV క్లెయిమ్ చేసిన పరిధి 500కిమీ కంటే ఎక్కువ ఉంటుదని టాటా అధికారులు ధృవీకరించారు, అంటే ఈ చిన్న EVలో ఆ అదనపు పరిధి కోసం మరింత సమర్ధమైన మోటార్లతో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుందని అర్ధం. 

    • మీ పెండింగ్ చలాన్ؚను చెల్లించండి

    విడుదల & ధర

    Can The Tata Punch EV Offer More Range Than The Tata Nexon EV?

    టాటా పంచ్ EV ఆవిష్కరణ ఈ సంవత్సరం చివరిలో ఉంటుందని, రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వస్తుందని అంచనా. ఇది సిట్రోయెన్ eC3తో నేరుగా పోటీ పడుతుంది అలాగే టాటా టియాగో మరియు MG కామెట్ EVలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. 

    ఇక్కడ మరింత చదవండి: టాటా పంచ్ AMT

    was this article helpful ?

    Write your Comment on Tata పంచ్ EV

    1 వ్యాఖ్య
    1
    H
    hogo
    Nov 7, 2023, 5:44:25 PM

    These posts are random

    Read More...
      సమాధానం
      Write a Reply

      explore మరిన్ని on టాటా పంచ్ ఈవి

      సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

      ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

      • పాపులర్
      • రాబోయేవి
      ×
      We need your సిటీ to customize your experience