సరికొత్త వివరాలను వెల్లడిస్తూ, మళ్ళీ కెమెరాకు చిక్కిన Tata Punch EV
టాటా పంచ్ EV కోసం ansh ద్వారా సెప్టెంబర్ 29, 2023 02:38 pm ప్రచురించబడింది
- 122 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
తాజా రహస్య చిత్రాలలో, నెక్సాన్‌లో ఉన్నటువంటి కొత్త 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ؚను పంచ్ EV పొందినట్లు కనిపిస్తోంది
-
పంచ్ EV టాటా నుండి వస్తున్న తదుపరి ఎలక్ట్రిక్ ఆఫరింగ్.
-
దిని ఎక్స్‌టిరియర్ రహస్య చిత్రాలలో, నెక్సాన్ వంటి ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ఉన్నట్లు చూడవచ్చు
-
క్యాబిన్ؚలో భారీ టచ్ؚస్క్రీన్ మరియు టాటా కొత్త రెండు-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉండే అవకాశం ఉంది.
-
350కిమీ క్లెయిమ్ చేసిన పరిధితో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉండవచ్చని అంచనా.
-
టాటా దీని ధరను రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి నిర్ణయించవచ్చు.
టాటా పంచ్ EV టెస్టింగ్ దశలో మరొకసారి కనిపించింది, ఇప్పటికీ ఇది కప్పబడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మైక్రో-SUV కొంతకాలంగా పరీక్షించబడుతుంది మరియు దీని తాజా రహస్య చిత్రాలు ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ వివరాలను తెలియజేస్తున్నాయి. మేము గమనించిన వివరాలు ఇక్కడ అందించబడ్డాయి.
కొత్త అలాయ్ వీల్స్
మునుపటి రహస్య చిత్రాలలో, పంచ్ EV ఐదు-స్పోక్ؚల అలాయ్ వీల్స్ؚతో కనిపించింది, కానీ ఇక్కడ అలాయ్ వీల్ డిజైన్, నవీకరించిన టాటా నెక్సాన్ EV నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తున్నాయి. పంచ్ EV ఈ ఏరోడైనమిక్ అలాయ్ؚలను, “ఎలక్ట్రిక్ వాహనం’ రూపం పొందడానికి తన తోటి వాహనాల నుండి పొంది ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా టియాగో EV: మొదటి సంవత్సరం పునశ్చరణ
మిగితా డిజైన్ పంచ్ ICE (ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్) వర్షన్ؚకు సారూప్యంగా ఉంది. ఇది ఇప్పటికే బొనేట్ చివర భారీ బంపర్ؚలో ఉన్న పెద్ద LED హెడ్ؚల్యాంప్ؚలతో నాజూకైన DRLలను కలిగి ఉంది. ఇప్పటి వరకు కనిపించిన రహస్య చిత్రాల ఆధారంగా, గ్రిల్ మరియు ఎయిర్ డ్యామ్ నవీకరించిన డిజైన్ؚతో వస్తున్నట్లు కనిపిస్తోంది మరియు టాటా దీని చుట్టూ కొన్ని EV-ప్రత్యేక బ్లూ డిజైన్ ఎలిమెంట్ؚలను జోడించవచ్చు.
భారీ టచ్ؚస్క్రీన్
మరొక జోడింపుగా భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండవచ్చు, రహస్య చిత్రాలలో కనిపించిన ప్రకారం, 10.25-అంగుళాల యూనిట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు కనిపించిన చిత్రాలలో పంచ్ EVలో కూడా బ్యాక్ؚలిట్ టాటా లోగోతో కొత్త రెండు-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇతర ఫీచర్‌లలో సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రేర్ వ్యూ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ ప్యాక్ & పరిధి
టాటా EV లైన్అప్‌లో మిగిలిన వాహనాల విధంగానే, పంచ్ EV కూడా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో రావచ్చు, క్లెయిమ్ చేసిన పరిధి 300కిమీ మరియు 350కిమీ ఉంటుంది బహుళ-స్థాయి రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ EV, నెక్సాన్ EV కంటే క్రింది స్థాయిలో ఉండవచ్చు. దీని ఎలక్ట్రిక్ మోటార్ వివరాలు ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇది 75PS నుండి 100PS పరిధిలో పవర్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
ధర & పోటీదారులు
టాటా పంచ్ EV ఈ సంవత్సరం చివరిలో లేదా 2024 ప్రారంభంలో విడుదల కావచ్చు, దీని అంచనా ధర రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది సిట్రోయెన్ eC3తో నేరుగా పోటీ పడుతుంది, టాటా టియాగో EV మరియు MG కామెట్ EVలకు ప్రీమియం ప్రత్యామ్నాయంؚగా నిలుస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: పంచ్ AMT